Toyota Innova Hycross Facelift: E100 ఇథనాల్ టెక్నాలజీతో నవంబర్ 25న కొత్త ఇన్నోవా హైక్రాస్ లాంచ్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Toyota Innova Hycross Facelift: టయోటా (Toyota) ప్రీమియం MPV ఇన్నోవా హైక్రాస్కు ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. 2022లో భారత మార్కెట్లోకి అడుగుపెట్టిన ఈ కారుకు తొలిసారిగా భారీ అప్డేట్ అందించనుంది. కొత్త టొయోట ఇన్నోవా హైక్రాస్ పేస్ లిఫ్ట్ (Toyota Innova Hycross Facelift)ను 2026 నవంబర్ 25న విడుదల చేయనున్నారు. ప్రస్తుతం భారతదేశంలో టయోటా నుంచి అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో ఇన్నోవా హైక్రాస్ రెండో స్థానంలో ఉంది. తాజాగా ఈ కొత్త మోడల్‌కు సంబంధించిన తొలి టీజర్ కూడా విడుదలైంది.
కొత్త డిజైన్
ఫేస్‌లిఫ్ట్ మోడల్లో ప్రధానంగా ఎక్స్టీరియర్ డిజైన్‌లో మార్పులు కనిపించనున్నాయి. ప్రస్తుత మోడల్ సిల్హౌట్‌ను అలాగే కొనసాగిస్తూ ముందు భాగాన్ని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దనున్నారు. కొత్త స్లాటెడ్ గ్రిల్, రీడిజైన్ చేసిన లోయర్ గ్రిల్, షార్ప్ లైటింగ్ ఎలిమెంట్స్ ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే టెస్ట్ మ్యూల్స్‌లో కనిపించిన వివరాల ప్రకారం.. కొత్త మోడల్ ఫ్రంట్ డిజైన్ మరింత నిటారుగా ఉండనుంది. ముందు భాగంలో అనవసరమైన డిజైన్ ఎలిమెంట్లను తగ్గించి సింపుల్ లుక్ ఇవ్వడంపై టయోటా దృష్టి పెట్టింది.
Also Read
- BYD Denza Z9 GT: భారత్‌లో BYD Denza Z9 GT లాంచ్.. 2.7 సెకన్స్ లో 100 kmph స్పీడ్, 670KM రేంజ్!
- BYD Denza D9: భారత్‌లో BYD Denza D9 ఎలక్ట్రిక్ MPV లాంచ్.. 608KM రేంజ్, 9 ఎయిర్‌బ్యాగ్స్.. ధర ఎంతంటే?
- KTM X-Bow Arrow: KTM నుంచి కొత్త ఆఫ్‌రోడ్ వాహనం.. 500 యూనిట్లే, ధర రూ.92.4 లక్షలు
- TVS Callisto 110: టీవీఎస్ Callisto 110 స్కూటర్ లాంచ్.. 33 లీటర్ల స్టోరేజ్, బ్లూటూత్, నావిగేషన్‌తో అదిరిపోయే ఫీచర్లు!
సైడ్ ప్రొఫైల్‌లో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. అయితే కొత్త డిజైన్ అల్లాయ్ వీల్స్ అందించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న స్క్వేర్డ్ వీల్ ఆర్చెస్, డ్యూయల్ టోన్ ORVMలు, ఇంటిగ్రేటెడ్ టర్న్ ఇండికేటర్లు, క్రోమ్ డోర్ హ్యాండిల్స్, విండో గార్నిష్ వంటి అంశాలు కొనసాగనున్నాయి. వెనుక భాగంలో ఫ్లాటర్ టెయిల్‌గేట్, కొత్త బంపర్ డిజైన్ కనిపించవచ్చు. టెయిల్ ల్యాంప్స్‌ను యథాతథంగా కొనసాగిస్తూ వాటి డిజైన్‌లో స్వల్ప మార్పులు చేసే అవకాశం ఉంది. షార్క్ ఫిన్ యాంటెన్నా, రూఫ్ స్పాయిలర్, రేక్డ్ విండ్‌షీల్డ్ వంటి ఫీచర్లు కూడా ఉండనున్నాయి.
ప్రీమియం ఇంటీరియర్..
ఇంటీరియర్, ఫీచర్ల విషయానికి వస్తే.. ఇటీవల ఇండోనేషియాలో Kijang Innova Zenix పేరుతో విక్రయిస్తున్న ఇన్నోవా హైక్రాస్ మోడల్‌కు టయోటా పలు అప్డేట్స్ అందించింది. ఇందులో 12.3 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 7 అంగుళాల TFT MID, ప్రయాణికులందరికీ ఇన్-కార్ వైఫై, 360 డిగ్రీల కెమెరా, పనోరమిక్ వ్యూ మానిటర్, ముందు, వెనుక డిజిటల్ వీడియో రికార్డర్ (DVR) కెమెరాలను అందించింది. వీటిలో కొన్ని ఫీచర్లు భారత మార్కెట్లో విడుదలయ్యే ఫేస్‌లిఫ్ట్ మోడల్లోనూ వచ్చే అవకాశం ఉంది. ఇంకా క్యాబిన్ లేఅవుట్లో పెద్దగా మార్పులు ఉండకపోయినా.. కొత్త ఇంటీరియర్ థీమ్, అప్డేటెడ్ సీట్ అప్హోల్స్టరీ అందించవచ్చు. ప్రస్తుతం ఉన్న ట్రాపెజాయిడల్ AC వెంట్స్, సింపుల్ డ్యాష్‌బోర్డ్, ఆటోమేటిక్ గేర్ సెలెక్టర్, రైజ్డ్ సెంటర్ కన్సోల్, డోర్‌పై ఉండే సీట్ అడ్జస్ట్మెంట్ కంట్రోల్స్ కొనసాగనున్నాయి.
హైబ్రిడ్ ఇంజిన్?
ఈ ఫేస్‌లిఫ్ట్‌లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న అంశం ఫ్లెక్స్ ఫ్యూయల్ టెక్నాలజీ. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించిన వివరాల ప్రకారం.. టయోటా నవంబర్ 25న 100% బయో ఇథనాల్‌తో నడిచే E100 ఇన్నోవా హైక్రాస్‌ను విడుదల చేయనుంది. దీంతో కొత్త మోడల్లో అధిక ఇథనాల్ మిశ్రమాలకు అనుకూలంగా అప్డేట్ చేసిన స్ట్రాంగ్ హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ వచ్చే అవకాశం ఉంది. గతంలోనే టయోటా ఇన్నోవా హైక్రాస్ ఆధారంగా ఫ్లెక్స్ ఫ్యూయల్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ప్రోటోటైప్‌ను ప్రదర్శించింది. ఇందులో 2.0 లీటర్ నాలుగు సిలిండర్ల పెట్రోల్ ఇంజిన్‌కు మార్పులు చేసి హైబ్రిడ్ టెక్నాలజీని జతచేశారు. అధిక ఇథనాల్ మిశ్రమాలతో ఇంజిన్ సమర్థంగా పనిచేసేందుకు పలు కాంపోనెంట్లను కూడా అప్డేట్ చేశారు. ఈ నేపథ్యంలో ఫేస్‌లిఫ్ట్‌లోనూ ఇలాంటి పవర్‌ట్రెయిన్ అందించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
ధరలు..
ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఇన్నోవా హైక్రాస్ E20 ఫ్యూయల్‌కు అనుకూలంగా ఉంటుంది. ఇందులో 2.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ అందించారు. పెట్రోల్ వేరియంట్లు 172.99 hp పవర్, 204 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఈ ఇంజిన్ CVT గేర్‌బాక్స్‌తో పనిచేస్తుంది. వీటి ఎక్స్‌షోరూమ్ ధరలు రూ.19.53 లక్షల నుంచి రూ.21.12 లక్షల వరకు ఉన్నాయి. మరోవైపు స్ట్రాంగ్ హైబ్రిడ్ వేరియంట్లలో ఇదే ఇంజిన్‌కు ఎలక్ట్రిక్ మోటార్, బ్యాటరీ ప్యాక్‌ను జతచేశారు. ఈ పవర్‌ట్రెయిన్ 186 hp పవర్, 191 Nm టార్క్‌ను అందిస్తుంది. ఇందులో e-Drive సీక్వెన్షియల్ షిఫ్ట్ ట్రాన్స్మిషన్ ఉంటుంది. స్ట్రాంగ్ హైబ్రిడ్ వేరియంట్ల ధరలు రూ.26.76 లక్షల నుంచి రూ.32.95 లక్షల వరకు ఉన్నాయి. ఈ కొత్త మోడల్ ధరలు లాంచ్ రోజున తెలియనున్నాయి.
An iconic evolution is almost here. The stage is all set for a thunderous arrival. Join us on 25th Nov ’26 to witness the grand spectacle. Stay tuned.
#ThunderousArrival
#IconicEvolution#DrumTaoXToyota #Awesome #ToyotaIndia https://t.co/ZMzVgHqhID
— Toyota India (@Toyota_India) November 14, 2026
తాజావార్తలు
-
Toyota Innova Hycross Facelift: E100 ఇథనాల్ టెక్నాలజీతో నవంబర్ 25న కొత్త ఇన్నోవా హైక్రాస్ లాంచ్..!
-
Artist Srinivasan Dies: శ్రీవేంకటేశ్వర స్వామి చిత్రాన్ని గీసిన తొలి చిత్రకారుడు మృతి!
-
Shubhanshu Shukla: 2040 నాటికి చంద్రుడిపై భారత జెండా.. ఇదే నా అసలైన లక్ష్యం: వ్యోమగామి శుభాంశు శుక్లా
-
Polavaram Agency: పోలవరం ఏజెన్సీలో మంచు దుప్పటి.. ప్రకృతి అందాలకు మైమరచిపోతున్న పర్యాటకులు!
-
NASA Voyager 1 to Make History: 49 ఏళ్లుగా అంతరిక్షంలో ప్రయాణం.. చరిత్ర సృష్టించనున్న NASA Voyager 1
ట్రెండింగ్
-
200MP+200MP కెమెరాలు, 100W ఫాస్ట్ ఛార్జింగ్, 1TB స్టోరేజ్ తో HONOR Magic9 Pro Max నవంబర్ 24న గ్లోబల్ లాంచ్..
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీలతో నవంబర్ 23న HONOR 700 సిరీస్ లాంచ్..!
-
RRB NTPC Recruitment: రైల్వేలో 1688 క్లర్క్, టికెట్ కలెక్టర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. నేడే చివరి తేదీ.! అప్లై చేసుకున్నారా.?
-
Birsa Munda : 25 ఏళ్లకే బ్రిటిష్ సామ్రాజ్యాన్ని వణికించాడు.. బిర్సా ముండా పోరాట గాథ
-
Virat Kohli: విరాట్ కోహ్లీ ఖాతాలో చెత్త రికార్డు.. మొదటి బ్యాటర్‌గా.. మరీ తక్కువ మ్యాచ్‌ల్లోనే!