ADAS, పానోరమిక్ సన్‌రూఫ్, 7 సీట్లు.. ప్రీమియం లుక్లో MG Majestor
- గ్లోస్టర్‌కు మించిన లగ్జరీతో MG మెజెస్టర్..
- ADAS, పానోరమిక్ సన్‌రూఫ్, 7 సీట్లతో MG మెజెస్టర్..
- ఫిబ్రవరి 12న అధికారిక ఎంట్రీ ఇవ్వనున్న MG మెజెస్టర్ SUV..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MG Majestor: MG మోటార్ ఇండియా తన లైనప్‌లో కొత్త ఫ్లాగ్‌షిప్ SUVగా భావిస్తున్న MG మెజెస్టర్ను ఫిబ్రవరి 12వ తేదీన అధికారికంగా ఆవిష్కరించేందుకు సిద్ధమవుతుంది. ఈ మోడల్, ఇప్పటికే మార్కెట్లో ఉన్న MG గ్లోస్టర్‌కు పై స్థాయిలో నిలిచే అవకాశం ఉందని ఆటో వర్గాలు అంచనా వేస్తున్నాయి. గ్లోస్టర్‌తో పోలిస్తే మరింత ప్రీమియం డిజైన్, అధునాతన ఫీచర్లు, మెరుగైన లగ్జరీతో మెజెస్టర్‌ను ప్రవేశ పెట్టనున్నట్లు తెలుస్తోంది.
Read Also: BMC Elections: 25 ఏళ్ల శివసేన పాలనకు బ్రేక్.. ఠాక్రే సోదరుల పతనాకి కారణాలు ఇవే..
Also Read
- Tata Aeris: టాటా నుంచి సరికొత్త సెడాన్.. టిగోర్ స్థానంలో ‘ఏరిస్’.. ఫీచర్లు అదుర్స్
- Raptee.HV T30: రాప్టీ.హెచ్‌వి T30 ఎలక్ట్రిక్ బైక్.. 150KM రియల్ రేంజ్, కారు ఛార్జర్‌తో ఛార్జింగ్!
- TATA Sierra Legend Series: టాటా Sierra Legend Series భారత్‌లో లాంచ్.. 360-డిగ్రీ కెమెరా, 6 ఎయిర్‌బ్యాగ్స్
- Mahindra XUV 3X0 REVX Edge: మహీంద్రా XUV 3XO REVX Edge (O) లాంచ్.. సన్‌రూఫ్, 6 ఎయిర్‌బ్యాగ్స్‌తో అదిరిపోయే ఫీచర్లు
డిజైన్‌లో ప్రీమియం లుక్
MG మెజెస్టర్‌ను ఆటో ఎక్స్‌పో 2025లో చివరిసారిగా ప్రదర్శించారు. అనంతరం రహస్యంగా తీసిన స్పై చిత్రాలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఈ SUV ముందుభాగంలో వెడల్పైన గ్లోస్-బ్లాక్ గ్రిల్, నిలువుగా అమర్చిన LED ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, పైభాగంలో LED డే టైమ్ రన్నింగ్ లైట్స్ (DRLs)తో గంభీరమైన లుక్‌ను అందజేస్తుంది. ముందు బంపర్‌లో నిలువుగా డిజైన్ చేసిన ఎలిమెంట్స్‌తో పాటు భారీ స్కిడ్ ప్లేట్ కనిపిస్తుంది. సైడ్ ప్రొఫైల్‌లో 19-అంగుళాల డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్, బ్లాక్ అవుట్ డోర్ హ్యాండిల్స్, రూఫ్ రైల్స్, విండో పిల్లర్లతో పాటు మందపాటి బ్లాక్ బాడీ క్లాడింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఇక, వెనుక భాగంలో లైట్ బార్ ద్వారా అనుసంధానించబడిన హారిజాంటల్ LED టెయిల్‌ల్యాంప్‌లు ఉండగా, సిల్వర్ ఫినిష్ స్కిడ్ ప్లేట్‌తో కూడిన వెనుక బంపర్ ముందు డిజైన్‌ను ప్రతిబింబిస్తుంది. డ్యూయల్ ఎగ్జాస్ట్ అవుట్‌లెట్లు కూడా క్లియర్ గా కనిపిస్తాయి.
Read Also: U-19 World Cup IND vs BAN: నేడు అండర్-19 వరల్డ్ కప్ లో భారత్ వర్సెస్ బంగ్లాదేశ్..
ఇంటీరియర్ & ఫీచర్లు..
స్పై షాట్ల ఆధారంగా, MG మెజెస్టర్ ఇంటీరియర్ లేయర్డ్ డాష్‌బోర్డ్ డిజైన్‌తో వస్తుంది. పెద్ద సైజ్ డ్యూయల్ డిజిటల్ స్క్రీన్లు- ఒకటి ఇన్ఫోటైన్‌మెంట్ కోసం, మరొకటి డ్రైవర్ డిస్‌ప్లే కోసం- ఇందులో ఉండనున్నాయి. ఈ స్క్రీన్ పరిమాణం గ్లోస్టర్ కంటే పెద్దదిగా ఉండే ఛాన్స్ ఉంది. మెజెస్టర్ 6-సీటర్, 7-సీటర్ ఆప్షన్‌లతో మూడు వరుసల క్యాబిన్ లేఅవుట్‌లో అందుబాటులోకి రాబోతుంది. వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, వెంటిలేటెడ్, పవర్డ్ ఫ్రంట్ సీట్లు, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, బ్రాండెడ్ ఆడియో సిస్టమ్ వంటి సౌకర్యాలు ఇందులో ఉండే అవకాశం ఉంది. అలాగే, గ్లోస్టర్‌తో పోలిస్తే మరింత ప్రీమియం అనుభూతి కోసం వెనుక సీటు వెంటిలేషన్, అదనపు వైర్‌లెస్ ఛార్జర్, అదనపు స్పీకర్లు వంటివి ఉండనున్నాయి. ఇక, వెనుక AC వెంట్స్, వెనుక సన్‌షేడ్స్, పనోరమిక్ సన్‌రూఫ్ లాంటి మార్పులు చేర్పులతో మెజెస్టర్‌ను లగ్జరీ సెగ్మెంట్‌లో ప్రత్యేకంగా నిలబెట్టనున్నాయి.
పటిష్టమ భద్రత..
భద్రత విషయానికి వస్తే, MG మెజెస్టర్‌లో మల్టిపుల్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), 360-డిగ్రీ కెమెరా, అధునాతన డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) లాంటి అత్యాధునిక సేఫ్టీ ఫీచర్లు ఉండనున్నాయి.
పవర్‌ట్రెయిన్ ఎంపికలు
ఇంజిన్- ట్రాన్స్‌మిషన్ వివరాలను మాత్రం MG ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. అయితే, గ్లోస్టర్‌లో ఉన్న పవర్‌ట్రెయిన్ సెటప్‌ను మెజెస్టర్‌లో కూడా అందించే ఛాన్స్ ఉంది. గ్లోస్టర్‌లో ప్రస్తుతం 2-లీటర్ డీజిల్ ఇంజిన్ (161 PS పవర్, 373 Nm టార్క్), 2-లీటర్ ట్విన్ టర్బో డీజిల్ ఇంజిన్ (216 PS పవర్, 478 Nm టార్క్) ఆప్షన్‌లు అందుబాటులో ఉన్నాయి. ఇవి RWD, 4WD డ్రైవ్‌ట్రెయిన్‌లతో పాటు 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌స్ ఉన్నాయి.
ధర
MG మెజెస్టర్ ధర సుమారు రూ.46 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమయ్యే ఛాన్స్ ఉందని అంచనా. ఈ SUV మార్కెట్లో టయోటా ఫార్చ్యూనర్, టయోటా ఫార్చ్యూనర్ లెజెండర్, స్కోడా కోడియాక్ లాంటి ప్రముఖ మోడళ్లకు ఈ కారు గట్టి పోటీ ఇవ్వనుంది. ఇక, MG మెజెస్టర్ ఆవిష్కరణతో, భారత లగ్జరీ SUV సెగ్మెంట్‌లో MG మోటార్ ఇండియా తన స్థాయిని మరింత బలోపేతం చేయబోతుందని ఆటో నిపుణులు పేర్కొంటున్నారు.
తాజావార్తలు
-
Chiru Leaks: ‘కాకా’లో అసలు క్యారెక్టర్ పేరు చెప్పేసిన మెగాస్టార్.. ఫ్యాన్స్‌కి పూనకాలే!
-
Dividend Stocks: బంపర్ ఆఫర్.. ఒక్కో షేరుపై రూ. 160 డివిడెండ్..
-
Best Selfie Camera Phones: సెల్ఫీ ప్రియులను ఆకట్టుకునే టాప్ కెమెరా ఫోన్లు.. ధర, ఫీచర్లు ఫుల్ డీటెయిల్స్ ఇవే..
-
DJ Noise: వినాయకుడి పండుగలో ఈ భారీ శబ్దాలు ఎందుకు..? డీజే భక్తికి నేలకొరుగుతున్న ప్రాణాలు
-
Bank Holidays & Strike 2026: సెప్టెంబర్ 26 నుంచి వరుసగా బ్యాంకులకు సెలవులు.. 28 నుంచి 3 రోజుల సమ్మె
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!