Pakistan: కీబోర్డుతో కారు నడిపిన పాక్ కుర్రాడు..
- ఏడు నెలల పాటు శ్రమించి కంప్యూటర్ కీబోర్డ్ తో నడిచే కారును తయారు చేసిన యువకుడు
- కారు స్టీరింగ్ కూడా పట్టుకోకుండా కీబోర్డ్‌తో నియంత్రణ
- తరచూ వీడియో గేమ్ లు ఆడే అబ్బాస్
- వీడియో గేమ్ లో మాదిరిగా కారును తయారు చేయాలని పూనుకుని విజయం సాధించిన అబ్బాస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల గురించి మనకు తెలుసు. అయితే కంప్యూటర్ కీబోర్డ్‌తో నడిచే కారును మీరు ఎప్పుడైనా చూశారా? డ్రైవింగ్ సీటులో కూర్చోకుండానే కారు ఓ కుర్రాడు నడిపిచూపించాడు. పాకిస్థాన్‌లోని అబోటాబాద్‌లో నివాసముంటున్న ఎహసాన్ జాఫర్ అబ్బాసీ(20) సుజుకి ఆల్టోను సెల్ఫ్ డ్రైవింగ్ కారుగా మార్చాడు. కారు స్టీరింగ్ కూడా పట్టుకోకుండా కీబోర్డ్‌తో నియంత్రిస్తున్నాడు. అబ్బాసీ సాధించిన ఈ ఘనత పాకిస్థాన్‌లో ఎంతో పేరు తెచ్చిపెట్టింది. అబ్బాసీ తన ఇంట్లో చిన్న ల్యాబ్‌ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇక్కడే ప్రయోగాలు చేస్తున్నాడు. ఓ జాతీయ మీడియా సంస్థతో అబ్బాసీ మాట్లాడుతూ.. వీడియో గేమ్‌లు ఆడడం ద్వారా కీబోర్డ్‌తో పనిచేసే కారును తయారు చేయాలనే ఆలోచన తనకు వచ్చిందని చెప్పాడు.
READ MORE: Kalyan Dileep Sunkara: రాజ్ తరుణ్ కేసుపై దిలీప్ సుంకర ప్రెస్ మీట్
Also Read
- Revolt RVX vs Oben Rorr Evo: రివోల్ట్ RVX Vs ఓబెన్ రోర్ ఈవో.. ధర, రేంజ్, స్పీడ్‌లో ఏ ఎలక్ట్రిక్ బైక్ బెస్ట్?
- VIDA VX2 Plus: 187KM రేంజ్‌తో హీరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. ఫాస్ట్ ఛార్జింగ్, రిమూవబుల్ బ్యాటరీ
- New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!
- Volkswagen Tayron: వోక్స్వ్యాగన్ టేరాన్ లైఫ్ లాంచ్.. 9 ఎయిర్‌బ్యాగ్స్, లెవెల్-2 ADASతో ప్రీమియం SUV.. ధర, ఫీచర్లు ఇవే
అబ్బాసీ ఎక్కువగా వీడియో గేమ్‌లు ఆడేవాడు. వీడియో గేమ్‌లో మాదిరిగా కీబోర్డుతో నడిపే కారును తయారు చేయాలని అనుకున్నాడు. అప్పుడు.. అబ్బాసీ పాత స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్లెట్లు, ప్రింటర్లు, కంప్యూటర్లు, ప్రొజెక్టర్లు, జ్యూస్ మెషీన్లు మొదలైన వాటితో పరిశోధన ప్రారంభించాడు. ఏడు నెలల పాటు శ్రమించిన అబ్బార్ ఓ పాత ఆల్టో కారును కీబోర్డ్ తో నియంత్రించేలా చేశాడు. దానిని కీబోర్టు తో నడిపి.. ఈ వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నాడు. పాక్ నెటిజన్లు సోషల్ మీడియాలో అబ్బాస్ ను మెచ్చుకుంటున్నారు.
READ MORE:Bike: బైక్‌లో ఈ పార్ట్ పాడైతే అంతే సంగతులు..మీరు కూడా చెక్ చేసుకోండి..
ఈ కారును ఇలా నడుపుతున్నాడు.. రేస్ (యాక్సిలరేట్) అప్ కీ ద్వారా ఇవ్వబడింది. కీబోర్డు లోని కుడి, ఎడమ బాణం కీలు వరుసగా కుడి మరియు ఎడమ వైపునకు తిరిగేలా చేస్తాయి. డిలీట్ కీని ప్రెస్ చేస్తే.. హార్న్ మోగుతుంది. ఇది కాకుండా, క్లచ్ మరియు బ్రేక్ కోసం ప్రత్యేక కీలు ఉపయోగించాడు. ఈ కారులో సెన్సార్లు మరియు ఆధునిక సాంకేతికతను జోడించాడు. తద్వారా దివ్యాంగులు కూడా ఈ కారును సౌకర్యవంతంగా నడపవచ్చు .
తాజావార్తలు
-
Akhil Akkineni: ‘లెనిన్’తో బ్లాక్‌బస్టర్.. ఇక అఖిల్ టార్గెట్ మరింత పెద్దది.. నెక్స్ట్ మూవీపైనే ఫోకస్!
-
Bangkok Pub Fire: అర్థరాత్రి పబ్‌లో మంటల బీభత్సం.. 27 మంది మృతి (వీడియో)
-
Kitchen Hacks : ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లకు బైబై.. కళ్లమంటను తగ్గించే సింపుల్ చిట్కాలు.!
-
Congress: తుంగతుర్తి కాంగ్రెస్ పంచాయితీకి తెర.. జగ్గారెడ్డితో ఎమ్మెల్యే మందుల సామెల్ భేటీ.!
-
National Mourning: ఖతార్ మాజీ ఎమిర్ కన్నుమూత.. భారత్ కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో అల్లం-పసుపు టీ ఎందుకు తాగాలి.?
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..