తెలుగు టెలివిజన్ చరిత్రలోని అతిపెద్ద రియాల్టీ షోగా స్టార్ట్ అయిన బిగ్ బాస్ ఏ విధంగా ముందుకు వెళ్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఇప్పటికే ఆరు సీజన్స్ కంప్లీట్ చేసుకున్న బిగ్ బాస్ తాజాగా 7 సీజన్ కూడా స్టార్ట్ అయింది .. ఐదు వారాలు పూర్తి చేసుకున్నా కూడా పెద్దగా పాపులారిటిని పొందలేదు.. గతంలో కంటే కొత్తగా అంటూ ఇంకా చెత్తగా అనే కామెంట్స్ ను జనాలు చేస్తున్నారు.. ఇప్పటివరకు అందరు అమ్మాయిలే ఎలిమినేట్ అయ్యారు.. ప్రస్తుతం హౌస్ లో సీరియల్ బ్యాచ్ హవా నడుస్తుంది.. దాంతో రోజురోజుకు జనాల నుంచి కామెంట్స్ ఎక్కువ అవుతున్నాయి..
అయితే ఈ కామెంట్స్ బిగ్ బాస్ మేనేజ్మెంట్ వరకు వెళ్ళాయో ఏమో అందుకే వైల్డ్ కార్డు ఎంట్రీ విషయంలో చాలా కేర్ఫుల్ గా నిర్ణయాలు తీసుకున్నారు. అయితే అక్కడ కూడా అల్లాటప్ప కంటెస్టెంట్లను తీసుకొచ్చాడు .. కానీ వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన ఒక కంటెస్టెంట్ మాత్రం ఖచ్చితంగా ట్రోఫీ కొట్టే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు జనాలు. ఆయన మరెవరో కాదు అర్జున్ అంబటి .. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. పలు టీవీ సీరియల్స్ షోస్ ద్వారా జనాలకు పరిచయమైయ్యాడు..
బుల్లితెరపై క్రేజ్ ఉన్న నటుడు.. ముఖ్యంగా అర్జున్ ఫాలోయింగ్ ఎక్కువ ఆ కట్ అవుట్ ఆఫ్ ఫిజిక్ అందరూ జూనియర్ ప్రభాస్ అంటూ ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు . అయితే ఇప్పటివరకు హౌస్ లో ఉండే అందరి కంటెస్టెంట్స్ లోకి అర్జున్ అంబాటి రెమ్యూనరేషన్ ఎక్కువగా చార్జ్ చేస్తున్నాడు అంటూ తెలుస్తుంది . ఒక్కొక్క కంటెస్టెంట్ వాళ్ళ స్థాయికి తగ్గట్టు 10 వేలు,15 వేలు, 20 వరకు చార్జ్ చేస్తున్నారు.. కానీ అర్జున్ మాత్రం కాస్త ఎక్కువగానే చార్జ్ చేస్తున్నాడు.. అతనికి 35 వేలకు పై ఒక్కరోజుకు చార్జ్ చేస్తున్నట్లు వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.. మరి అర్జున్ ను ప్రజల ఎలా ముందుకు నడిపిస్తారో చూడాలి..