బిగ్ బాస్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం కష్టమే.. కాసేపు సరదాగా ఉంటే మరి కాసేపు కోపాలు.. నువ్వా నేనా అని కాలు దువ్వుతున్నారు.. నిన్న, మొన్న ఇచ్చిన టాస్క్ లు జనాలకు కూడా విసుకు తెప్పించాయి..ఆ తర్వాత ఎప్పటిలాగే అమర్ దీప్, యావర్, గౌతమ్, సందీప్ మధ్య చిన్నపాటి గొడవలు జరిగిన సంగతి తెలిసిందే. చివరగా నాలుగో వారం పవరాస్త్ర గెలుచుకుని నాలుగో ఇంటి సభ్యుడు అయ్యాడు ప్రశాంత్. ఇక వీకెండ్ వచ్చేసింది. ఈ వారం రోజులుగా బిగ్బాస్ హౌస్ లో జరిగిన టాస్కులు, కంటెస్టెంట్స్ ప్రవర్తనపై క్లాస్ తీసుకునేందుకు రెడీ అయ్యారు హోస్ట్ నాగ్.
గతవారమే కంప్లీట్ గా హోస్టింగ్ స్టైల్ మార్చారు నాగ్. ఇక ఈవారం హోస్టింగ్ తో మరింత అదరగొట్టారు.. తాజాగా విడుదలైన ప్రోమోలో నాగ్ రెచ్చిపోయాడు.. ఇంట్లో ఉన్న ఒక్కొక్కరికి గట్టిగా ఇచ్చాడు.. ముఖ్యంగా శివాజికి, తేజకు బాగా వార్నింగ్ ఇచ్చాడు.. గౌతమ్ తేజకు బెల్డ్ వేసి లాగినప్పుడు మాత్రమే చెప్పావని.. తేజ గౌతమ్ మెడకు వేసి లాగుతునప్పుడు చెప్పలేదని.. ఆ టైంలో నీ గొంతు ఏమైందంటూ ఫైర్ అయ్యారు. తేజా రాక్షసంగా గౌతమ్ మెడకు వేసి లాగే వీడియోను చూపించి ఇక్కడ నీ గొంతు ఏమైంది అని అడగ్గా శివాజీ సమాధానం చెప్పాడు..అతని సమాధానం నచ్చక మళ్లీ గట్టిగా ఇచ్చిపడేసాడు..
ఇకపోతే సందీప్ మొత్తం ఫెయిల్యూర్ అంటూ క్లాస్ తీసుకున్నాడు. దీంతో గతవారంలాగే సారీ అంటూ సింపుల్ గా చెప్పేశాడు సందీప్. ఇక తర్వాత అమ్మాయిలు అరుస్తున్న పట్టించుకోలేదని తేజను నిలదీయగా.. ఎంకరేజ్ అనుకున్నాను అంటూ చెప్పుకొచ్చాడు తేజ. అరుస్తుంటే ఎంకరేజ్ ఎలా అనుకుంటావ్ అని నాగ్ అడగ్గా.. వాళ్లు లేదని చెప్పడంతో తేజ తప్పును ఒప్పుకున్నాడు.. అలాగే తేజ నాకు జైల్లో వెయ్యండి అని అడగారు.. కానీ సందీప్ అయితే ఇంటికి పంపించండి అంటాడు.. అయితే ఇక రేపు ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి..