నేలసారం చూడకుండా విత్తునాటితే మొక్క మొలవదు. అలాగే పూజ సారం తెలియకుండా, ముహూర్తం లేకుండా దేవుడ్ని కొలిస్తే ఫలితం ఉండదు. అన్ని పనులను వినాయకుడి పూజతోనే ప్రారంభిస్తారు. అంతటి ప్రాధాన్యం కలిగిన విఘ్నేశ్వరుడి నుంచి నేటి యువతరం, పిల్లలు అందిపుచ్చుకోవాల్సిన అంశాలెన్నో ఉన్నాయి. ముందుగా రేపటి పూజా ముహూర్తం గురించి తెలుసుకుందాం. సుభముహూర్తంలో పూజిస్తే ఎన్నో విజయాలను సొంతం చేసుకోవచ్చు. కాగా.. ఇప్పటికే మండపాల ఏర్పాట్లు, విగ్రహాల కొనుగోళ్లు చేస్తూ యువకుల హడావుడి చేస్తున్నారు. ముహూర్తం కోసం పంచాగాలు వెతుకుతున్నారు. లంబోధరుడిని ఏ సమయంలో పూజించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
READ MORE: Lavanya : కోర్టు నేను డ్రగ్స్ వాడినట్టు చెప్పిందా? కేసయితే వదిలేస్తారా?
శివపార్వతుల ముద్దుల కొడుకు విఘ్నేశ్వరుడి జన్మదినమే వినాయక చవితి. ఏటా భాద్రపద మాసంలో శుక్లపక్ష చవితి రోజున దేశవ్యాప్తంగా ఈపర్వదినాన్ని కన్నులపండుగగా జరుపుకొంటారు.. భారతీయ సమాజంలో వినాయక చవితికి విశిష్టమైన ప్రాముఖ్యం ఉంది. ఆది దంపతుల ప్రథమ కుమారుడైన వినాయకుడిని పూజించనిదే ఏ పనీ ప్రారంభించరు. ఆ గణనాథుని కృప ఉంటే అన్నీ విజయాలే లభిస్తాయనేది ప్రజల విశ్వాసం.
2024 లో వినాయక చవితి శనివారం సెప్టెంబర్ 07 న వచ్చింది. గణేశుడి మధ్యాహ్నం కాలంలో జన్మించాడని నమ్ముతారు. అందువల్ల మధ్యాహ్నం సమయం గణేష్ ఆరాధనకు అత్యంత అనువైనదిగా పరిగణిస్తారు. ధృక్ పంచాంగం ప్రకారం.. గణేష్ చతుర్థి రోజున గణపతి పూజ ముహూర్తం ఉదయం 11:03 నుంచి మధ్యాహ్నం 01:00 వరకు ఉంటుంది. ఆరాధన మొత్తం వ్యవధి 02 గంటల 31 నిమిషాలు.
ధృక్ పంచాంగం ప్రకారం చతుర్థి తిథి 06 సెప్టెంబర్ 2024, 03:03 పీఎం నుంచి సెప్టెంబర్ 7వ తేదీ సాయంత్రం 5.37గంటల వరకు ఉంటుంది.