New Nissan MPV: భారతీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు నిస్సాన్ ఇండియా కీలక ప్రణాళికలను అమలు చేస్తోంది. ఇటీవలే టెక్టాన్ పేరుతో కొత్త SUV కాన్సెప్ట్‌ను విడుదల చేసిన నిస్సాన్, ఇప్పుడు మరో కొత్త కాంపాక్ట్ MPVని డిసెంబర్ 18వ తేదీన అధికారికంగా ఆవిష్కరించబోతున్నట్లు ప్రకటించింది. ఇది నిస్సాన్- రెనాల్ట్ భాగస్వామ్యంతో రూపొందుతున్న లేటెస్ట్ మోడల్. అయితే, ఈ కొత్త వాహనంతో బ్రాండ్ తన డిజైన్ లాంగ్వేజ్‌ను పూర్తిగా రిఫ్రెష్ చేయనుంది నిస్సాన్.
Read Also: BMW Prices Increase: రూపాయి బలహీనపడడంతో భారీగా పెరగనున్నబీఎండబ్ల్యూ ధర
ట్రైబర్ శైలిలో సిల్హౌట్
ఈ కొత్త MPV ఇప్పటికే పలుమార్లు టెస్టింగ్‌కి వెళ్లింది. ఇక, ఇప్పటికే లీకైన ఫోటోల్లో ఇది రెనాల్ట్ ట్రైబర్‌కు సమానమైన సిల్హౌట్ నమూనాను కలిగి ఉన్నప్పటికీ, దాదాపు అన్ని డిజైన్ ఎలిమెంట్లు కొత్తగా ఉండటం గమనార్హం.

కొత్తగా కనిపించిన ముఖ్య అంశాలు:
* పూర్తిగా కొత్త ఫ్రంట్ ఫాషియా
* కొత్త గ్రిల్ డిజైన్ (గతంలో కంటే పెద్దది)
* హెక్సాగనల్ ప్యాటర్న్‌తో గ్రిల్
* మళ్లీ డిజైన్ చేసిన ముందు బంఫర్..
* కొత్తగా హెడ్‌ల్యాంప్ డిజైన్
* రూఫ్ రైల్స్
* కొత్త అలాయ్ వీల్స్
* కొత్త రియర్ బంపర్, టెయిల్ ల్యాంప్స్.. ఈ వెహికిల్ ఔట్ సైడ్ మరింత ప్రీమియం ఫినిష్‌ను ఇవ్వడానికి నిస్సాన్ ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు క్లియర్ గా కనిపిస్తోంది.
Read Also: Panchayat Elections: “అదృష్టవంతులు”.. ఒక్క ఓటుతో బయటపడ్డ అభ్యర్థులు వీళ్లే..
ఇంటీరియర్ ఇంకా రహస్యమే..
నిస్సాన్ MPV కారు యొక్క ఇంటీరియర్‌కు సంబంధించిన వివరాలు ఇంకా బయటకు రాలేదు.. అంచనా ప్రకారం:
* కొత్త డ్యాష్‌బోర్డ్ మెటీరియల్స్
* 5, 6, 7 సీట్ల వేరియెంట్లు
* ట్రైబర్‌లో చూసిన లేఅవుట్‌తో కొన్ని పోలికలు ఉండే ఛాన్స్
అంచనా ఫీచర్లు:
* 7-అంగుళాల TFT ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్
* 8-అంగుళాల టచ్‌స్క్రీన్ (Android Auto & Apple CarPlay)
వైర్‌లెస్ చార్జింగ్
* కూల్డ్ సెంటర్ స్టోరేజ్
* స్లైడ్ & రిక్లైన్ అయ్యే రెండో రో సీట్లు

ట్రైబర్ ఇంజిన్‌కే ఛాన్స్
ఈ కొత్త MPV కూడా ట్రైబర్‌లో వాడుతున్న 1.0-లీటర్, 3-సిలిండర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్నే ఉపయోగించే అవకాశం ఉంది.
ఇంజిన్ స్పెసిఫికేషన్స్:
* పవర్: 72 HP
* టర్క్: 96 Nm
* గేర్‌బాక్స్: 5-స్పీడ్ మాన్యువల్/ AMT.. అలాగే, ఇంజిన్ అండ్ గేర్‌బాక్స్ ట్యూనింగ్‌ను నిస్సాన్ మరింత డ్రైవబిలిటీ కోసం ఆప్టిమైజ్ చేసే అవకాశం క్లియర్ గా కనిపిస్తుంది.
ఫ్యామిలీ బయ్యర్లకు అందుబాటులో ఉండేలా ధరలు..
డిజైన్ & ఫీచర్లలో అనేక మార్పులు వచ్చినప్పటికీ, ఈ నిస్సాన్ MPVని ఫ్యామిలీ సెగ్మెంట్ బయ్యర్లకు అందుబాటులో ఉండే ధరలోనే విడుదల చేసే అవకాశం ఉంది. టెక్టాన్ SUVతో పాటు ఈ కొత్త మోడల్ కూడా నిస్సాన్‌కు మార్కెట్‌లో కొత్త ఊపును తీసుకురావడానికి కీలక పాత్ర పోషించనుంది. ప్రస్తుతం మార్కెట్‌లో నిస్సాన్ దగ్గర మ్యాగ్నైట్ లాంటి మోడల్స్ మాత్రమే ఉండగా, ఈ కొత్త వెహికిల్ సంస్థ బ్రాండ్‌కు స్ట్రాంగ్ సపోర్టు లభిస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.