శుక్రవారం అంటే లక్ష్మీదేవి అమ్మవారికి చాలా ఇష్టమైన రోజూ.. అందుకే ప్రతి పనిని బాగా ఆలోచించి చెయ్యాలని నిపుణులు చెబుతున్నారు.. ఒక వ్యక్తి జీవితంలోకి ఆనందం, శ్రేయస్సు, సంపద, కీర్తి అనేవి లక్ష్మిదేవి దయతోనే చేకూరుతాయి.. లక్ష్మీదేవిని ఆరాధించడానికి, ఆమె అనుగ్రహం పొందడానికి శుక్రవారమే ఉత్తమమైన రోజు. లక్ష్మీదేవి ఆశీర్వాదం పొందే వ్యక్తులు తమ జీవితంలో ఎలాంటి ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోరని చెబుతారు. అందుకే శుక్రవారం లక్ష్మీదేవిని పూజిస్తారు. కానీ కొన్ని కారణాల వల్ల లక్ష్మిదేవి కోపంగా ఉంటే.. ఇంట్లో పేదరికం ప్రారంభమవుతుంది. అందుకే శుక్రవారం చేయకూడని కొన్నిపనుల గురించి, శుక్రవారం కొనుగోలు చేయకూడని కొన్ని వస్తువుల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
శాస్త్రాల ప్రకారం పూజకు సంబంధించిన వస్తువులు, వంటగదికి సంబంధించిన వస్తువులను శుక్రవారం రోజు కొనకూడదు. అలాగే, ఆ రోజు ఆస్తిని కొనడం లేదా అమ్మడం కూడా అశుభం. కాబట్టి ఈ రోజున ఈ పనులు చేయకుండా ఉండండి.. పొరపాటున చేసారనుకోండి ఇక దాని ప్రభావం ఎలా ఉంటుందో చూడండి..
శుక్రవారం రోజు సంగీతం, అలంకరణ, కళ, అందానికి సంబంధించిన వస్తువులను కొనడం శుభప్రదంగా భావిస్తారు. తెలుపు లేదా వెండి రంగు వాహనాలు.. కొత్త బట్టలను కొనొచ్చు. వీటిని కొనడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం మీ పై ఉంటుంది..
శుక్రవారం రోజు ఎవరితోనూ డబ్బు లావాదేవీలు చేయకూడదు. ఎందుకంటే శుక్రవారం నాడు అప్పు ఇచ్చినా.. తీసుకున్నా లక్ష్మిదేవి ఆగ్రహిస్తుంది. అలాగే ధన నష్టం కూడా జరగవచ్చు..
ఇక చివరగా ఈరోజు మాంసం తినడం, మద్యం తాగడం వల్ల ఇంట్లో అశాంతి ఏర్పడుతుంది. అందువల్ల ఈ రోజున స్వచ్ఛమైన శాకాహారాన్ని మాత్రమే తినండి. మాంసం, మద్యం జోలికి శుక్రవారం వెళ్లకండి.. పైన చెప్పినవన్నీ అస్సలు చెయ్యకండి..