Car Prices Slash: కేంద్రప్రభుత్వం ఇటీవల జీఎస్‌టీ రేట్లను క్రమబద్ధీకరించిన నేపథ్యంలో దేశంలోని ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు తమ కార్ల ధరలను గణనీయంగా తగ్గించాయి. కొత్త జీఎస్‌టీ విధానం సెప్టెంబర్ 22 నుండి అమల్లోకి వస్తుంది. ఈ తగ్గింపులు ఎంట్రీ-లెవల్ కార్లపై రూ. 60,000 నుండి ప్రీమియం ఎస్‌యూవీలపై రూ. 3 లక్షలకు పైగా వరకు ఉన్నాయి. టాటా, మహీంద్రా, టయోటా, హ్యుందాయ్ వంటి ప్రధాన సంస్థలు ఇప్పటికే కొత్త ధరలను ప్రకటించగా.. త్వరలో కియా, మారుతి…
Toyota: టయోటా కిర్లోస్కర్ మోటార్ (TKM) తన కార్లపై జీఎస్‌టీ రేట్ల తగ్గింపు ప్రయోజనాలను పూర్తిగా కస్టమర్లకు బదిలీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం సెప్టెంబర్ 22, 2025 నుండి ఐసీఈ (ICE) పోర్ట్‌ఫోలియోలోని అన్ని కార్లకు ఈ తగ్గింపు వర్తిస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ సందర్భంగా సేల్స్, సర్వీస్, యూజ్డ్ కార్ బిజినెస్, ప్రాఫిట్ ఎన్‌హాన్స్మెంట్ వైస్ ప్రెసిడెంట్ వరీందర్ వాధ్వా మాట్లాడుతూ.. ఈ చారిత్రాత్మక సంస్కరణకు భారత ప్రభుత్వానికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.…
Hyundai: మహీంద్రా, టాటా దారిలోనే హ్యుందాయ్ వెళ్తోంది. జీఎస్టీ తగ్గింపు తర్వాత హ్యుందాయ్ ఇండియా తన కార్ల ధరలను రూ. 2.4 లక్షల వరకు తగ్గించింది. ఇటీవల జీఎస్టీ తగ్గింపు ప్రయోజనాలను తన వినియోగదారులకు అందిస్తామని ప్రకటించింది. పండగ సీజన్‌కు ముందు సెప్టెంబర్ 22 నుంచి కొత్త ధరలు అమలులోకి వస్తాయి. సవరించిన ధరల కారణంగా హ్యుందాయ్ కార్లు మరింత చౌకగా మారుతాయి.
Mahindra cars: ఇటీవల జీఎస్టీ కౌన్సిల్ 56వ సమావేశంలో సంచలన నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 22 నుంచి సవరించిన జీఎస్టీ అమలులోకి రాబోతోంది. దీని ఫలితంగా, కార్లు కొనుగోలు చేయాలనుకునే వారికి లక్షల్లో డబ్బు ఆదా కాబోతోంది. పెట్రోల్ కోసం 1,200cc మరియు డీజిల్ కోసం 1,500cc మించని ఇంజిన్ సామర్థ్యం కలిగిన 4 మీటర్ల కంటే తక్కువ పొడవు గల కార్‌లను చిన్న కార్లుగా చెబుతారు.
Tata cars: జీఎస్టీ స్లాబ్ తగ్గింపుతో వాహనాలు కొనుగోలు చేయాలనుకునే వారికి అద్భుత అవకాశం లభించిందని చెప్పవచ్చు. కార్లు కొనుగోలు చేయాలనుకుంటున్న వారు, ఇప్పుడు సరిగా ప్లాన్ చేసుకుంటే లక్షల్లో డబ్బును ఆదా చేసుకోవచ్చు. సెప్టెంబర్ 22,2025 నుంచి సవరించిన జీఎస్టీ అమలులోకి వస్తున్న తరుణంలో, తమ వినియోగదారులకు జీఎస్టీ తగ్గింపు ప్రయోజనాలను అందిస్తామని దేశీయ కార్ మేకర్ టాటా ప్రకటించింది.