Purchase Maruti Suzuk WagonR CNG Only Rs 80000 on EMI: ప్రముఖ కార్ల తయారీ సంస్థ ‘మారుతీ సుజుకీ’కి చెందిన వేగనార్ కారు విక్రయాలు బాగున్నాయి. మార్కెట్లో వేగనార్ రిలీజ్ అయి చాలా ఏళ్లు గడిచినా ఈ కారుకు విపరీతమైన డిమాండ్ ఉంది. మారుతి వేగనార్‌లో కంపెనీ సీఎన్‌జీ కిట్ అమర్చింది. ఇది పెట్రోల్ వేరియంట్ కంటే మెరుగైన మైలేజ్ ఇస్తుంది. సీఎన్‌జీ 1.0 లీటర్ త్రీ-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌తో పనిచేస్తుంది. ఇది గరిష్టంగా 58 bhp మరియు 78 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. సీఎన్‌జీతో ఈ కారు 34 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. ఈ కారుని మీరు కేవలం రూ. 80,000తో ఇంటికి తీసుకెళ్లిపోవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం.
Wagonr CNG Price:
మారుతి వేగనార్ హ్యాచ్‌బ్యాక్ నాలుగు ట్రిమ్‌లలో అందుబాటులో ఉంది. ఈ కారు LXi, VXi, ZXi మరియు ZXi+ ట్రిమ్‌లలో వస్తుంది. ఈ కారు ధర రూ. 5.54 లక్షల నుంచి రూ. 7.42 లక్షల మధ్య (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) ఉంది. సీఎన్‌జీ ఎంపికలో LXi మరియు VXi ట్రిమ్‌లలో అందుబాటులో ఉంది. ఎల్ఎక్స్ఐ సీఎన్‌జీ ధర రూ.6.45 లక్షలు. మీరు ఈ కారును లోన్‌పై కొనుగోలు చేయాలనుకుంటే.. కేవలం 80 వేల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. వేగనార్ ఎల్ఎక్స్ఐ సీఎన్‌జీ ఈఎంఐ క్యాలుకులేషన్స్ ఓసారి చూద్దాం.
Wagonr CNG EMI Calculator:
మారుతి వేగనార్ ఎల్ఎక్స్ఐ సీఎన్‌జీ వేరియంట్ ధర రూ. 7.26 లక్షలుగా ఉంది. ఇప్పుడు మీరు ఈ వేరియంట్‌ను లోన్‌పై కొనుగోలు చేస్తున్నారనుకుందాం. గమనించదగ్గ విషయం ఏమిటంటే.. మీరు మీ ఎంపిక ప్రకారం ఎక్కువ డౌన్ పేమెంట్ చేసుకోవచ్చు. పలు బ్యాంకులలో వడ్డీ రేటు భిన్నంగా ఉంటుంది మరియు లోన్ కాలపరిమితి 1 నుంచి 7 సంవత్సరాల వరకు కూడా ఎంచుకోవచ్చు. ఇవన్నీ మీరు గమనించాల్సి ఉంటుంది.
ఉదాహరణకు మీరు రూ. 80,000 (20%) డౌన్ పేమెంట్, వడ్డీ రేటు 9% మరియు 5 సంవత్సరాల రుణ కాలవ్యవధిని ఎంచుకున్నారని అనుకుందాం. అపుడు మీరు ప్రతి నెలా రూ. 13,425 ఈఎంఐ చెల్లించాలి ఉంటుంది. అపుడు లోన్ మొత్తానికి (రూ. 6.46 లక్షలు) అదనంగా మీరు రూ. 1.58 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. మీరు డౌన్ పేమెంట్ ఎక్కువ చెల్లిస్తే.. వడ్డీ తక్కువ పడే అవకాశాలు ఉంటాయి.