బిగ్ బాస్ సీజన్ 7 పై జనాలు ఆసక్తి చూపిస్తున్నారు.. సీజన్ ముగింపుకు చేరుకుంది.. దాంతో విన్నర్ ఎవరా అని జనాలు తెగ ఆలోచిస్తున్నారు.. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ఎనిమిది మంది ఉన్నారు. ఈ వారం నామినేషన్స్ లో ఏడుగురు హౌస్ మేట్స్ ఉన్నారు.. వీరిలో ఒకరు ఎలిమినేట్ కానున్నారు. అమర్ తప్ప హౌస్ లో మిగిలిన వారందరూ నామినేషన్స్ లో ఉన్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఫైనలిస్ట్ కోసం టాస్క్ లు ఇస్తున్నాడు బిగ్ బాస్. ప్రస్తుతం హౌస్ లో నలుగురి మధ్య ఫైనలిస్ట్ కంటెండర్ టాస్క్ జరుగుతుంది.
ఇందులో భాగంగా రకరకాల గేమ్ అడిస్తున్నాడు బిగ్ బాస్. తాజాగా ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు. ఈ ప్రోమోలో ఫినాలే రేస్ లో ఉన్న నలుగురు కంటెస్టెంట్స్ ప్రశాంత్, అర్జున్, యావర్, అమర్ లకు ఈ టాస్క్ ను ఇస్తాడు బిగ్ బాస్.. అందులో అమర్ విజయవంతంగా టాస్క్ కంప్లీట్ చేస్తాడు.. ఈ క్రమంలో ప్రశాంత్, అమర్ మధ్య చిన్న డిస్కషన్ జరిగింది. సంచలక్ గా ఉన్న శోభా ఇద్దరు మాట్లాడుకొని ఒక డెసిషన్ కు రండి అని చెప్పింది.. ఇక వారిద్దరూ బాగా మాట్లాడుకొని ఒక నిర్ణయానికి వచ్చారు..
అన్నీ చూసుకొని బిగ్ బాస్ విన్నర్ గా అమర్ ను ప్రకటించారు.. అయితే అమర్ కళ్ళకు ఉన్న బ్యాండ్ ను టవర్ తీసుకున్నాడు తన కళ్ళకు పెట్టుకుని చూశాడు. శివాజీ ,యావర్ కలిసి ఆ బ్యాండ్ నుంచి కనిపిస్తుందని అన్నారు. దానికి అమర్ హర్ట్ అయ్యాడు. నేను ఆడితేనే ఇలాంటి డౌట్స్ వస్తాయి అంటూ ఫీల్ అయ్యాడు . నిజంగా గెలిస్తే ఇలాంటివి వస్తాయి.వేరే వాళ్ళు ఆడితే రావు అంటూ ఫీల్ అవుతూ లోపలకు వెళతాడు.. ఇక దాని గురించి హౌస్ లో పెద్ద డిస్కర్షన్ జరుగుతుంది.. ఈరోజు ఎపిసోడ్ లో చూపిస్తారు..