Hyundai: కార్ల ప్రియులకు బ్యాడ్ న్యూస్.. నేటి నుంచి భారీగా పెరగనున్న కార్ల ధరలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyundai: హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ (HMIL) దేశవ్యాప్తంగా తన మొత్తం మోడల్ లైనప్‌పై ధరలు పెంచనున్నట్లు ప్రకటించింది. ఈ ధరల పెంపు జనవరి 1, 2026 నుంచి అమల్లోకి రానుంది. వాహనాల తయారీలో కీలకమైన విలువైన లోహాలు, ఇతర కమోడిటీల ధరలు పెరగడం వల్ల ఇన్‌పుట్ ఖర్చులు అధికమయ్యాయని కంపెనీ ఈ నిర్ణయానికి కారణంగా పేర్కొంది. మంగళవారం రెగ్యులేటరీ ఫైలింగ్‌లో HMIL సగటున సుమారు 0.6 శాతం మేర ధరల పెంపు ఉంటుందని వెల్లడించింది. ముడి సరుకులపై కొనసాగుతున్న ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను సమతుల్యం చేయడానికే ఈ ధరల సవరణ చేపట్టినట్లు తెలిపింది.
Tata Motors: హ్యుందాయ్, మహీంద్రాను వెనక్కి నెట్టిన టాటా.. నెక్సాన్, సియెర్రా వల్లే ఈ ఘనత!
Also Read
- Honda UC3 Electric Scooter: 122KM రేంజ్, 3.2kWh బ్యాటరీతో హోండా UC3 ఎలక్ట్రిక్ స్కూటర్.. భారత్‌లో రిలీజ్ కు రెడీ..!
- TVS, Vida, Zelio, Bounce: బడ్జెట్లో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్.. రూ.36,000కే చౌకైన ఎలక్ట్రిక్ స్కూటర్..!
- Ather Konarc Launched: తక్కువ ధరలో ఎక్కువ రేంజ్.. మెటల్ బాడీ, స్మార్ట్ ఫీచర్లతో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్
- Range Rover Sport Twenty Edition: రేంజ్ రోవర్ స్పోర్ట్ ట్వంటీ లిమిటెడ్ ఎడిషన్ విడుదల.. 537HP పవర్, కొత్త ఆరెంజ్ కలర్
మోడల్ వారీగా ధరల పెంపు వివరాలను కంపెనీ వెల్లడించకపోయినా.. క్రెటా ఎస్‌యూవీ, వెన్యూ కాంపాక్ట్ ఎస్‌యూవీ, ఎక్స్టర్ మైక్రో ఎస్‌యూవీ, గ్రాండ్ i10 నియోస్ హ్యాచ్‌బ్యాక్, ఆల్కాజార్ వంటి ప్రజాదరణ పొందిన మోడళ్లపై ఈ ధరల పెంపు ప్రభావం చూపనుంది. భారత ఆటోమొబైల్ రంగంలో ఇప్పటికే అనేక కంపెనీలు ఇలాంటి నిర్ణయాలే తీసుకుంటున్నాయి. ఫ్రెంచ్ ఆటో దిగ్గజం రెనాల్ట్ గ్రూప్‌కు చెందిన రెనాల్ట్ ఇండియా జనవరి 2026 నుంచి తన మోడళ్లపై గరిష్టంగా 2% వరకు ధరలు పెంచనున్నట్లు ప్రకటించింది. ఇదే విధంగా JSW MG మోటార్ ఇండియా, Mercedes-Benz ఇండియా కూడా అదే తేదీ నుంచి 2 శాతం వరకు ధరలు పెంచనున్నట్లు తెలిపాయి. హోండా కార్స్ ఇండియా, నిస్సాన్ మోటార్ ఇండియా, BYD కంపెనీలూ ధరల పెంపు బాటలోనే నడుస్తున్నాయి.
120Hz AMOLED డిస్‌ప్లే, 200MP కెమెరా, Android 16తో Oppo Reno 15 సిరీస్ లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే..!
అయితే గత సంవత్సరాలతో పోలిస్తే ఈసారి ధరల పెంపు పరిమిత స్థాయిలోనే ఉందని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. డిమాండ్ స్థిరపడటం, పోటీ పరిస్థితులు ఇందుకు కారణమని వారు చెబుతున్నారు. భారత్‌లో రెండో అతిపెద్ద కార్ల తయారీదారుగా ఉన్న హ్యుందాయ్ 2025లో 5.6 లక్షలకుపైగా వాహనాలను విక్రయించింది. క్రెటా మోడల్ సెగ్మెంట్ లీడర్‌గా కొనసాగుతుండగా, ఎక్స్టర్ ఎంట్రీ లెవల్ విభాగంలో మంచి ఆదరణ పొందుతోంది.
తాజావార్తలు
-
Elephant Death: విద్యుత్ షాక్‌తో ఏనుగు మృతి.. పవన్ కల్యాణ్ సీరియస్.. కీలక ఆదేశాలు
-
Sofa Cleaning Tips: సోఫాపై మొండి మరకలా? ఈ ఇంటి చిట్కాతో సులభంగా క్లీన్ చేయండి
-
OTR: కవిత మాటలు నిజామాబాద్ పాలిటిక్స్‌లో మంటలు రేపుతున్నాయా..?
-
Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
-
US-Iran: రెండేళ్లలో ‘హార్ముజ్’ విలువలేనిదిగా మారొచ్చు.. ఇరాన్‌పై కఠిన ఆంక్షలకు అమెరికా ప్లాన్
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్‌ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!