TVS Sports is Best Mileage Bike in India 2023: ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరలు కొండెక్కి కూర్చున్నాయి. నేడు హైదరాబాద్ నగరంలో పెట్రోల్ ధర రూ. 109.66లుగా ఉండగా.. డీజిల్ ధర లీటరుకు రూ. 97.82గా ఉంది. దాంతో ప్రతి ఒక్కరు ఎలక్ట్రిక్ బైక్స్ కొనేందుకే ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. అదే సమయంలో కమ్యూటర్ బైక్‌లు కూడా దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్నాయి. సామాన్య ప్రయాణీకులు లేదా డైలీ రవాణాగా ఉపయోగించేందుకు ఈ బైక్‌లను కొంటున్నారు. తక్కువ ధరలో బెస్ట్ మైలేజీని ఇచ్చే బైక్‌లను కొనేందుకు సామాన్య ప్రజలు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపుతారు. అటువంటి వారి కోసం అద్భుత మైలేజ్ ఇచ్చే ఓ బైక్ ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం.
TVS Sports Price:
బజాజ్ సిటీ 100 మరియు హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్ బైక్‌లను ఎక్కువగా కొనుగోలు చేయడానికి ప్రధాన కారణం ధర, మైలేజ్. ఈ రెండు బైక్‌లకు పోటీగా టీవీఎస్ కూడా మార్కెట్లో ఒక మోటార్‌సైకిల్‌ను కలిగి ఉంది. ధర మరియు మైలేజీ పరంగా మంచి ఆప్షన్. ఆ బైక్ పేరు మరేదో కాదు ‘టీవీఎస్ స్పోర్ట్స్’. ఢిల్లీలో ఈ బైక్ కిక్ స్టార్ట్ వేరియంట్ ధర రూ. 64000 (ఎక్స్-షోరూమ్)లు కాగా.. సెల్ఫ్ స్టార్ట్ వేరియంట్ ధర రూ. 70000 (ఎక్స్-షోరూమ్)లుగా ఉంది. రాజస్థాన్‌లో అయితే ఈ బైక్ ధర కేవలం రూ. 54,000 మాత్రమే.
Also Read: Cheapest Electric Scooters: ధర 59 వేలు, 85 కిలోమీటర్ల ప్రయాణం.. బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే!
TVS Sports Features:
ఇతర కమ్యూటర్ బైక్‌ల మాదిరిగానే టీవీఎస్ స్పోర్ట్స్ కూడా మంచి డిజైన్‌ను కలిగి ఉంది. టీవీఎస్ స్పోర్ట్ ఆటోమేటిక్ హెడ్‌లైట్లు, స్పోర్టీ హెడ్‌ల్యాంప్‌లు, ప్రీమియం 3డీ లోగో మరియు ఎల్ఈడీ డీఆర్‌ఎల్‌ని కలిగి ఉంటుంది. అయితే ఈ బైక్ ఎల్ఈడీ హెడ్‌లైట్, డిజిటల్ కన్సోల్ మరియు ఫ్రంట్ డిస్క్‌లను కలిగి ఉండదు. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అనలాగ్ స్పీడోమీటర్, ఓడోమీటర్ మరియు ఇతర టెల్-టేల్ లైట్లతో పాటు ఫ్యూయల్ గేజ్ ఉంటాయి.
TVS Sports Mileage:
టీవీఎస్ స్పోర్ట్ బైక్ 109.7cc సింగిల్-సిలిండర్ ఇంజన్‌తో వస్తుంది. ఇది ఎకో-థ్రస్ట్ ఫ్యూయల్-ఇంజెక్షన్ టెక్నాలజీతో 7350ఆర్పీఎం వద్ద 8.29పీఎస్ మరియు 4500ఆర్పీఎం వద్ద 8.7ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్ నాలుగు-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. దీని గరిష్ట వేగం గంటకు 90 కిమీ. టీవీఎస్ స్పోర్ట్‌లో టెలిస్కోపిక్ ఫోర్కులు మరియు ట్విన్ షాక్స్ అబ్జార్బర్‌లు ఉంటాయి. బ్రేకింగ్ కోసం 130mm మరియు 110mm డ్రమ్ బ్రేక్‌లు వస్తాయి. టీవీఎస్ స్పోర్ట్ బైక్ 70 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది.
Also Read: Team India Captain: టీమిండియా కెప్టెన్‌గా ఊహించని పేరు!