డబ్బులు ఆదా చేసుకోవాలంటే పెట్రోల్ కు బదులు ఎలక్ట్రిక్ వాహనాలను వాడాలనే ఆలోచనలో పడ్డారు వాహనదారులు. తక్కువ ప్రయాణ ఖర్చులు, బడ్జెట్ ధరల్లోనే లభ్యమవడం, పర్యావరణ హితంగా ఉండడంతో ఈవీలకు డిమాండ్ పెరిగింది.ఎలక్ట్రిక్ స్కూటర్స్, బైకులను కొనేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ క్రమంలో మరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ లోకి వచ్చింది. న్యూమెరోస్ మోటార్స్ తన మల్టీ-యుటిలిటీ ఇ-స్కూటర్, డిప్లోస్ మాక్స్‌ను హైదరాబాద్‌లో విడుదల చేసింది. దీని ధర రూ. 1,12,199 (ఎక్స్-షోరూమ్, హైదరాబాద్). ఇది సింగిల్ ఛార్జ్ తో 140 కి.మీల దూరం ప్రయాణిస్తుందని కంపెనీ వెల్లడించింది.
Also Read:Ola Electric: క్షీణించిన ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ అమ్మకాలు.. క్లారిటీ ఇచ్చిన కంపెనీ
స్టన్నింగ్ లుక్స్, పవర్ ఫుల్ బ్యారటీ ప్యాక్ తో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ తెగ ఆకట్టుకుంటోంది. ఈ స్కూటర్ ను మూడు వేరియంట్లలో ప్రవేశపెట్టింది. దీనిలో కంపెనీ 3.7kWh సామార్థ్యం గల లిథియం బ్యాటరీ ప్యాక్ తో వస్తుంది. ఇది ఫుల్ ఛార్జ్ కావడానికి 4 గంటలు పడుతుందని కంపెనీ తెలిపింది. ఎల్ఈడీ స్ట్రిప్ లైట్ తో పాటు, దాని ముందు భాగంలో గుండ్రని ఆకారపు లైట్ కూడా అందించబడింది. ఇందులో యాంటీ-థెఫ్ట్ అలర్ట్, జియోఫెన్సింగ్, వెహికల్ ట్రాకింగ్ వంటి భద్రతా ఫీచర్లను అందించారు. డ్యుయల్ డిస్క్ బ్రేకులు, ఎల్ఈడీ లైటింగ్ తో వస్తోంది.