Hyundai: మహీంద్రా, టాటా దారిలోనే హ్యుందాయ్ వెళ్తోంది. జీఎస్టీ తగ్గింపు తర్వాత హ్యుందాయ్ ఇండియా తన కార్ల ధరలను రూ. 2.4 లక్షల వరకు తగ్గించింది. ఇటీవల జీఎస్టీ తగ్గింపు ప్రయోజనాలను తన వినియోగదారులకు అందిస్తామని ప్రకటించింది. పండగ సీజన్‌కు ముందు సెప్టెంబర్ 22 నుంచి కొత్త ధరలు అమలులోకి వస్తాయి. సవరించిన ధరల కారణంగా హ్యుందాయ్ కార్లు మరింత చౌకగా మారుతాయి.
Read Also: Visakhapatnam : ఈస్ట్ ఇండియా పెట్రోలియం ప్లాంట్‌లో పిడుగు ప్రభావంతో భారీ అగ్ని ప్రమాదం
అత్యధికంగా తగ్గింపు హ్యుందాయ్ టక్సన్‌పై ఉంది. దీని ధర రూ. 2,40,303 తగ్గనుంది. గ్రాండ్ i10 నియోస్, ఆరా, ఎక్స్‌టర్, i20, వెన్యూ, వెర్నా, క్రెటా, అల్కాజార్ వంటి ఇతర ప్రసిద్ధ మోడళ్లపై కూడా దాదాపు రూ. 60,000 నుండి రూ. 1.2 లక్షల వరకు తగ్గింపులు ఉంటాయి. హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ అన్సూ కిమ్ మాట్లాడుతూ, ప్రయాణీకుల వాహనాలపై ప్రభుత్వం జీఎస్టీ తగ్గించడాన్ని కంపెనీ స్వాగతిస్తున్నట్లు చెప్పారు. ఈ సంస్కరణలు ఆటో పరిశ్రమకు ప్రోత్సాహకరమని, వ్యక్తిగత మొబిలిటీ మరింత సరసమైందిగా లక్షలాది భారతీయులకు అందుబాటులోకి తెచ్చేందుకు ముఖ్య అడుగుగా అభివర్ణించారు.
ఇటీవల జీఎస్టీ సవరణల్లో భాగంగా, చిన్న కార్లు – 1,200cc వరకు పెట్రోల్ ఇంజన్లు లేదా 1,500cc వరకు డీజిల్ ఇంజన్లు కలిగిన నాలుగు మీటర్ల కంటే తక్కువ పొడవు గల కార్‌లపై 28 శాతం జీఎస్టీని 18 శాతానికి తగ్గించారు. పెద్ద ఇంజన్లు కలిగిన పెద్ద కార్ల 40 శాతం జీఎస్టీని, అదనసు సెన్సు లేకుండా కలిగి ఉంటాయి.