Mahindra Thar 5-Door: మహీంద్రా థార్.. ఈ కార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భారత్ లోనే నెంబర్ వన్ ఆఫ్ రోడర్‌గా ఉంది. యువత దీని స్టైలిష్ లుక్స్‌కి ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం 3-డోర్‌గా ఉన్న థార్, మరికొన్ని రోజుల్లో 5-డోర్ వెర్షన్‌లో రాబోతోంది. ఈ ఏడాది మధ్యలో మార్కెట్‌లోకి విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో మహీంద్రా థార్ 5- డోర్ వెర్షన్ టెస్ట్ రన్ జరుగుతోంది. చాలా సందర్భాల్లో ఈ కార్ టెస్టింగ్ ఫేజ్‌కి సంబంధించిన ఫోటోలు కనిపించాయి.
కొత్తగా రాబోతున్న మహీంద్రా థార్ 5-డోర్ వెర్షన్ ఫీచర్ల గురించి ఇప్పటికే చర్చ నడుస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ కారుకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. థార్-5 డోర్ బురదలో ఇరుక్కుపోయి, కష్టపడుతున్నట్లు ఈ వీడియో చూపిస్తోంది. దీనిపై ప్రస్తుతం తెగ చర్చ నడుస్తోంది. థార్ ఆఫ్ రోడర్ కార్‌గా ప్రసిద్ధి చెందింది. అయితే, బురదలో ఇరుక్కుపోవడం చాలా అరుదు, అలాంటి కారు బురద నుంచి బయటకు రావడానికి ఎందుకు కష్టపడుతుందనే అనుమానం కలుగుతోంది.
Read Also: PM Modi: కుటుంబం, అవినీతి, బుజ్జగింపులే వారి ఆలోచన.. కాంగ్రెస్‌పై పీఎం మోడీ ఫైర్..
ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులో ఉన్న థార్ 3-డోర్ 4 వీల్ డ్రైవ్(4×4), రియర్ వీల్ డ్రైవ్(4×2)లో లభ్యమవుతోంది. 4వీల్ డ్రైవ్ ఇలాంటి బురద, ఇసుక వంటి ఆఫ్ రోడ్ పరిస్థితుల్లో కూడా ప్రయాణించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. తాజాగా వైరల్ అవుతున్న వీడియోను చూస్తే థార్-5 డోర్ 4×2 వేరియంట్‌గా కనిపిస్తుంది. బురద నుంచి బయటకు వచ్చే క్రమంలో థార్ వెనక చక్రాలు మాత్రమే తిరగడం వీడియోలో చూడొచ్చు.
థార్ 5-డోర్‌లో రెండు ఇంజిన్ ఆఫ్షన్లు ఉంటాయని భావిస్తున్నారు. 2.2-లీటర్ mHawk 130 CRDe డీజిల్ ఇంజన్ 130bhp మరియు 300Nm శక్తిని అందిస్తుంది. 2.0-లీటర్ mStallion 150 TGDi పెట్రోల్ ఇంజన్ 150bhp మరియు 320Nm ఉత్పత్తి చేస్తుంది. రెండు ఇంజన్లు 6-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో వచ్చే అవకాశం ఉంది. మహీంద్రా థార్ 5-డోర్ ధరల శ్రేణి రూ. 12.50 లక్షల నుండి రూ. 18.50 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉండవచ్చు.