Koti Deepotsavam 2025 Day 9: కార్తీకమాసం సందర్భంగా ఎన్టీవీ, భక్తి టీవీ ఆధ్వర్యంలో జరుగుతున్న కోటి దీపోత్సవం 9వ రోజు అత్యంత వైభవంగా జరిగింది. వేలాదిగా తరలి వచ్చిన భక్తులు “ఓం నమః శివాయ” అంటూ దీపాలు వెలిగించగా, ఆ కాంతి ఎన్టీఆర్ స్టేడియం అంతటా దివ్య కాంతిని నింపింది. ప్రతి దీపం ‘ఆత్మజ్యోతి’ సందేశాన్ని అందిస్తూ, భక్తుల మనసులను మైమరిపించింది. 2012లో మొదలైన ఈ మహోత్సవం నేడు అంతర్జాతీయ ఆధ్యాత్మికోత్సవాలకు ప్రతీకగా నిలుస్తోంది. భక్తి, ఆరాధనతో నిండిన ఈ వాతావరణం ప్రతి ఒక్కరికీ ఆధ్యాత్మిక అనుభూతిని ఇచ్చింది.

కోటి దీపోత్సవం 2025లో భాగంగా తొమ్మిదో రోజు ఆదివారం (నవంబర్ 9, 2025) నాడు నిర్వహించిన విశేష కార్యక్రమాలు భక్తి తరంగాలను మరింత పెంచాయి. నేడు ముఖ్య అతిథులుగా శ్రీ మధు పండిట్ దాస్ (బెంగళూరు ఇస్కాన్ అధ్యక్షులు, అక్షయపాత్ర ఫౌండేషన్ వైస్ ప్రెసిడెంట్), శ్రీ సత్యా గౌర చంద్ర దాస్ (హైదరాబాద్ హరేకృష్ణ మూవ్‌మెంట్ అధ్యక్షులు) హాజరయ్యారు. వీరితో పాటు రాష్ట్ర మంత్రులు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు కూడా హాజరయ్యారు. భక్తులను ఉద్దేశించి శ్రీ దేవి నరసింహా దీక్షితులు గారు ప్రవచనామృతం అందించారు.
వైదిక పూజ కార్యక్రమాలలో శ్రీ నృసింహ రక్షా కంకణ పూజ, గురువాయూర్ శ్రీకృష్ణ నవనీత పూజ, నాగసాధువులచే మహారుద్రాభిషేకం నిర్వహించారు. భక్తులందరిచే శ్రీ నృసింహ విగ్రహాలకు రక్షా కంకణ పూజ నిర్వహించడం జరిగింది. ఈ రోజు ప్రధాన కార్యక్రమాలలో ఒకటిగా స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవం జరిగింది. వైకుంఠమే భువికి వచ్చిందా.. అనే రీతిలో వేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవం అంగరంగా వైభవంగా జరిగింది. అంతేకాకుండా స్వామివారికి గరుడ వాహన సేవ కూడా ఏర్పాటు చేశారు. భక్తులందరూ ఈ విశేష కార్యక్రమాలలో పాల్గొని స్వామివారి అనుగ్రహం పొందారు.
పాప పరిహారం, శాంతి, ఐశ్వర్యం అనుగ్రహించే “స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి కల్యాణోత్సవం”#BhakthiTV #Kotideepotsavam2025 #NTVTelugu #Hyderabad #Karthikamasam #Kotideepotsavam #కోటిదీపోత్సవం2025 #కోటిదీపోత్సవం pic.twitter.com/GbQQeymry4
— BhakthiTV (@BhakthiTVorg) November 9, 2025