Royal Enfield: భారత ప్రభుత్వం జీఎస్టీ నిబంధనలను సవరించిన తర్వాత, ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ (Royal Enfield) తమ మోడళ్ల ధరలను సవరించింది. ఈ సవరణల ప్రకారం.. 350cc మోడళ్ల ధరలు తగ్గినప్పటికీ.. 450cc, 650cc బైక్‌ల ధరలు పెరిగాయి. కొన్ని మోడళ్ల ధరలు రూ. 29,500 వరకు పెరిగాయి. జీఎస్టీ సవరణ తర్వాత 440cc, 450cc, 650cc బైక్‌ల ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
రాయల్ ఎన్‌ఫీల్డ్ స్క్రామ్ 440:
440cc విభాగంలో ఉన్న ఏకైక మోడల్ రాయల్ ఎన్‌ఫీల్డ్ స్క్రామ్ 440. దీని ధర రూ. 15,641 వరకు పెరిగింది. ప్రస్తుతం దీని ప్రారంభ ధర రూ. 2,23,131 (ఎక్స్-షోరూమ్) నుంచి రూ. 2,30,641 (ఎక్స్-షోరూమ్)కు పెరిగింది.
రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 450:
జీఎస్టీ మార్పుల తర్వాత రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 450 ధర రూ. 21,682 పెరిగింది. దీని ప్రారంభ ధర ఇప్పుడు రూ. 3,05,736 (ఎక్స్-షోరూమ్) గా ఉంది.
శబాష్ Smriti Mandhana.. ICC వన్డే ర్యాంకింగ్‌లో వరల్డ్ నంబర్.1 గా!
రాయల్ ఎన్‌ఫీల్డ్ గెరిల్లా 450:
గెరిల్లా 450 ధరలు రూ. 18,479 వరకు పెరిగాయి. దీని ప్రారంభ ధర రూ. 2,56,387 (ఎక్స్-షోరూమ్) కాగా, ఎల్లో రిబ్బన్, బ్రావా బ్లూ వేరియంట్ల ధర రూ. 2,72,479 వరకు చేరింది.
రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ 650:
ఇంటర్‌సెప్టర్ 650 ధర రూ. 24,640 వరకు పెరిగింది. దీని ప్రారంభ ధర గతంలో రూ. 3.10 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉండగా, ఇప్పుడు రూ. 3.32 లక్షలు (ఎక్స్-షోరూమ్) కు పెరిగింది.
రాయల్ ఎన్‌ఫీల్డ్ కాంటినెంటల్ జీటీ 650:
కాంటినెంటల్ జీటీ 650 ధర రూ. 25,645 వరకు పెరిగింది. రేసింగ్ గ్రీన్, రాకర్ రెడ్ వేరియంట్లు రూ. 3,49,649 (ఎక్స్-షోరూమ్) కు లభిస్తుండగా, ఏపెక్స్ గ్రీన్, స్లిప్ స్ట్రీమ్ బ్లూ ధరలు రూ. 3,71,529 (ఎక్స్-షోరూమ్) గా ఉన్నాయి. టాప్ వేరియంట్ మిస్టర్ క్లీన్ ధర రూ. 3,78,104 (ఎక్స్-షోరూమ్) గా ఉంది.
రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 650:
రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 650 ధర రూ. 25,607 వరకు పెరిగింది. దీని ప్రారంభ ధర ఇప్పుడు రూ. 3,61,243 (ఎక్స్-షోరూమ్) నుంచి రూ. 3,75,497 (ఎక్స్-షోరూమ్)కు పెరిగింది.
రాయల్ ఎన్‌ఫీల్డ్ షాట్‌గన్ 650:
షాట్‌గన్ 650 ధర రూ. 27,889 వరకు పెరిగింది. గతంలో దీని ప్రారంభ ధర రూ. 3.78 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉండగా, ఇప్పుడు రూ. 4.05 లక్షలు (ఎక్స్-షోరూమ్) కు చేరింది.
Priyanka Arul Mohan: పవన్ డిప్యూటీ సీఎం అవ్వక ముందు అలా.. అయ్యాక ఇలా!
రాయల్ ఎన్‌ఫీల్డ్ బేర్ 650:
రాయల్ ఎన్‌ఫీల్డ్ వారి కొత్త 650cc బైక్ బేర్ 650 ప్రారంభ ధర రూ. 3.46 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా ఉంది. జీఎస్టీ మార్పుల తర్వాత ఇది ఇప్పుడు రూ. 3.71 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది.
రాయల్ ఎన్‌ఫీల్డ్ సూపర్ మెటియోర్ 650:
సూపర్ మెటియోర్ 650 ధర రూ. 29,486 వరకు పెరిగింది. దీని ప్రారంభ ధర ఇప్పుడు రూ. 3.99 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా ఉంది. ఈ మోడల్‌కు రాయల్ ఎన్‌ఫీల్డ్ మోడళ్లలో అత్యధికంగా ధర పెరిగింది.