Chanakya Niti: బంధువులైనా సరే.. ఈ విషయాలు మాత్రం చెప్పొద్దంటున్న చాణక్యుడు! ఇంతకీ ఏ విషయాలో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chanakya Niti: ఆచార్య చాణక్యుడు చెప్పిన నీతి సూత్రాలు ఇప్పటికీ జీవితానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా మన చుట్టూ ఉండే మనుషులను ఎలా అర్థం చేసుకోవాలి, ఎవరితో ఎంతవరకు విషయాలు పంచుకోవాలి అనే విషయాల్లో చాణక్య నీతి ఎన్నో సూచనలు చేస్తుంది. అందులో భాగంగా అసూయపడే బంధువుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని చాణక్యుడు హెచ్చరించినట్లు పలు నీతి గ్రంథాలు చెబుతున్నాయి. కొంతమంది బంధువులు మనపై ప్రేమతో కాకుండా, మన జీవితంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే ఉద్దేశంతో ప్రశ్నలు అడుగుతారని చాణక్య నీతి చెబుతుంది. మన ఆదాయం, కుటుంబ సమస్యలు, పిల్లల చదువు, వ్యక్తిగత విషయాలు వంటి సమాచారాన్ని సేకరించి, వాటినే అవసరమైన సమయంలో మనకు వ్యతిరేకంగా ఉపయోగించే అవకాశం ఉంటుందని పేర్కొంటుంది.
చాణక్యుడి ప్రకారం.. సమస్యల్లో ఉన్నప్పుడు మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రతి ఒక్కరి ముందు మన బాధలు, ఇబ్బందులు చెప్పడం మంచిది కాదని ఆయన సూచించారు. ఎందుకంటే మన బలహీనతలు ఇతరులకు తెలిసినప్పుడు అవే మనకు వ్యతిరేకంగా మారే ప్రమాదం ఉంటుందని తెలిపారు. ఎవరైనా విమర్శలు చేసినప్పుడు వెంటనే స్పందించడం కంటే ప్రశాంతంగా ఉండటం మంచిదని చాణక్య నీతి చెబుతుంది. అసూయపడే వ్యక్తులు మన కోపాన్ని, అసహనాన్ని చూడాలని కోరుకుంటారని.. అలాంటి సందర్భాల్లో చిరునవ్వుతో మౌనంగా ఉండటం గొప్ప సమాధానమని సూచిస్తుంది. ఎవరైనా మీ సంపాదన, వ్యక్తిగత జీవితం గురించి ఎక్కువగా అడిగితే పూర్తి వివరాలు చెప్పకుండా సాధారణ సమాధానాలతో సరిపెట్టుకోవాలని చాణక్య నీతి సూచిస్తుంది. ఎంత తక్కువ సమాచారం బయటకు వెళ్తే అంత సురక్షితంగా ఉంటామని చెబుతుంది.
Also Read
- Brahma Muhurat: "బ్రహ్మ ముహూర్తం"లో రామాయణ ట్రైలర్.. ఈ ముహూర్తం విశిష్టత ఏమిటి.?
- Horoscope : ఆగస్టులో కన్యారాశిలో శుక్రుడి సంచారం.. ఈ 6 రాశుల వారు జాగ్రత్తగా ఉండాల్సిందే.!
- Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి మిశ్రమ ఫలితాలు.. అప్రమత్తంగా లేకుంటే అంతే సంగతులు!
- Tuesday Astrology: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభవార్తలే!
ఎవరైనా “నీ వల్ల కాదు” అంటూ నిరుత్సాహపరిచినా, వెంటనే వాదనకు దిగకుండా ప్రశాంతంగా స్పందించాలని చాణక్యుడు సూచించినట్లు చెబుతారు. అలా చేయడం ద్వారా ఎదుటి వ్యక్తి ప్రతికూల ఆలోచనలకు ప్రాధాన్యత తగ్గుతుందని పేర్కొంటుంది. ఎవరైనా అందరి ముందు అవమానించే ప్రయత్నం చేసినా, గౌరవంగా స్పందించడం ద్వారా మన వ్యక్తిత్వాన్ని మరింత బలంగా చూపించవచ్చని చాణక్య నీతి చెబుతుంది. ప్రశాంతమైన ప్రవర్తనే కొన్నిసార్లు ఎదుటి వ్యక్తికి గట్టి సమాధానంగా మారుతుంది. భవిష్యత్ ప్రణాళికలు, లక్ష్యాలను అందరికీ చెప్పకుండా నిశ్శబ్దంగా కష్టపడాలని చాణక్యుడు చెప్పారు. తన సక్సెస్ మన గురించి మాట్లాడేలా జీవించాలని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికీ ఎప్పుడూ అందుబాటులో ఉండటం మంచిది కాదని, మన విలువను కాపాడుకోవాలంటే కొన్ని సందర్భాల్లో పరిమితులు, దూరం పాటించడం అవసరమని అన్నారు. ఎవరైనా పదేపదే అవమానించే ప్రయత్నం చేస్తే కోపంతో కాకుండా, ప్రశాంతంగా కానీ స్పష్టంగా సమాధానం ఇవ్వాలని అన్నారు. మొత్తంగా.. ప్రతి ఒక్కరితో స్నేహంగా ఉండటం మంచిదే అయినప్పటికీ, వ్యక్తిగత విషయాలను ఎవరితో ఎంతవరకు పంచుకోవాలో తెలుసుకోవడం కూడా జీవితంలో చాలా ముఖ్యమని చాణక్య నీతి సూచిస్తోంది.
తాజావార్తలు
-
Chanakya Niti: బంధువులైనా సరే.. ఈ విషయాలు మాత్రం చెప్పొద్దంటున్న చాణక్యుడు! ఇంతకీ ఏ విషయాలో తెలుసా?
-
Rahul Gandhi: నా మాటల్లో తప్పులేదు.. క్షమాపణ చెప్పాను.. ‘ఇడియట్స్’ వ్యాఖ్యలపై రాహుల్‌గాంధీ క్లారిటీ
-
Sai Krishna Custodial Death Case: సాయికృష్ణ కేసులో కొత్త ట్విస్ట్.. పిటిషన్ ఉపసంహరణపై హైకోర్టు సీరియస్..
-
LPG eKYC: ఎల్పీజీ కేవైసీ అప్డేట్ మెసేజ్ వచ్చిందా..? అయితే ఈ పొరపాటు అస్సలు చేయకండి..
-
Rahul Gandhi: “అమిత్ షా పోలీసులతో మాట్లాడటం నేను చూశాను”.. రాహుల్ గాంధీ సంచలన ఆరోపణ
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో గొంతు నొప్పా? ఈ అల్లం-బెల్లం కషాయం ట్రై చేయండి.!
-
Protein Tips : పనీర్ తింటున్నారా? పచ్చిదా.. వండిందా.. ఏది బెస్ట్.?
-
7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో వచ్చేస్తున్న బడ్జెట్ ఫోన్ OnePlus N6x.!
-
AI ఫీచర్లు, Intel Core Ultra ప్రాసెసర్లతో Dell XPS 13, Dell 14S, Dell 16S, Alienware 15 ల్యాప్‌టాప్‌లు లాంచ్..!
-
Subhadeep Ghosh: టీమిండియా కొత్త కోచ్‌గా మాజీ క్రికెటర్.. ఎవరీ సుభదీప్ ఘోష్?.. అంత తోపా!