Hyundai Creta EV: హ్యుందాయ్ క్రెటా EV లాంచ్ ముహూర్తం ఫిక్స్..
- హ్యుందాయ్ క్రెటా EV లాంచ్ ముహూర్తం ఫిక్స్..
- భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో లాంచ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyundai Creta EV: భారతదేశంలో క్రమంగా ఎలక్ట్రిక్ కార్లకు జనాదరణ పెరుగుతోంది. దేశీ కార్ మేకర్స్ అయిన టాటా, మహీంద్రాలు ఇప్పటికే ఈవీ సెగ్మెంట్‌లో కొత్త కార్లను తీసుకువచ్చాయి. విదేశీ కార్ మేకర్స్ కూడా ఇదే దిశగా ఆలోచిస్తున్నాయి. ప్రస్తుతం టాటా ఈవీ కార్ విభాగంతో దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. టాటాలో టియాగో, టిగోర్, పంచ్, నెక్సాన్, కర్వ్ ఈవీ కార్లు ఉన్నాయి. బలమైన ఈవీ ఫోర్ట్‌పోలియోని టాటా కలిగి ఉంది. తాజాగా మహీంద్రా తన BE 6e, XEV 9e కార్లను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. ఇప్పుడున్న ఈవీలతో పోలిస్తే మరిన్ని అధునాతన ఫీచర్లు, స్టైలిష్ డిజైన్లతో కార్ లవర్స్‌ని ఆకట్టుకుంటున్నాయి.
తాజాగా హ్యుందాయ్ తన మోస్ట్ సెల్లింగ్ కార్ క్రెటాని EV అవతార్‌లో తీసుకురాబోతోంది. క్రెటా EVని భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో విడుదల చేయబోతోంది. జనవరి 17 నుంచి 22 వరకు ఈ ఆటో ఎక్స్‌పో కొనసాగుతుంది. ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు క్రెటా EV లాంచ్ జనవరి 17న జరుగుతుంది. ఇది మహీంద్రా BE 6e, టాటా కర్వ్ EV, ఎంజీ ZS EV, రాబోయే మారుతి సుజుకి e-విటారాకు పోటీగా ఉంటుంది. హ్యుందాయ్ క్రెటా ఈవీని తీసుకువస్తే, ఆ కంపెనీ నుంచి వస్తున్న మూడో ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ అవుతుంది. ఇప్పటికే హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్, ఐయోనిక్ 5 కార్లను కలిగి ఉంది.
Also Read
- TATA Sierra Legend Series: టాటా Sierra Legend Series భారత్‌లో లాంచ్.. 360-డిగ్రీ కెమెరా, 6 ఎయిర్‌బ్యాగ్స్
- Mahindra XUV 3X0 REVX Edge: మహీంద్రా XUV 3XO REVX Edge (O) లాంచ్.. సన్‌రూఫ్, 6 ఎయిర్‌బ్యాగ్స్‌తో అదిరిపోయే ఫీచర్లు
- బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
- 649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
క్రెటా EV తమిళనాడులోని హ్యుందాయ్ యొక్క శ్రీపెరంబుదూర్ ఫ్యాక్టరీలో తయారు చేయబడుతుంది. క్రెటా EV ఉత్పత్తికి ప్లాంట్‌లో సన్నాహాలు ప్రారంభించినట్లు కంపెనీ చీఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫీసర్ గోపాలకృష్ణన్ సిఎస్ తెలిపారు. క్రెటా EV పెట్రోల్, డిజిల్ క్రెటా డిజైన్‌ని కలిగి ఉంటుంది. అయితే, క్లోడ్జ్ ఫ్రంట్ గ్రిల్ రీడిజైన్ చేయబడుతుంది. ఏరోడైనమిక్ అల్లాయ్ వీల్స్ వంటి మార్పులు ఉండే అవకాశం ఉంది. ఇంటీరియర్‌లో ఇన్ఫోటైన్‌మెంట్, డ్రైవర్ కన్సోల్ కోసం ట్విన్ 10.25-ఇంచ్ డిస్‌ప్లేలు, కొత్తగా త్రీ-స్పోక్ స్టీరింగ్ వీల్, లెవెల్ 2 ADAS, 6 ఎయిర్‌బ్యాగ్‌లు, 360-డిగ్రీ కెమెరా, వెంటిలేటెడ్ సీట్లు వంటి ఫీచర్లు ఉంటాయి.
క్రెటా EV యొక్క స్పెసిఫికేషన్‌లపై ఇంకా అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ, ఇది 50kWh LFP బ్యాటరీతో వస్తుందని భావిస్తున్నారు. ఒక్క ఛార్జ్‌తో 450 కి.మీ -500 కి.మీ రేంజ్ కలిగి ఉంటుందని తెలుస్తోంది. ధర విషయాని వస్తే రూ. 18 లక్షల(ఎక్స్-షోరూం) నుంచి ప్రారంభమవుతుందని భావిస్తున్నారు.
తాజావార్తలు
-
Smriti Mandhana: పరుగుల రారాణి స్మృతి మంధాన.. టీ20 క్రికెట్లో అరుదైన ఘనత..!
-
Irumudi OTT: ఓటీటీలోనూ దుమ్మురేపుతున్న ‘ఇరుముడి’.. నెట్‌ఫ్లిక్స్‌లో నెం.1గా ట్రెండింగ్!
-
Oppo A7 Pro Max 5G: ఒప్పో A7 Pro Max 5G గ్లోబల్ లాంచ్.. 10,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరా!
-
Haribabu Murder Case: యూట్యూబర్ వైష్ణవి భర్త హత్య కేసులో కీలక పరిణామం.. మరో నలుగురి పాత్రపై దర్యాప్తు..!
-
Family Movies Dominate 2026 Box Office : 2026లో బాక్సాఫీస్ వద్ద ‘ఫ్యామిలీ సినిమాల’ హవా.. కుటుంబ ప్రేక్షకులకు నచ్చితే కలెక్షన్ల వర్షమే!
ట్రెండింగ్
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!