Swift 2024: ఫోర్త్ జనరేషన్ మారుతి స్విఫ్ట్.. ఇండియన్ మార్కెట్‌లోకి వచ్చేది అప్పుడే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Swift 2024: ఇండియాలో హ్యచ్‌బ్యాక్ కార్లలో మారుతి సుజుకీ స్విఫ్ట్‌కి ఉన్న క్రేజ్ వేరే కారుకు లేదు. తాజాగా మారుతీ సుజుకీ మాతృసంస్థ సుజుకీ మోటార్ కార్పొరేషన్ టోక్యో మోటార్ షో 2023(జపాన్ మొబిలిటీ షో 2023)లో తన ఫోర్త్ జనరేషన్ స్విఫ్ట్ కారును ఆవిష్కరించింది. ప్రస్తుతం కాన్సెప్ట్ కారుగా పిలువబడుతున్న ఈ మోడల్ 2024లో ఇండియన్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇస్తుందని భావిస్తున్నారు. ప్రస్తుతం ఇండియాలో స్విఫ్ట్ కారుకు స్థిరమైన విక్రయాలు ఉన్నాయి. 2024(ఏప్రిల్-సెప్టెంబర్) ఫైనాన్షియల్ ఇయర్ లో ఇప్పటి వరకు 1,03,500 కార్లను విక్రయించింది. బాలెనో, వ్యాగన్ ఆర్ కార్లను కూడా స్విఫ్ట్ అధిగమించింది.
Also Read
- TATA Sierra Legend Series: టాటా Sierra Legend Series భారత్‌లో లాంచ్.. 360-డిగ్రీ కెమెరా, 6 ఎయిర్‌బ్యాగ్స్
- Mahindra XUV 3X0 REVX Edge: మహీంద్రా XUV 3XO REVX Edge (O) లాంచ్.. సన్‌రూఫ్, 6 ఎయిర్‌బ్యాగ్స్‌తో అదిరిపోయే ఫీచర్లు
- బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
- 649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
కొత్త స్విఫ్ట్ కొత్త అల్లాయ్ వీల్స్‌తో పాటు కొత్త గ్రిల్, హెడ్‌ల్యాంప్‌లు, బంపర్‌తో సహా రీడిజైన్ చేయబడిన ఫ్రంట్ ఎండ్‌ను కలిగి ఉంది. డిజైన్ పరంగా చాలా మార్పులు ఉన్నాయి. డ్యూయల్ సెన్సార్ బ్రేక్ సపోర్ట్, అడాప్టివ్ హై బీమ్ సిస్టమ్ మరియు డ్రైవర్ మానిటరింగ్ సిస్టమ్ వంటి అధునాతన భద్రతా సాంకేతికతలను కూడా కలిగి ఉంది. ఇంటీరియర్ కొత్త డ్యాష్‌బోర్డ్ లేఅవుట్, అప్‌డేట్ చేయబడిన ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ కోసం కొత్త ప్యానెల్, కొత్త ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ తో రానుంది.
ఇంజన్ విషయానికి వస్తే.. ప్రస్తుతం ఇండియాలో స్విఫ్ట్ ఇంజన్ 1.2-లీటర్ K-సిరీస్ డ్యూయల్-జెట్ డ్యూయల్-VVT పెట్రోల్ ఇంజన్‌తో 90hp గరిష్ట శక్తిని మరియు 113Nm గరిష్ట టార్క్‌ను అందిస్తుంది. రెండు ట్రాన్స్‌మిషన్ ఛాయిస్ లతో ఉంది. 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, 5 స్పీడ్ ఏఎంటీ ట్రాన్స్మిషన్లతో అందుబాటులో ఉంది. ఈ పవర్ ట్రెయిన్ స్విఫ్ట్ 2024 లోనూ ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం స్విఫ్ట్ ధర రూ. 5,99,450 నుంచి రూ. 9,03,000 (ఎక్స్-షోరూమ్)గా ఉంది. అయితే, 2024లో కొత్త స్విఫ్ట్‌ను ప్రవేశపెట్టడంతో ధరలు పెరుగుతాయని భావిస్తున్నారు.
తాజావార్తలు
-
The Vvaan: 400 ఏళ్ల ఆలయంలో సిద్ధార్థ్, తమన్నా ప్రత్యేక పూజలు.. గుడి మిస్టరీతోనే వస్తున్న కొత్త సినిమా
-
Smriti Mandhana: పరుగుల రారాణి స్మృతి మంధాన.. టీ20 క్రికెట్లో అరుదైన ఘనత..!
-
Irumudi OTT: ఓటీటీలోనూ దుమ్మురేపుతున్న ‘ఇరుముడి’.. నెట్‌ఫ్లిక్స్‌లో నెం.1గా ట్రెండింగ్!
-
Oppo A7 Pro Max 5G: ఒప్పో A7 Pro Max 5G గ్లోబల్ లాంచ్.. 10,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరా!
-
Haribabu Murder Case: యూట్యూబర్ వైష్ణవి భర్త హత్య కేసులో కీలక పరిణామం.. మరో నలుగురి పాత్రపై దర్యాప్తు..!
ట్రెండింగ్
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!