మారుతి సుజుకి, హ్యుందాయ్, మహీంద్రా వంటి ప్రముఖ కంపెనీల కార్లను అధిగమిస్తూ టాటా నెక్సాన్ భారత ఆటోమొబైల్ మార్కెట్లో బలమైన స్థానాన్ని సంపాదించింది. మార్కెట్‌లోకి ప్రవేశించిన రోజునుంచే నెక్సాన్ తన అత్యుత్తమ సురక్షిత నిర్మాణం, ఆకర్షణీయమైన డిజైన్, ఆధునిక టెక్నాలజీ ఫీచర్లు, శక్తివంతమైన పెట్రోల్–డీజిల్ ఇంజిన్‌లు, అలాగే డ్రైవింగ్ కంఫర్ట్‌తో ప్రజల మనసులను గెలుచుకుంది.
రోడ్డు మీద స్థిరత్వం, ధర, పనితీరు సమతుల్యతలోనూ ఇది ప్రత్యేక గుర్తింపు పొందింది. నవంబర్ నెలలో నెక్సాన్ 22,434 యూనిట్లు విక్రయించబడడంతో దేశంలోనే అత్యధికంగా అమ్ముడైన కారు గా నిలిచింది. వరుసగా మూడు నెలలుగా, సెప్టెంబర్‌లో 22,573 యూనిట్లు, అక్టోబర్‌లో 22,083 యూనిట్లు, నవంబర్‌లో 22,000 యూనిట్లకు పైగా అమ్మకాలతో—ఇది నంబర్ వన్ స్థానాన్ని కాపాడుకుంటోంది.
ముఖ్యంగా సబ్ 4 మీటర్ SUV విభాగంలో ఇప్పటివరకు మారుతి సుజుకి ఆధిపత్యం ఉన్నప్పటికీ, నెక్సాన్ నిరంతరం పెరుగుతోన్న డిమాండ్‌తో మార్కెట్‌లో తన ప్రభావాన్ని మరింత బలపరచుకుంది. ఈ కారణాల వల్లనే నెక్సాన్ భారతీయ SUV సెగ్మెంట్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన మోడళ్లలో ఒకటిగా నిలిచింది.