NTV Telugu Site icon

Maruti Suzuki Sales: ఏంటి గురూ ఇలా కొనేశారు.. డిసెంబర్‌లో రికార్డు సృష్టించిన స్విఫ్ట్

Maruti Suzuki Dzire

Maruti Suzuki Dzire

మారుతీ సుజుకి ఇండియా దేశంలోనే ప్రతి సంవత్సరం కొత్త మైలురాళ్లను నెలకొల్పుతున్న ఏకైక కంపెనీ. డిసెంబర్ 2024లో కూడా కంపెనీ ఖాతాలో మరో రికార్డు నమోదైంది. గత నెలలో కంపెనీ 2,52,693 యూనిట్ల అధిక రిటైల్ విక్రయాలను నమోదు చేసింది. చరిత్రలో తొలిసారిగా 2.50 లక్షల యూనిట్ల నెలవారీ విక్రయాల్లో ఇది కొత్త మైలురాయి. ఈ సేల్‌లో దాదాపు 30 వేల యూనిట్ల స్విఫ్ట్ ఉన్నాయి.

READ MORE: MP Chamala: కేటీఆర్ తప్పు చేయకపోతే నిర్దోషిగా నిరూపించుకోండి..

ఓ జాతీయ మీడియా సంస్థ నివేదిక ప్రకారం.. గత నెలలో 29,765 యూనిట్ల మారుతి సుజుకి స్విఫ్ట్ లను విక్రయించారు. దేశంలో ఒక్కనెలలో అత్యధికంగా అమ్ముడైన కారుగా స్విఫ్ట్ కూడా నిలిచింది. కంపెనీ పోర్ట్‌ఫోలియోలోని ఇతర కార్లైన మారుతి వ్యాగన్ఆర్ 29,566 యూనిట్లు, మారుతి బాలెనో 26,789 యూనిట్లను జనాలు కొనుగోలు చేశారు. ఈ విధంగా టాప్-3 స్థానాలను కూడా ఈ కార్లు కైవసం చేసుకున్నాయి.

READ MORE: Hyundai Creta EV: హ్యుందాయ్ క్రెటా ఈవీ టీజర్ విడుదల.. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 473కి.మీ రేంజ్..

కంపెనీ తాజాగా స్విఫ్ట్‌ కొత్త వేరియంట్‌ను మే 2024లో భారతదేశంలో విడుదల చేసింది. ప్రస్తుతం ఇది దేశంలోనే నంబర్-1 హ్యాచ్‌బ్యాక్‌గా కొనసాగుతోంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.6.49 లక్షల నుంచి రూ.9.59 లక్షల వరకు ఉన్నాయి. కాగా.. సేఫ్టీ రేటింగ్‌ విషయంలో మారుతీ సుజుకీపై విమర్శలు వ్యక్తమవుతున్న వేళ.. డిజైర్‌ ఫైవ్‌ స్టార్‌ రేటింగ్‌ అందుకోవడం గమనార్హం. స్వచ్ఛందంగా మారుతీ ఈ వెహికల్‌ను క్రాష్‌ టెస్ట్‌కు పంపింది. పెద్దల భద్రతకు సంబంధించి 34 పాయింట్లకు గాను 31.24 పాయింట్లను కొత్త డిజైర్‌ సాధించింది. చిన్నారుల భద్రతకు సంబంధించి 42 పాయింట్లకు గాను 39 పాయింట్లు పొందింది.

READ MORE: Boney Kapoor: “అల్లు అర్జున్‌ను నిందించాల్సిన అవసరం లేదు”.. బాలీవుడ్ నిర్మాత కీలక వ్యాఖ్యలు

ఈ కారులో ఆరు ఎయిర్‌బ్యాగులు, అన్ని సీట్లకు 3 పాయింట్‌ సీట్‌ బెల్ట్‌ విత్‌ రిమైండర్‌ ఉన్నాయి. ఎక్స్‌టీరియర్‌, ఇంటీరియర్‌ పరంగా అనేక మార్పులతో కొత్త తరం డిజైర్‌ను మారుతీ సుజుకీ ఇటీవలే ఆవిష్కరించింది. ప్రస్తుతం ఈ కార్లకు సంబంధించి బుకింగ్‌లు కొనసాగుతున్నాయి. నవంబర్‌ 11న ధర, ఇతర వివరాలు వెల్లడి కానున్నాయి. ఈ నేపథ్యంలో క్రాష్‌ టెస్ట్‌ వివరాలు బయటకు వచ్చాయి. గతంలో జపాన్‌ ఎన్‌క్యాప్‌ నుంచి మారుతీ సుజుకీ స్విఫ్ట్‌ 4 స్టార్‌ రేటింగ్‌ అందుకుంది.

Show comments