Maruti to Launch Maruti Suzuki Swift and Maruti Suzuki Dzire New Models in India: దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ ‘మారుతి సుజుకి’ తన అత్యంత ఖరీదైన కారు ‘మారుతి ఇన్విక్టో’ (Maruti Suzuki Invicto)ను జూలై 5న భారతదేశంలో విడుదల చేయనుంది. ఈ కారు టయోటా ఇన్నోవా హైక్రాస్ యొక్క రీబ్యాడ్జ్డ్ వెర్షన్. ఇదివరకే మారుతి ఫ్రాంక్స్ మరియు మారుతి జిమ్నీలను కూడా విడుదల చేసిన విషయం తెలిసిందే. మారుతి సుజుకి ఇక్కడితో ఆగలేదు. ఇన్విక్టో తర్వాత మరో రెండు సరసమైన కార్లను తీసుకురావడంపై కంపెనీ దృష్టి పెట్టనుందట. స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ మరియు డిజైర్ కాంపాక్ట్ సెడాన్‌లను విడుదల చేయనుంది. ఈ వివరాలు ఓసారి చూద్దాం.
Maruti Suzuki Swift Hybrid:
మారుతి సుజుకి కంపెనీ స్విఫ్ట్ యొక్క ఎక్ట్సీరియర్ మరియు ఇంటీరియర్‌ను పూర్తిగా రీడిజైన్ చేస్తుంది. ఈ కారు విదేశాల్లో చాలాసార్లు టెస్ట్ చేయబడింది. కొత్త స్విఫ్ట్‌ను ఈ ఏడాది చివరి నాటికి లేదా 2024 ప్రారంభంలో విడుదల చేసే అవకాశం ఉంది. ఈ కారు స్వెప్ట్ బ్యాక్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, రీడిజైన్ చేయబడిన బంపర్, కొత్త అల్లాయ్ వీల్స్ మరియు ట్వీక్డ్ రియర్ ఎండ్‌లను కలిగి ఉంటుంది. ఈ కార్ లోపలి భాగంలో సరికొత్త ఫీచర్లు ఉంటాయని తెలుస్తోంది.
మారుతి సుజుకి స్విఫ్ట్ కారులో అతిపెద్ద ఫీచర్ ఉండే అవకాశం ఉంది. అదే హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్. 1.2-లీటర్ మూడు-సిలిండర్ పెట్రోల్ ఇంజన్ ఈ కారులో ఉంటుంది. ఇది ప్రస్తుత పెట్రోల్ ఇంజన్‌లో ఉంది. హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ కారణంగా ఈ కారు ఏకంగా 35 కిలోమీటర్ల వరకు మైలేజీని ఇస్తుందని కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి.
Maruti Suzuki Dzire Hybrid:
స్విఫ్ట్ కారు మాదిరే మారుతి సుజుకి కంపెనీ డిజైర్‌ను కూడా అప్‌డేట్ చేయనుంది. కొత్త డిజైర్ కారు లోపల మరియు వెలుపల పెద్ద మార్పులు ఉండే అవకాశం ఉంది. 2024 ద్వితీయార్థంలో ఈ కారు రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. స్విఫ్ట్ మాదిరే బలమైన హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ ఇందులో కూడా ఉంటుంది. కొత్త ఫీచర్లు మరియు సాంకేతికతతో డిజైర్ ఇంటీరియర్ మరింత ఆకర్షణగా ఉంటుంది. ఎస్‌యూవీ కార్ల కారణంగా సెడాన్ అమ్మకాలు బాగా తగ్గిపోయాయి. అయినప్పటికీ మారుతి డిజైర్ ప్రస్తుతం దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న సెడాన్ కారుగా ఉంది. అందుకే అప్‌డేట్ వెర్షన్‌ను కంపెనీ తీసుకొస్తుంది.
Also Read: Gold Price Today: మహిళలకు శుభవార్త.. తగ్గిన బంగారం ధరలు! హైదరాబాద్‌లో తులం ఎంతంటే