వియత్నాం కార్ల యాజమాన్యం విన్‌ఫాస్ట్ పేరుతో భారతదేశంలో తమ తదుపరి ప్రధాన ఎలక్ట్రిక్ కారును విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. విన్‌ఫాస్ట్ లిమో గ్రీన్ పేరుతో రానున్న ఈ కొత్త ఎలక్ట్రిక్ MPV, కంపెనీ భారత్‌లో ప్రవేశపెట్టబోయే మూడవ ఎలక్ట్రిక్ మోడల్‌గా నిలుస్తుంది. ఈ మోడల్‌ను 2026 ఫిబ్రవరిలో భారత మార్కెట్‌కు అధికారికంగా పరిచయం చేయనున్నారు. విడుదల తర్వాత లిమో గ్రీన్ కియా కారెన్స్, క్లావిస్ EV, BYD eMax 7, టయోటా ఇన్నోవా క్రిస్టా వంటి మోడళ్లతో పోటీపడనుంది.
డిజైన్ పరంగా లిమో గ్రీన్‌లో కంపెనీ సిగ్నేచర్ V-ఆకారపు గ్రిల్ కనిపిస్తుందని, MPV శైలిలో రూపొందించిన బాడీ ప్యానెల్లు పక్కనుంచి స్మూత్‌గా కట్ చేసినట్టుగా ఆకర్షణీయంగా ఉంటాయని వెల్లడించారు. ఇంకా గాలి ప్రతిఘటనను తగ్గించే ఏరో కవర్లతో అలాయ్ వీల్స్ అందించనున్నారు. భారత మార్కెట్ కోసం లోకల్ తయారీని ప్రాధాన్యంగా తీసుకోవడంతో ధరను పోటీగా ఉంచడమే కంపెనీ లక్ష్యం.
ఇంటీరియర్ విషయానికి వస్తే, లిమో గ్రీన్ ప్రీమియమ్ లుక్‌తో పాటు విస్తృతమైన అంతర్గత స్పేస్‌ను అందిస్తుంది. 2+3+2 సీటింగ్ లేఅవుట్ ద్వారా మొత్తం 7 మంది సౌకర్యంగా కూర్చోవచ్చు. 10.1 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 4-స్పీకర్ ఆడియో సిస్టమ్, సింగిల్-జోన్ ఆటోమేటిక్ AC, అనేక USB ఛార్జింగ్ పోర్టులు వంటి ఫీచర్లు అందించబడతాయి. ఈ మోడల్‌కు సంబంధించిన పేటెంట్‌ను విన్‌ఫాస్ట్ ఇప్పటికే భారతదేశంలో పొందింది, అందువల్ల భారత వెర్షన్ కూడా ఇదే డిజైన్‌కు సమీపంగా ఉండే అవకాశం ఉంది.సైజు పరంగా వాహనం పొడవు 4,740 mm, వెడల్పు 1,872 mm, ఎత్తు 1,728 mm, వీల్‌బేస్ 2,840 mm గా ఉంది. భద్రతా అంశాలపై కూడా కంపెనీ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నట్లు విన్‌ఫాస్ట్ ప్రకటించింది.