సోమవారం పరమశివుడికి ఎంతో ప్రత్యేకమైన రోజు.. ఆ రోజున పరమేశ్వరున్ని భక్తిశ్రద్ధలతో ప్రత్యేకంగా పూజిస్తూ ఉంటారు.. భక్తితో శివయ్యను పూజిస్తే ఆయన అనుగ్రహం లభిస్తుందని అలాగే కోరికలు నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు.. అయితే సోమవారం రోజు పరమేశ్వరున్ని ఏ విధంగా పూజించడం వల్ల ఆయన అనుగ్రహం కలుగుతుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం..
సోమవారం ఉమామహేశ్వరులను పూజిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అలాగే మనకున్న దారిద్ర్య బాధలు, ఆర్థిక సమస్యలు ఇతర సమస్యలు పోవాలంటే శివుడిని సోమవారం రోజు ప్రత్యేకంగా ఆరాధించాలి. ఇందుకోసం సోమవారం రోజు ఉదయాన్నే లేచి తలస్నానం చేయాలి. ఆ తరువాత పార్వతీ పరమేశ్వరుల పటానికి గంధం రాసి బొట్టుపెట్టి దీపారాధన చెయ్యాలి.. లింగానికి నీళ్లతో అభిషేకం చెయ్యడం వల్ల మంచి ఫలితాలను పొందుతారు.. విభూదిని సమర్పిచి,ఆ విభూతిని నుదిటిన ధరించాలి. మూడు ఆకులు కలిగిన బిల్వపత్రం శివుని మూడు కనులకు చిహ్నం.
అంతేకాదు త్రిశూలానికి సంకేతం కూడా. ఈ బిల్వపత్రాన్ని శివునికి సమర్పించడం వల్ల దారిద్ర్యం తొలగిపోతుంది. అలాగే తుమ్మి పూలు, జిల్లేడు పూలు, మోదుగ పూలతో స్వామిని పూజించడం మంచిది… ఇక శివ అష్టోత్తరం చదువుతూ సాయంత్రం వరకు ఉపవాసము ఉండి శివాలయానికి వెళ్లి లేదా ఇంట్లోనైనా శివుడి దగ్గర ఆవు నేతితో దీపారాధన చేయాలి. సాయంత్రము పరమశివునికి నైవేధ్యంగా నేతితో తాలింపు వేసిన దద్దోజనం సమర్పించాలి. ఇలా ప్రతి సోమవారం చేయడం వల్ల అప్పుల బాధలు, ఆర్థికపరమైన సమస్యలు తొలగిపోయి ఐశ్వర్యవంతులు అవుతారు. అయితే మనసు శివుడి మీద పెడితేనే శివానుగ్రహం లభిస్తుంది.. ఈ విధంగా కొన్ని వారాలు చేస్తే చాలా మంచిది.. సకల శుభాలు కలుగుతాయి..