ASTROLOGY: ఆశ్లేష నక్షత్రంలోకి శుక్రుడు.. జూలై వరకు ఈ 4 రాశుల వారు జాగ్రత్త!
- కర్కాటక రాశిలోని ఆశ్లేష నక్షత్రంలోకి శుక్రుడు.
- జూలై ప్రారంభం వరకు ఈ సంచారం.
- మేష, మిథున, సింహ, కన్య రాశుల వారు అప్రమత్తంగా ఉండాలి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Venus Transit 2026: జ్యోతిష్యపరంగా ఒక్క గ్రహం తన గోచారంలో రాశి మారినా ఫలితాలు వేరేలా ఉంటాయి. ద్వాదశ రాశులపై అనుకూల, ప్రతికూల ప్రభావాలు ఉంటాయి. ప్రేమ, సంపద, సౌందర్యం, విలాసాలకు కారకుడైన శుక్రుడు ప్రస్తుతం కర్కాటక రాశిలో ‘‘ఆశ్లేష నక్షత్రం’’ లోకి ప్రవేశించారు. జూలై ప్రారంభం వరకు ఈ నక్షత్రంలోనే శుక్రుడు సంచరిస్తాడు. ఇది కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు ఇస్తే, మరికొన్ని రాశుల వారికి చెడు ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. ఆశ్లేష నక్షత్రానికి అధిపతి బుధుడు. బుధ-శుక్ర గ్రహ శక్తుల కలయిక వల్ల భావోద్వేగాలు, ఆర్థిక వ్యవహారాలు, సంబంధాలు, కెరీర్ అంశాల్లో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా మూడు రాశుల వారికి ప్రమాదం పొంచి ఉందని జ్యోతిష్యులు చెబుతుున్నారు.
మేష రాశి:
మేష రాశి వారికి కుటుంబ విషయాల్లో అపార్థాలు వచ్చే అవకాశం ఉంది. ఇంట్లో వ్యక్తుల మధ్య చిన్న చిన్న విభేదాలు పెద్ద సమస్యలుగా మారొచ్చు. స్థిరాస్తి, వాహనాలు, విలాస వస్తువుల కొనుగోలు జరుపొచ్చు. ఊహించని ఖర్చలు పెరిగే అవకాశం ఉంటుంది. ప్రయాణాల్లో చివరి నిమిషంలో మార్పులు ఎదురవ్వొచ్చు.
Also Read
- Sri Veerabhadra Swamy Temple: శివయ్య వీరభద్రుడిగా వెలసిన 1500 ఏళ్ళ బ్రహ్మసూత్ర శివాలయం
- Friday Horoscope: శుక్రవారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారికి ఊహించని డబ్బు!
- Raksha Bandhan 2026: రాఖీ ఎప్పుడు కట్టాలి? ఎలా కట్టాలి? శుభ సమయాలతో పాటు రక్షా బంధన్ పూర్తి వివరాలు ఇవే..
- Lunar Eclipse 2026: ఈ ఏడాది చివరి చంద్రగ్రహణం: సమయం, ప్రభావాలు, చేయాల్సిన పనులు ఇవే
మిథున రాశి:
మిథున రాశి వారికి వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాల్లో హెచ్చుతగ్గులు కనిపించవచ్చు. కుటుంబ విభేదాలు మరింత క్లిష్టంగా మారే సూచనలు ఉన్నాయి. సంబంధాల్లో కమ్యూనికేషన్ లోపాలు అపార్థాలకు దారితీయవచ్చు. ఉద్యోగ ప్రయత్నాలు, ఇంటర్వ్యూలు, పోటీ పరీక్షల్లో ఫలితాలు ఆలస్యమవుతాయి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా భావోద్వేగాలపై నియంత్రణ అవసరం.
సింహ రాశి:
సింహ రాశి వారికి కుటుంబ, సామాజిక విషయాల్లో ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. చిన్న వివాదాలు పెద్ద గొడవలకు దారి తీయొచ్చు. ఉద్యోగం, కెరీర్లో ఆశించిన పురోగతి ఉండక నిరాశ ఎదురవ్వొచ్చు. పరీక్షలు, ఇంటర్వ్యూ ఫలితాల కోసం ఎదురుచూస్తున్న వారు ఓపికగా ఉండాలి.
కన్య రాశి:
కన్య రాశి వారు ఈ సమయంలో సంబంధాల విషయంలో సున్నిత పరిస్థితులు ఎదుర్కోవచ్చు. జీవిత భాగస్వామి లేదా కుటుంబ సభ్యుల మధ్య అపార్థాలు పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక బాధ్యత పెరగడం వల్ల ఒత్తిడి ఎదురవుతుంది. వ్యాపారులు, ఉద్యోగులు ముఖ్యమైన ప్రాజెక్టుల్లో ఆలస్యాలు పెరుగొచ్చు. పెద్ద పెట్టుబడులకు దూరంగా ఉంటే బెటర్.
పరిష్కారాలు:
శుక్రుడి అనుకూల ఫలితాల కోసం ‘‘ఓం శుం శుక్రాయ నమ:’’ మంత్రాన్ని జపించాలి. శుక్రవారం లక్ష్మీదేవిని పూజించండి. పాలు, చక్కెర, స్వీట్ల వంటి తెలుపు రంగు వస్తువుల్ని దానం చేయండి. శుక్రవారం ఉపవాసం ఉండండి. తెలుపు లేదా లేత రంగు దుస్తులు ధరించడం మంచిది.
తాజావార్తలు
-
TGIIC : రాయదుర్గం భూములకు జాక్‌పాట్.. రూ.2,833 కోట్ల రాబడి
-
Ram Mohan Naidu: ‘పీ4’ విధానంలో శ్రీకాకుళం జిల్లాకు ‘ఎ’ గ్రేడ్.. ప్రశంసించిన కేంద్ర మంత్రి..
-
Nepal Floods: ఏం ఇళ్లురా ఇది, కట్టిన వాడికి ‘‘నేపాల్ రత్న’’ ఇవ్వాల్సిందే.. వరదల్లో చెక్కు చెదరలేదు.. వీడియో వైరల్..
-
Mahendragiri Varahi : 150 ఏళ్ల మరణాల మిస్టరీతో సుమంత్ సినిమా ట్రైలర్..డీజే టిల్లు సర్ ప్రైజ్ !
-
Sumanth : ఈ కథను పట్టుకుని నేను, డైరెక్టర్ మూడేళ్లు ట్రావెల్ అయ్యాం!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్‌ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!