Tata Motors: టాటా మోటార్స్(Tata Motors), తన ఎలక్ట్రిక్ వాహనాల(EV) పోర్ట్‌ఫోలియోను మరింత బలపరుచుకోవాలని భావిస్తోంది. ఇప్పటికే, దేశంలో ఈవీ కార్ మార్కెట్‌లో టాటా అగ్రగామిగా ఉంది. అయితే, 2030 నాటికి మరో 5 కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకువస్తున్నట్లు ప్రకటించింది. భారత్‌లో వేగంగా ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహన మార్కెట్ పెరుగుతన్న నేపథ్యంలో, అగ్రగామిగా ఉన్న టాటా తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకోవాలని భావిస్తోంది. 2026 నుంచి టాటా నుంచి కొత్త ఈవీ కార్లు మార్కెట్‌లోకి రాబోతున్నాయి.
ఇందులో సియెర్రా. ev(Sierra.ev), అప్డేటెడ్ పంచ్.ev ( Punch.ev) 2026 తొలి అర్థభాగంలో రాబోతున్నట్లు తెలుస్తోంది. అదే ఏడాది చివరి నాటికి టాటా నుంచి తొలిసారిగా ప్రీమియం ఈవీ కార్ ‘అవిన్యా’(Avinya) రాబోతోంది. FY2027, FY2030 మధ్య మరో మూడు కొత్త ఈవీ మోడళ్లను ప్రవేశపెట్టే యోచనలో ఉంది.
Read Also: MEA: బంగ్లాదేశ్‌లో హిందువుల హత్యలను ఖండించిన భారత్..
టాటా మోటార్స్ ఇప్పటికే భారత్‌లో మొత్తం 2.5 లక్షల ఈవీల అమ్మకాల మైలురాయిని చేరుకుంది. దేశంలో ఇప్పటి వరకు అమ్ముడైన ఎలక్ట్రిక్ కార్లలో ఒక్క టాటా నుంచే 65 శాతం కార్లు ఉన్నాయి. ముఖ్యంగా, టాటా నుంచి వచ్చిన నెక్సాన్.ఈవీ(Nexon.ev) ఒక్కటే లక్షకు మించిన అమ్మకాలనున నమోదు చేసింది. దేశంలో లక్ష మార్కును దాటిని తొలి ఎలక్ట్రిక్ కారుగా అవతరించింది. టాటా మోటార్స్ తన ఈవీ కస్టమర్లలో తొలిసారిగా ఈవీని కొనుగోలు చేసిన వారు 26 శాతం మంది ఉన్నట్లు చెప్పింది. ప్రస్తుతం, టాటా నుంచి టియాగో, టిగోర్, పంచ్, నెక్సాన్, హరియర్ ఈవీలు ఉన్నాయి.
మరోవైపు, టాటా మోటార్స్ తన ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను మెరుగుపరుచుకుంది. టాటా ఈవీ ఓపెన్ కొలాబరేషన్ ఫ్రేమ్‌వర్క్ కింద సుమారు 4 లక్షల ఛార్జింగత్ పాయింట్లు ఉన్నాయి. ఇందుల్లో 30,000కు పైగా ఫాస్ట్ చార్జర్లు ఉ న్నాయి. 2030 నాటికి వీటిని 10 లక్షల చార్జింగ్ పాయింట్లకు, ఇందులో కనీసం 1 లక్షలకు పైగా ఫాస్ట్ చార్జర్లు ఉండాలని ప్లాన్ చేస్తోంది.
