బిగ్ బాస్ దాదాపుగా అయిపోతుంది.. ఈ క్రమంలో ఫైనాలే కోసం బిగ్ బాస్ గ్యాప్ లేకుండా టాస్క్ లను ఇస్తున్నాడు.. నిన్నటి నుంచి జరుగుతున్న ఈ టాస్క్ లలో కంటెస్టెంట్స్ నువ్వా నేనా అని తెగ పోటి పడుతున్నారు.. ఫినాలే అస్త్ర’ రేస్‌లో భాగంగా కంటెస్టెంట్లకు ఆట కావాలా? పాట కావాలా, ఎత్తర జెండా వంటి టాస్క్‌లు ఇచ్చారు. వీటిలో అమర్ దీప్ టాప్ స్కోరు సాధించాడం విశేషం. అలాగే రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ కూడా ఫినాలే అస్త్ర టాస్కుల్లో సత్తా చాటాడు. ఇక ఫినాలే టాస్కుల్లాగే బిగ్ బాస్ ఓటింగ్ కూడా మంచిగా ఉంది..
ఇక ఈ పదమూడు వారాలకు గాను శివాజీ, పల్లవి ప్రశాంత్, ప్రిన్స్ యావర్, ప్రియాంక జైన్, శోభా శెట్టి, అర్జున్ అంబటి, గౌతమ్ కృష్ణ నామినేషన్స్‌లో ఉన్నారు. అంటే అమర్ దీప్ చౌదరి మినహా మిగతా వాళ్లంతా నామినేషన్స్‌లో ఉన్నారు. ఇక గత మూడు రోజుల ఓటింగ్ సరళి చూస్తుంటే పల్లవి ప్రశాంత్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అతనికి సుమారు 30 శాతానికి పైగా ఓట్లు పడ్డాయి. ఇక రెండో స్థానంలో శివాజీ కొనసాగుతున్నాడు… మూడో స్థానంలో యావర్ కొనసాగుతున్నాడు.. అంటే మొత్తం మూడు స్థానాల్లో శివాజీ అండ్ బ్యాచ్ ఉన్నారు..
ఇక సీరియల్ బ్యాచ్ పరిస్థితి దారుణంగా మారింది.. అర్జున్ అంబటి నాలుగో ప్లేస్‌లో ఉన్నాడు. అతనికి 8.22 శాతం ఓట్లు పడ్డాయి. ఇక 6.97 శాతం ఓట్లతో శోభా శెట్టి ఐదో ప్లేస్‌లో ఉంది. ఆమెకు దగ్గరలో ప్రియాంక జైన్ ఉంది. ఆమె ఖాతాలో 6.84 శాతం ఓట్లు ఉన్నాయి. ఇక ఆఖరి స్థానంలో గౌతమ్ కృష్ణ ఉన్నాడు. అతనికి కేవలం 5.99 శాతం ఓట్లు పడ్డాయి. అంటే ఇప్పుడు ప్రియాంక, గౌతమ్ డేంజర్ జోన్‌లో ఉన్నారు. ఇంకా రెండు రోజులు ఓటింగ్ ఉంది.. అంటే గౌతమ్, ప్రియాంక ప్లేసుల్లో మార్పులు వస్తాయేమో చూడాలి.. కానీ ఇదే ఓటింగ్ కొనసాగితే మాత్రం డాక్టర్ బాబు దుకాణ్ సర్దుకొని బయటకు రావాల్సిందే.. చూద్దాం ఏం జరుగుతుందో..