సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల గురించి మనకు తెలుసు. అయితే కంప్యూటర్ కీబోర్డ్‌తో నడిచే కారును మీరు ఎప్పుడైనా చూశారా? డ్రైవింగ్ సీటులో కూర్చోకుండానే కారు ఓ కుర్రాడు నడిపిచూపించాడు. పాకిస్థాన్‌లోని అబోటాబాద్‌లో నివాసముంటున్న ఎహసాన్ జాఫర్ అబ్బాసీ(20) సుజుకి ఆల్టోను సెల్ఫ్ డ్రైవింగ్ కారుగా మార్చాడు. కారు స్టీరింగ్ కూడా పట్టుకోకుండా కీబోర్డ్‌తో నియంత్రిస్తున్నాడు. అబ్బాసీ సాధించిన ఈ ఘనత పాకిస్థాన్‌లో ఎంతో పేరు తెచ్చిపెట్టింది. అబ్బాసీ తన ఇంట్లో చిన్న ల్యాబ్‌ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇక్కడే ప్రయోగాలు చేస్తున్నాడు. ఓ జాతీయ మీడియా సంస్థతో అబ్బాసీ మాట్లాడుతూ.. వీడియో గేమ్‌లు ఆడడం ద్వారా కీబోర్డ్‌తో పనిచేసే కారును తయారు చేయాలనే ఆలోచన తనకు వచ్చిందని చెప్పాడు.
READ MORE: Kalyan Dileep Sunkara: రాజ్ తరుణ్ కేసుపై దిలీప్ సుంకర ప్రెస్ మీట్
అబ్బాసీ ఎక్కువగా వీడియో గేమ్‌లు ఆడేవాడు. వీడియో గేమ్‌లో మాదిరిగా కీబోర్డుతో నడిపే కారును తయారు చేయాలని అనుకున్నాడు. అప్పుడు.. అబ్బాసీ పాత స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్లెట్లు, ప్రింటర్లు, కంప్యూటర్లు, ప్రొజెక్టర్లు, జ్యూస్ మెషీన్లు మొదలైన వాటితో పరిశోధన ప్రారంభించాడు. ఏడు నెలల పాటు శ్రమించిన అబ్బార్ ఓ పాత ఆల్టో కారును కీబోర్డ్ తో నియంత్రించేలా చేశాడు. దానిని కీబోర్టు తో నడిపి.. ఈ వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నాడు. పాక్ నెటిజన్లు సోషల్ మీడియాలో అబ్బాస్ ను మెచ్చుకుంటున్నారు.
READ MORE:Bike: బైక్‌లో ఈ పార్ట్ పాడైతే అంతే సంగతులు..మీరు కూడా చెక్ చేసుకోండి..
ఈ కారును ఇలా నడుపుతున్నాడు.. రేస్ (యాక్సిలరేట్) అప్ కీ ద్వారా ఇవ్వబడింది. కీబోర్డు లోని కుడి, ఎడమ బాణం కీలు వరుసగా కుడి మరియు ఎడమ వైపునకు తిరిగేలా చేస్తాయి. డిలీట్ కీని ప్రెస్ చేస్తే.. హార్న్ మోగుతుంది. ఇది కాకుండా, క్లచ్ మరియు బ్రేక్ కోసం ప్రత్యేక కీలు ఉపయోగించాడు. ఈ కారులో సెన్సార్లు మరియు ఆధునిక సాంకేతికతను జోడించాడు. తద్వారా దివ్యాంగులు కూడా ఈ కారును సౌకర్యవంతంగా నడపవచ్చు .