Tata Nexon facelift: నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్‌ని రివీల్ చేసిన టాటా.. సోనెట్, వెన్యూ, XUV 300కి వణుకే.. ఎలా ఉందో లుక్కేయండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tata Nexon facelift: మోస్ట్ అవెటెడ్ కార్ టాటా నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్‌ని రివీల్ చేసింది. చాలా రోజులుగా నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ ఎలా ఉంటుందా..? అని వెయిట్ చేస్తున్నవారికి కొత్త నెక్సాన్ ను పరిచయం చేసింది. గతంలో పోలిస్తే చాలా స్టైలిష్ లుక్స్ తో నెక్సాన్ రాబోతోంది. ఇండియాలో కాంపాక్ట్ SUV సెగ్మెంట్ కార్ల అమ్మకాల్లో ఈ టాటా కాప్ టాప్ పొజిషన్ లో ఉంది. కొత్తగా రాబోతున్న నెక్సాన్, కియా సోనెట్, హ్యుందాయ్ వెన్యూ, మహీంద్రా XUV 300 పోటీ ఇస్తుంది.

Also Read
- Hyundai Lounge Edition: మూడు Hyundai SUVలకు కొత్త లుక్, కొత్త ఫీచర్లు.. Lounge Edition లాంచ్, ధరలు ఇవే
- BGauss C12 MaxR: 178KM రేంజ్‌తో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. BGauss C12 MaxR లాంచ్.. 3.8 kWh బ్యాటరీ
- World EV Day 2026: Ather నుంచి Bajaj Chetak వరకు బెస్ట్ ఆప్షన్స్ ఇవే.. రేంజ్, ధర వివరాలు
- Jawa 42 All Stars Edition: జావా 42 ఆల్ స్టార్స్ ఎడిషన్ బైక్ లాంచ్.. 27.1hp పవర్, డ్యూయల్ ఛానల్ ABS, ధర ఎంతంటే?
కొత్తగా రాబోతున్న ఫేస్‌లిఫ్ట్ ఎడిషన్‌లో నెక్సాన్ ఇంటీరయర్స్, ఎక్స్టీయర్స్ చాలా మారాయి. పూర్తిగా స్పోర్టీ లుక్స్ తో వస్తోంది. గతంలో పోలిస్తే అనేక టెక్ ఫీచర్లు ఇందులో జతచేశారు. గ్రిల్ సీక్వేయల్ LED DRL, ఫంక్షనల్ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, వెనకాల కనెక్టెడ్ టెయిల్ ల్యాంప్స్ కారుకు మరింత అట్రాక్షన్ తీసుకువస్తున్నాయి. 16 ఇంచ్ అల్లాయ్ వీల్స్, డ్యూయల్ టోన్ రూఫ్ మరింత స్టోర్టీగా కనిపిస్తుంది.

Read Also: West Bengal : బెంగాల్ ఉప ఎన్నికల్లో టీఎంసీపై కాంగ్రెస్, సీపీఐఎం ఘాటు వ్యాఖ్యలు
అదిరిపోయే ఫీచర్లు..
లోపల డాష్ బోర్డు డిజైన్ చాలా వరకు మారింది. 10.25 ఇంచ్ ఫ్లోటింగ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 10.25-అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కలిగి ఉంది. ఆండ్రాయిడ్ కార్ ఫ్లే, ఆపిల్ కార్ ఫ్లేలను సపోర్ట్ చేస్తుంది. లెథెరెట్ ఫ్రంట్ సీట్లు విత్ ఆర్మ్ రెస్ట్, వెంటిలేటెడ్ సీట్లు కొత్త నెక్సాన్ లో ఉన్నాయి. వాయిస్ అసిస్టెడ్ సన్ రూఫ్, ఎయిర్ ప్యూరిఫైయర్, కూల్డ్ గ్లోవ్ బాక్స్, వైర్ లెస్ ఛార్జెర్ ఫీచర్లు ఉన్నాయి.

భద్రత విషయంలో నెక్సాన్ 5 స్టార్ NCAP రేటింగ్ సాధించింది. భారత దేశంలోనే అత్యంత సేఫ్టీ కలిగిన కారుగా పేరుంది. ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ లో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్లతో 360-డిగ్రీల సరౌండ్ వ్యూ సిస్టమ్, బ్లైండ్ వ్యూ మానిటర్, ESP, TPMS, రెయిన్ సెన్సింగ్ వైపర్లతో కూడిన ఆటో హెడ్‌ల్యాంప్‌లు మరియు కార్నరింగ్ ఫంక్షన్‌తో ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్ వంటి భద్రతా ఫీచర్లు ఉన్నాయి.

ఇంజన్ వివరాలు..
కొత్త నెక్సాన్ లో Revotron 1.2-లీటర్ టర్బో పెట్రోల్ (120PS/170Nm) మరియు Revotorq 1.5-లీటర్ డీజిల్ (115PS/260Nm) ఇంజిన్ల ఆప్షన్లను కొనసాగిస్తోంది. ఉపయోగించడం కొనసాగిస్తోంది. పెట్రోల్ ఇంజన్ ఇంతకుముందు 6-స్పీడ్ MT మరియు 6-స్పీడ్ AMT ఆప్ఫన్లు ఉండగా.. కొత్త 5-స్పీడ్ MT మరియు 7-స్పీడ్ DCA ఇంజన్ ఆప్షన్లతో వస్తోంది. డీజిల్ ఇంజన్ 6-స్పీడ్ MT మరియు 6-స్పీడ్ AMT ఆప్షన్లు ఉన్నాయి.
తాజావార్తలు
-
Telangana : పంచాయతీలకు నిధుల బిగ్ రిలీఫ్.. ట్రెజరీ జాప్యానికి చెక్..!
-
PM Modi: 2035లో భారత్ కల నెరవేరుతుంది.. 2040లో మాత్రం చంద్రుడిపై జరిగేది ఇదే!
-
Russia Aircraft Deal: భారత్‌కు రష్యా బిగ్ ఆఫర్.. 105 విమానాలు, దేశంలోనే SJ-100 తయారీ!
-
Tarique Rahman: బ్రిక్స్ సదస్సుకు బంగ్లాదేశ్ ప్రధాని రెహమాన్ దూరం.. కారణమిదే!
-
UP Election 2027: యూపీ అసెంబ్లీ ఎన్నికలు.. ఎస్పీ-కాంగ్రెస్ మధ్య సీట్ల పంచాయతీ!
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?