బిగ్ బాస్ ఆరో సీజన్ తో పోలిస్తే.. ఏడో సీజన్ ఇంట్రెస్టింగ్ గా ఉందని తెలుస్తుంది.. ఒక్కో ఎపిసోడ్ కు ఒక్కో విధమైన టాస్క్ లతో బిగ్ బాస్ ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నాడు.. రెండు పూర్తి చేసుకున్న ఈ షో ఇప్పటికే ఇద్దరినీ హౌస్ నుంచి బయటకు పంపింది.. మూడో వారం కోసం నామినేషన్స్ కూడా పూర్తయ్యాయి.. ఉల్టా పుల్టా సీజన్‌లో బిగ్ బాస్ ఇచ్చే ట్విస్టులు కిక్ ఇస్తున్నాయి. ఇప్పటికే రెండు వారాలు గడిచాయి.. ఇక ఈ వారం ఎలిమినేషన్ పై జనాలు ఆసక్తి కనబరుస్తున్నారు..
మూడో వారం ఓటింగ్ ఫుల్ ఫ్లోలో ఉంది. గౌతమ్ కృష్ణ, శుభశ్రీ రాయగురు, రతిక రోజ్, దామిని, ప్రిన్స్ యావర్, ప్రియాంక జైన్, అమర్ దీప్.. ఈ ఏడుగురు ఈవారం నామినేషన్స్‌లో ఉన్నారు. నటుడు, డాక్టర్ గౌతమ్ కృష్ణ తొలుత డేంజర్ జోన్‌లో ఉంటాడని అందరూ భావించారు. అయితే గౌతమ్ ఈ మధ్య వాయిస్ పెంచాడు. లాస్ట్ ఎపిసోడ్‌లో శోభా శెట్టితో భారీ డైలాగ్ వార్ నడిచింది. ఇప్పుడు మనోడు కొంత అగ్రెసీవ్ అవుతున్నాడు.. ప్రస్తుతం సింగర్ దామిని డేంజర్ జోన్లోకి వెళ్లింది.. అమర్ దీప్ చౌదరి టాప్ ఓటింగ్‌తో దూసుకుపోతున్నాడు. ఆ తర్వాతి ప్లేసులో ప్రిన్స్ యావర్ మంచి ఓట్స్ సాధించాడు. అతడికి సింపతీ పెరిగింది. తెలుగు రాకపోయినా జనాలు ఓన్ చేసుకోవడం మొదలెట్టారు.
ఇక ప్రియాంక థర్డ్ ప్లేసులో ఉండగా ఉండగా.. గౌతమ్ కృష్ణ నాలుగో స్థానంలో ఉన్నాడు. రతిక ఐదో స్థానంలో ఉంటే.. శుభ శ్రీ ఆరో స్థానానికి పరిమితమైంది. దామిని స్వల్ప ఓట్లతో అందరికంటే లీస్ట్‌లో ఉంది.. ఈ ఓట్లు కనుక ఇలానే కొనసాగితే మాత్రం దామిని ఈ వారం సర్దుకొని బయటకు వెళ్ళాల్సిందే.. జనాల ఓటింగ్ ఎప్పుడూ ఎలా ఉంటుందో చూడాలి.. ఇదిలా ఉండగా..అమర్ దీప్ పెద్దగా గేమ్ ఆడిన దాఖలాలు లేవు. వాదనలు కూడా పెద్దగా లేవు. పాయింట్ మాట్లాడలేదు. అయినా టాప్ ఓటింగ్ ఉంది. అందుకు కారణం.. సీరియల్ బ్యాచ్ సపోర్ట్… బయట అంతా సెట్ చేసుకొని వెళ్లాడని ఓ వార్త వినిపిస్తుంది.. మరి ఈ సీజన్ విన్నర్ ఆట సందీప్ అని సోషల్ మీడియాలో పెద్ద ప్రచారం కూడా జరుగుతుంది..