ఈరోజు శ్రీ కృష్ణ భగవానుడి జన్మదినం సందర్భంగా దేశ వ్యాప్తంగా జన్మాష్టమి వేడుకలను జరుపుకుంటున్నారు. తమ చిన్నారులకు శ్రీ కృష్ణుడి వేషధారణలో అలంకరించి తల్లులు మురిసి పోతుంటారు. బాలకృష్ణుడు ఎలా ఉన్నాడో అలానే తమ చిన్నారులు ఉన్నారని ముద్దాడుతుంటారు. కాగా.. శ్రీ కృష్ణ భగవానుడు అర్జునుడి ద్వారా లోకానికి గీతను ఉపదేశించాడు. సుమారు 5 వేల సంవత్సరాల క్రితం.. కురుక్షేత్ర యుద్ధభూమిలో శ్రీ కృష్ణుడు బోధించిన గీతా ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తోంది అనడంలో అతిశయొక్తి లేదు. 700 శ్లోకాలను పూర్తిగా పఠిస్తే వారు జీవితంలో ఎలాంటి సమస్యలు వచ్చినా సులభంగా ఛేదించగలరు.
READ MORE: Saripodhaa Sanivaaram: ‘సరిపోదా శనివారం’ తొలి షో అప్పుడే!
భగవద్గీత పరిచయం లేని పుస్తకం ఇది. ఒక మనిషి ఎలా ధర్మబద్ధంగా నడుచుకోవాలి.. సంతృప్తికరమైన జీవితాన్ని ఎలా గడపాలి అనేది నేర్పిస్తుంది. యుద్ధం గురించి పాఠాలు అయినా.. కుటుంబ సంబంధాల గురించి అయినా భగవద్గీతలో అనేక శ్లోకాలు ఉన్నాయి. ఇవి మనిషి జీవితాన్ని మెరుగుపరుచుకునేందుకు ఎంతో సహాయపడతాయి. జీవితం నిరుత్సాహంగా అనిపించినప్పుడు, ప్రతికూలతలను అధిగమించలేని పరిస్థితులు ఎదురైనప్పుడు, కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి భగవద్గీతలోని కొన్ని శ్లోకాలు మీకు ఉపయోగపడతాయి. భగవద్గీతలోని ఈ ఆరు శ్లోకాలు నిత్యం పఠించడం వల్ల మీలోని ప్రతికూల ఆలోచనలు తొలగిపోతాయి.
శ్లోకం: దుఃఖేశ్వనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహః ।
వీతరాగభయక్రోధః స్థితధీర్మునిరుచ్యతే॥
ఈ శ్లోకం సరళంగా జ్ఞానయుక్తంగా ఉండే మంత్రం. ఎవరి మనసు దుఃఖాల మధ్య కలత చెందకుండా ఉంటుంది. కోపం లేని వ్యక్తిని స్థిరమైన జ్ఞానం గల జ్ఞాని అంటారని ఈ శ్లోకం పరమార్ధం. కోపం ఒక వ్యక్తి మంచితనాన్ని కప్పివేస్తుంది. కోపంలో వాళ్లు మాట్లాడే మాటలు చేసే పనులు తర్వాత పశ్చాత్తాపడే చర్యలకు దారితీస్తుందని ఈ మంత్రం వివరిస్తుంది. ఇలాంటి పరిస్థితులు తలెత్తినప్పుడు ప్రశాంతంగా ఉండడం కోసం ఈ మంత్రం పఠించడం వల్ల స్థిరమైన జ్ఞానాన్ని పొందుతారు. కోపాన్ని అదుపులోకి తెచ్చుకోగలుగుతారని దాని అర్థం.