హిందువులు జరుపుకొనే పండుగలలో మహాశివరాత్రి కూడా ఒకటి.. ప్రపంచవ్యాప్తంగా ఈ పండుగను అంగరంగ వైభవంగా జరుపుకుంటారు.. శివుడికి ఎంత ప్రీతికరమైన రోజు.. మహాశివరాత్రి పండుగను హిందూ చాంద్రమాన మాసం ఫాల్గుణ మాసంలో 14వ రోజు వస్తుంది.. ఈ ఏడాది మార్చి 8న శివరాత్రి పండుగను ప్రజలు జరుపుకుంటున్నారు.. ఈరోజున అందరు ఉపవాసాలు చేస్తూ, ప్రత్యేక పూజలు చేస్తారు.. అసలు శివరాత్రిని ఎందుకు జరుపుకుంటారో చాలా మందికి తెలియదు.. శివరాత్రిని ఎందుకు జరుపుకుంటారో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
ఈ మహా శివరాత్రి పర్వదినానికి ఒక ప్రత్యేకత ఉంది. హిందూ పురాణాల ప్రకారం మహాశివరాత్రి సందర్భంగా శివపార్వతుల కళ్యాణం జరిగినట్టుగా నమ్ముతారు. అలాగే ఇదే రోజున లింగోద్భవం జరిగిందని కూడా చెప్తారు. పరమశివుడు పురుషుడిని సూచిస్తే, పార్వతీ దేవి ప్రకృతిని సూచిస్తుంది . సృష్టికి మూలమైన శక్తి చైతన్యాల కలయికను మహాశివరాత్రి పర్వదినంగా సూచిస్తుంది..
అలాగే ఈ పర్వదినం రోజున ఎవరు భక్తితో శివుడిని పూజిస్తారో.. ఉపవాస, జాగరణ దీక్షలను చేస్తారో .. వారందరికీ శుభాలు కలుగుతాయని, శివుడి కటాక్షం వారిపై ఉంటుందని చెబుతారు. ఈ పర్వదినాన ఎవరైతే శివుడిని మనసులో లగ్నం చేసుకుని శివయ్యను ఆరాధిస్తూ ఉపవాస దీక్షను ఆచరిస్తారో వారిపై శివుడి అనుగ్రహం కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి.. జాగరణతో కూడా సకల పాపాలు తొలగిపోయి.. మోక్షం కలుగుతుందని చెబుతున్నారు.. శివుడికి అభిషేకాలు అంటే ఇష్టం.. ఈరోజున శివ భక్తులు శివుడికి ప్రత్యేక అభిషేకాలు చేస్తారు..