Tata Punch: టాటా ‘పంచ్’ అదిరింది.. అమ్మకాల్లో జోరు.. టాప్ 10 కార్లు ఇవే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tata Punch: దేశీయ కార్ మేకర్ టాటా మోటార్స్ అమ్మకాల్లో జోరు చూపిస్తోంది. నెక్సాన్, టియాగో, పంచ్, ఆల్ట్రోజ్, సఫారీ, హారియర్ వంటి మోడళ్లతో పాటు ఎలక్ట్రిక్ వాహన రంగంలో కూడా తనదైన ముద్ర వేసుకుంటోంది. ఇప్పటికే టాటా నుంచి నెక్సాన్, పంచ్, టియాగో, టిగోర్ ఈవీ వెర్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఇదిలా ఉంటే మైక్రో ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో టాటా తన ‘పంచ్’ పవర్ చూపిస్తోంది. గత నాలుగు నెలల అమ్మకాలను పరిశీలిస్తే టాటా పంచ్ అత్యధికంగా అమ్ముడైన కార్‌గా నిలిచింది.
భారతీయ మార్కెట్‌లో కార్ల అమ్మకాల్లో మారుతి సుజుకీ అధిపత్యం చెలాయిస్తుంది. ఈ కంపెనీ నుంచి వ్యాగన్ ఆర్, స్విఫ్ట్, బాలెనో, డిజైర్, ప్రాంక్స్, బ్రెజ్జా, ఎర్టిగా అత్యంత ప్రజాదరణ పొందిన మోడళ్లుగా ఉన్నాయి. ఆ తర్వాత హ్యుందాయ్ం నుంచి గ్రాండ్ ఐ10నియోస్, ఐ20, వెన్యూ, క్రేటా వంటి కార్లు కూడా బాగానే అమ్మకాలను నమోదు చేస్తున్నాయి. జనవరి-ఏప్రిల్ మధ్య కార్ల అమ్మకాలను పరిశీలిస్తే టాప్-10 కార్ల అమ్మకాల్లో టాటా పంచ్ మొదటి స్థానంలో నిలిచింది.
Also Read
- Mobile SIM Card Rules 2026: మీకు తెలియకుండానే మీ పేరుపై సిమ్ ఉందా? ఇలా చెక్ చేయండి.. రిపోర్ట్ చేయండి..
- Simple Ultra: సింపుల్ అల్ట్రా ఎలక్ట్రిక్ స్కూటర్.. 400KM రేంజ్, 115 kmph స్పీడ్.. ధర ఎంతంటే?
- Hero Impulse: రీ-ఎంట్రీకి సిద్ధమైన ఐకానిక్ బైక్.. ఎక్స్‌పల్స్ కంటే తక్కువ ధరలోనే కొత్త ఆఫ్-రోడర్!
- Kia Sorento: టయోటా ఫార్చ్యూనర్‌కు సవాల్.. రూ. 28 లక్షలకే బిగ్ ఎస్‌యూవీ.. ఏపీలోనే తయారీ!
జపనీస్, కొరియన్ బ్రాండ్లను కాదని టాటా సత్తా చాటుతోంది. ఇప్పటికే కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో టాటా నెక్సాన్ అమ్మకాల్లో దుమ్మురేపుతోంది. టాప్-10 కార్ల జాబితాలో చోటు సంపాదించుకుంది. పంచ్ ఈ సంవత్సరం ఇప్పటివరకు 73,121 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది మరియు వ్యాగన్ఆర్, 71,386 యూనిట్లు మరియు బాలెనో 66,784 యూనిట్లు వంటి మోడళ్లతో పోలిస్తే ముందు వరసలో ఉంది.
Read Also: Pm Modi: ఎన్నికల ప్రచారంలో మోడీని చంపేస్తాం.. ఎన్ఐఏ కార్యాలయానికి బెదిరింపు కాల్
2024లో ఇప్పటివరకు అమ్ముడైన టాప్ -10 కార్లు(జనవరి-ఏప్రిల్):
1. టాటా పంచ్ – 73,121 యూనిట్లు
2. మారుతి సుజుకి వ్యాగన్ఆర్ – 71,386 యూనిట్లు
3 .మారుతి సుజుకి బాలెనో – 66,784 యూనిట్లు
4. మారుతి సుజుకి డిజైర్ – 64,329 యూనిట్లు
5. మారుతి సుజుకి బ్రెజా – 62,795 యూనిట్లు
6. హ్యుందాయ్ క్రెటా – 60,393 యూనిట్లు
7. మహీంద్రా స్కార్పియో – 59,302 యూనిట్లు
8. మారుతీ సుజుకి ఎర్టిగా – 58,583 యూనిట్లు
9. టాటా నెక్సాన్ – 56,803 యూనిట్లు
10. మారుతీ సుజుకి ఫ్రాంక్స్ – 54,628 యూనిట్లు
టాటా పంచ్ ఇంటర్నల్ కంబర్షన్ ఇంజిన్(ICE) మరియు ఎలక్ట్రిక్ వెహికల్ (EV) రూపంలో అందుబాటులో ఉంది. పెట్రోల్‌తో పాటు సీఎన్‌జీ ఇంధన ఆఫ్షన్లను కలిగి ఉంది. ICE మోడల్ 5-స్పీడ్ MT మరియు 5-స్పీడ్ AMT ఎంపికలతో 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ (88PS మరియు 115Nm)ని కలిగి ఉంది. ఈవీ రెండు బ్యాటరీ ఆఫ్షన్లతో అందుబాటులో ఉంది. 25kWh బ్యాటరీ 315 కి.మీ రేంజ్‌ని ఇస్తుంది. 35kWh బ్యాటరీ ప్యాక్ 421కి.మీ రేంజ్ ఇస్తుందని కంపెనీ క్లెయిమ్ చేస్తుంది. టాటా పంచ్ ICE ధర రూ. 6.13 లక్షల నుండి రూ. 10.20 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉండగా, టాటా పంచ్.ఎవ్ ధర రూ. 10.99 లక్షల నుండి రూ. 15.49 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది.
- Tags
- Altroz
- automobiles
- Nexon
- Safari
- Tata
తాజావార్తలు
-
BJP: ‘‘మనుస్మృతి’’పై రాహుల్ గాంధీ వ్యాఖ్యలు.. ‘‘హిజాబ్’’ వీడియోతో బీజేపీ కౌంటర్..
-
Tollywood Debut: బిగ్ బాస్ బ్యూటీకి బిగ్ ఛాన్స్.. హీరోయిన్గా టాలీవుడ్లోకి ఎంట్రీ!
-
Earthquake: 7 రోజుల్లో 187 భూకంపాలు.. “రింగ్ ఆఫ్ ఫైర్”లో ఏం జరుగుతోంది?
-
Modi Cabinet: కేంద్ర మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధం.. కొత్త ముఖాలకు చోటు!
-
Telangana Congress : కాంగ్రెస్‌లో బిగ్ షాక్.. కొండా సురేఖ, చిన్నారెడ్డికి ఎసరు.?
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!