NTV Telugu Site icon

Tesla: భారత్ లో పెట్టుబడులకు ఆసక్తి చూపని టెస్లా..ఓలా సీఈవో కీలక వ్యాఖ్యలు

Ola Ceo, Tesla

Ola Ceo, Tesla

కొన్ని నెలల క్రితం వరకు ఎలాన్ మస్క్ కి చెందిన టెస్లా భారతదేశానికి వస్తుందని చాలా వార్తలు వచ్చాయి. అయితే ప్రస్తుతం ఆ కంపెనీకి వచ్చే ఉద్దేశం లేనట్లు తెలుస్తోంది. టెస్లాను భారత్‌లోకి తీసుకురావాలనే ప్లాన్‌ను వారు రద్దు చేసుకున్నారు. ఏప్రిల్ చివరి వారంలో ఎలాన్ మస్క్ భారత్ పర్యటనకు వస్తున్నట్లు కంపెనీ తెలిపింది. టెస్లా కంపెనీ ప్రతినిధులు భారత్ అధికారులను సంప్రదించడం మానేసినట్లు చెబుతున్నారు. భారత పర్యటనను వాయిదా వేసుకున్న మస్క్ హఠాత్తుగా చైనాలో అప్రకటిత పర్యటనకు బయలుదేరారు. కార్‌మేకర్ ఆదాయ క్షీణతను నిరోధించడంలో సహాయపడే డ్రైవర్-సహాయ సాఫ్ట్‌వేర్ కోసం మస్క్ చైనా నుంచి అనుమతి కోరారు. ఆ తర్వాత మ్యాపింగ్, నావిగేషన్ ఫంక్షన్‌లలో Baidu Inc.తో టెస్లా భాగస్వామ్యం రద్దైంది. ఇది మాత్రమే కాదు.. టెస్లా తన రోబోటాక్సీని ఈ ఏడాది ఆగస్టు 8న పరిచయం చేయనున్నట్లు ప్రకటించింది. టెస్లా తన రోబోటాక్సీని చైనాకు తీసుకురావాలని అలాగే దేశంలో తన అధునాతన డ్రైవర్-సహాయ ప్యాకేజీని పరీక్షించాలని యోచిస్తోంది. ఇప్పుడు దీనిపై ఓలా సహ వ్యవస్థాపకుడు, సీఈవో భవిష్ అగర్వాల్ స్పందించారు.

READ MORE: Terrorist Died: ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానాన్ని హైజాక్ చేసిన టెర్రరిస్ట్ మృతి..

టెస్లా భారత్‌కు రాకపోవడంపై భవిష్ అగర్వాల్ స్పందిస్తూ.. తన ఎక్స్ ఖాతాలో పోస్టు పెట్టారు. టెస్లా భారత్‌కు రాకపోతే అది తనకే నష్టమని.. దీని వల్ల భారత్‌కు ఎలాంటి నష్టం జరగదని ఆయన పేర్కొన్నారు. భారతీయ ఎలక్ట్రిక్ వాహనం (EV) మరియు లిథియం పర్యావరణ వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతోందని గుర్తుచేశారు. రాబోయే సంవత్సరాల్లో టెస్లా భారతదేశం వైపు చూసే సమయానికి, ఈ అవకాశం మళ్లీ వచ్చేందుకు ఆలస్యం కావొచ్చని తెలిపారు.