NTV Telugu Site icon

Ganesh Chaturthi: గణేశ్‌ ఉత్సవాలు ఎప్పుడు, ఎక్కడ ప్రారంభమయ్యాయి?.. హైదరాబాద్‌ కి ఈ సంస్కృతి ఎప్పుడు వచ్చింది?

Balagangadhar Tilak

Balagangadhar Tilak

గణనాయకుడి పండుగ వచ్చేసింది. వీధి వీధినా బొజ్జ వినాయకుడు కొలువుతీరనున్నాడు. మండపాల ఏర్పాట్లు, విగ్రహాల కొనుగోళ్లు చేస్తూ యువకుల హడావుడి చేస్తున్నారు. అయితే.. దేశ స్వతంత్య్రకాంక్షను రగిలించడంకోసం, యువతను ఏకం చేసేందుకు 1893లో మహారాష్ట్ర పుణె కేంద్రంగా సర్వ జనైఖ్య గణేశ్ ఉత్సవాలకు నాయకులు పిలుపునిచ్చారు. గణపతి ఉత్సవాలను సామాజిక వేదికలుగా చేసి కార్యక్రమాలు నిర్వహించడం ప్రారంభించారు. ఈ వేడుకల్లో కుల మతాలకు అతీతంగా ప్రతిఒక్కరూ పాల్గొన్నారు. లోకమాన్య బాలగంగాధర తిలక్ గణేశోత్సవానికి జాతీయ గుర్తింపు ఇవ్వడంలో కీలకపాత్ర పోషించారు. నాటి నుంచి వినాయక నవరాత్రులు మహారాష్ట్రను దాటి భారతదేశమంతటా నిర్వహించడం ఆనవాయితీగా మారింది.

READ MORE: Liquor Bottles: దొంగిలించిన మద్యం పంపకం విషయంలో గొడవ.. స్నేహితుడి దారుణ హత్య

1893వ సంవత్సరానికి ముందు గణేష్ ఉత్సవాలను ప్రైవేట్‌గా లేదా చిన్న స్థాయిలో నిర్వహించుకునేవారు. బ్రిటీష్ బానిసత్వం, మొఘల్‌లతో సహా ఇతర విదేశీ ఆక్రమణదారుల అణచివేత మొదలైనవి దీని వెనుకగల కారణాలని చెబుతుంటారు. హిందువులు నాటిరోజుల్లో తమ ఇళ్లలోనే గణపతిని పూజించేవారు. స్వాతంత్య్ర పోరాట విప్లవ నాయకుడు లోకమాన్య బాలగంగాధర తిలక్ దేశప్రజల ఐక్యతను, సామూహిక స్ఫూర్తిని పెంపొందించేందుకు గణేశ్‌ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ముందడుగు వేశారు. నిమజ్జనం సందర్భంగా గణపతి పందాలు నిర్వహించారు. ఈ ఉత్సవాలను బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా చేస్తున్న పోరాటాన్ని బలోపేతం చేయడానికి తిలక్‌ శాంతియుత ఆయుధంగా మలచుకున్నారు.

READ MORE:Fitness Tips: వ్యాయమం చేసే ముందు ఈ పని చేయడం లేదా..? గుండెపోటు వచ్చే ప్రమాదం

బాలగంగాధర్ తిలక్ పిలుపుతో హైదరాబాద్‌లో కూడా వినాయకుడి వేడుకలు మొదలయ్యాయి. హైదరాబాద్‌ సిటీ పాతబస్తీ శాలిబండ దగ్గరున్న భారత గుణవర్థక్‌ సంస్థను 1895లో ఉగాది రోజున స్థాపించారు. హైదరాబాద్‌లో నివసిస్తున్న మహారాష్ట్రీయులు బాలచంద్ర దీక్షిత, వక్రతుండ దీక్షిత, నారాయణరావు పిల్‌ఖానె, లక్ష్మణరావు సదావర్తె, దాదాచారి కాలెమిత్ర బృందం సారథ్యంలో మరాఠా సంస్థ ప్రారంభమైంది. ఈ సంస్థ.. తిలక్ స్పూర్తితో గుణవర్థక్‌ సంస్థ ప్రాంగణంలో వీధుల్లో వినాయకచవితి వేడుకలను ప్రారంభించింది.