మహాశివరాత్రిని భక్తులు రేపు జరుపుకోనున్నారు.. ఆ పరమేశ్వరుడిని ప్రసన్నం చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. శివరాత్రికి ముందు భక్తులు నది స్నానమాచరిస్తారు. శివరాత్రి రోజున ఆ పరమశివుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఉపవాసం ఉండటం , జాగారం చేస్తారు. ఇలా శివనామ స్మరణలతో జాగారం చేస్తే పునర్జన్మ ఉండదని నమ్ముతారు.. అలాగే సకల పాపాలు , దోషాలు తొలగి పోతాయని భావిస్తారు. ఇక శివుడికి ఇష్టమైన నైవేద్యం.. మహాశివరాత్రి నాడు ఏ ఆహార పదార్థాలను నైవేద్యంగా పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం..
శివుడు అభిషేక ప్రియుడి భక్తితో ఆయనకు అభిషేకాలు చేస్తే శివుడి అనుగ్రహం కలుగుతుందని భక్తుల నమ్మకం.. ఇక నైవేద్యం కూడా సమర్పించాలని పండితులు చెబుతున్నారు.. శివయ్యకు బెల్లం అంటే మహా ఇష్టమట.. బెల్లంతో చేసిన వంటలను నైవేద్యంగా పెడితే మంచిది.. బయట దొరికే వాటిని కాకుండా ఇంట్లోనే తయారు చేసిన వాటిని సమర్పించాలి..
అలాగే పంచామృతం.. శివుడికి పంచామృతం ఎంతో ఇష్టం.సాధారణంగా శివుడికి పంచామృతాలతో అభిషేకం చేస్తారు. పంచామృతం పాలు,పెరుగు, నెయ్యి, తేనె, చక్కెర ఉపయోగించి తయారు చేస్తారు. శ్రీఖండ్ ను కూడా తయారు చేసి పెట్టవచ్చు.. ఏ వేడుక, పండుగ జరుపుకున్నా పాయసం చేసుకుంటారు. సేమియా, గింజలు, నెయ్యి, చక్కెర వేసుకుని తయారు చేసుకోవచ్చు. ఇందులో ఆవుపాలు పోసి తయారు చేయాలి. ఎంతో రుచిగా ఉంటుంది. ఇది కూడా శివయ్యకు ఇష్టమైన నైవేధ్యం.. అటుకులతో చేసిన పాయసం అన్న శివయ్యకు ఇష్టం.. ఈ ప్రసాదాలు అన్ని శివయ్య చాలా ఇష్టమైనవే..