Toyota Fortuner: పెట్రోల్, డీజిల్‌కు గుడ్ బై.. 100% ఇథనాల్‌తో నడిచే కొత్త టొయోటా ఫార్చ్యూనర్ వచ్చేసిందోచ్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Toyota Fortuner E100 Flex-Fuel & B50 Diesel: ఇండోనేషియా మోటార్ షో 2026 (Indonesia Motor Show 2026) వేదికగా ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ టొయోటా (Toyota) తమ అత్యంత ప్రజాదరణ పొందిన ఎస్యూవీ ‘ఫార్చ్యూనర్’ (Fortuner) లో రెండు కొత్త మోడళ్లను ప్రదర్శించింది. ఇందులో ఒకటి 100 శాతం బయో ఇథనాల్ (E100) ఫ్లెక్స్-ఫ్యూయల్‌తో నడిచే మోడల్ కాగా, మరొకటి B50 బయోడీజిల్ వర్షన్. నిజానికి ఫ్లెక్స్ ఫ్యూయల్ ఫార్చ్యూనర్ కాన్సెప్ట్‌ను మూడేళ్ల క్రితమే కంపెనీ ప్రదర్శించినప్పటికీ, ప్రస్తుతం ఇవి రెండూ భారీ స్థాయి ఉత్పత్తి (మాస్ ప్రొడక్షన్) లేదా విక్రయాలకు ఇంకా సిద్ధంగా లేవు. అయితే ప్రత్యామ్నాయ ఇంధన సాంకేతికతపై (Alternative Fuel Technology) టొయోటా సుదీర్ఘంగా శ్రమిస్తోందని ఈ ప్రదర్శన స్పష్టం చేస్తోంది.
100% బయో ఇథనాల్‌తో నడిచే ఫార్చ్యూనర్:
ఫ్లెక్స్-ఫ్యూయల్ (E100) ఫార్చ్యూనర్ ఎక్స్టీరియర్, ఫీచర్లలోనూ ఎలాంటి మార్పులూ లేవు. అతిపెద్ద మార్పు అంతా దాని ఇంజిన్, ఇంధన వ్యవస్థలోనే జరిగింది. 100 శాతం బయో ఇథనాల్‌ను సపోర్ట్ చేసేందుకు వీలుగా కొత్త ఫ్యూయల్ లైన్లు, హోస్ పైప్‌లు, ఇంజిన్ హెడ్ సహా పలు మెకానికల్ భాగాలను ప్రత్యేకంగా అమర్చారు. ఈ మోడల్లో 2.7-లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఇచ్చారు, ఇది 161bhp పవర్, 243Nm టాప్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది రియర్-వీల్ డ్రైవ్ (RWD) లేఅవుట్‌తో రానుంది.
Also Read
- Komaki MG-Pro+ Electric Scooter: రూ.85,999కే 150+KM రేంజ్.. 4 వేరియంట్లతో వచ్చిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అదిరింది!
- Electric Scooter Range Case: 85KM రేంజ్ అంటూ అమ్మారు.. వచ్చింది 16KM మాత్రమే! EV కంపెనీకి రూ.1.68 లక్షల షాక్
- Oben Rorr EVO: 180KM రేంజ్.. 8 ఏళ్ల బ్యాటరీ వారంటీ.. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ బైక్ ఇదే..!
- BYD Denza D9: BYD Denza D9 భారత్‌లోకి.. 800KM రేంజ్, మసాజ్ సీట్లతో లగ్జరీ MPV!
B50 బయోడీజిల్ మోడల్లో మైల్డ్-హైబ్రిడ్ సిస్టమ్:
టొయోటా ఫార్చ్యూనర్‌లో B50 బయోడీజిల్ కాన్సెప్ట్‌ను కూడా పరిచయం చేసింది. ఇందులో ప్రస్తుతం ఉన్న 2.8-లీటర్ డీజిల్ ఇంజిన్నే కొనసాగించారు. ఇది 201bhp పవర్, 500Nm టాప్‌ను ఇస్తుంది. ఈ మోడల్ ఆల్-వీల్ డ్రైవ్ (AWD) సిస్టమ్‌తో వస్తుంది. అంతేకాకుండా, దీనికి 48-వోల్ట్ మైల్డ్-హైబ్రిడ్ సిస్టమ్‌ను జత చేశారు. దీనివల్ల ఇంధన సామర్థ్యం పెరగడంతో పాటు ఉద్గారాలు (Emissions) గణనీయంగా తగ్గుతాయని అంచనా వేస్తున్నారు.
భారత మార్కెట్లోకి ప్రవేశించే అవకాశం:
భారత్‌లో రోజురోజుకూ కఠినతరం అవుతున్న నిబంధనలు, ఇథనాల్ బ్లెండెడ్ ఇంధనాన్ని ప్రోత్సహిస్తున్న ప్రభుత్వ విధానాల దృష్ట్యా ఫార్చ్యూనర్ ఫ్లెక్స్ ఫ్యూయల్ భారత వినియోగదారులకు ఓ ప్రత్యేకమైన ఆప్షన్‌గా మారవచ్చు. ప్రస్తుతం ఈ రెండు వాహనాలు పరీక్షల దశలో ఉన్నాయి. నివేదికల ప్రకారం, రాబోయే కొన్ని నెలల్లో టొయోటా ఈ టెక్నాలజీని భారత్‌కు తీసుకురావడంపై యోచించే అవకాశం ఉంది. అదే కనుక జరిగితే, 100 శాతం బయో ఇథనాల్ లేదా బయోడీజిల్‌తో నడిచే భారత తొలి ప్రీమియం ఎస్‌యూవీగా ఫార్చ్యూనర్ రికార్డు సృష్టిస్తుంది. ఇదిలా ఉండగా, టొయోటా ఇటీవల 2026 Toyota Hilux ని భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ 9th జనరేషన్ పికప్ ట్రక్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరను రూ. 31.99 లక్షలుగా నిర్ణయించారు. కొత్త హైలక్స్ ఫ్రంట్ డిజైన్ మునుపటి కంటే మరింత బోల్డ్ అండ్ రగ్గడ్ లుక్‌తో కనిపిస్తుంది. మెకానికల్‌గా కొత్త హైలక్స్‌లో ఎలాంటి మార్పులు చేయలేదు. ఇందులో మునుపటి 2.8-లీటర్, 4-సిలిండర్ డీజిల్ ఇంజిన్నే ఇచ్చారు, ఇది 204 hp పవర్, 500 Nm టాప్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్‌తో పాటు 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ జత చేశారు. ఈ పికప్ ట్రక్ 4×2, 4×4 డ్రైవ్‌ట్రెయిన్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది.
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!