Skoda Kylaq: స్కోడా కొత్త ఎస్‌యూవీ ‘‘కైలాక్’’ బుకింగ్స్‌లో దూసుకుపోతోంది. సబ్-4 మీటర్ కాంపాక్ట్ ఎస్‌యూవీగా స్కోడా కైలాక్ రాబోతోంది. స్కోడాలో ఇప్పటి వరకు సెడాన్, ఎస్‌యూవీ కార్ వంటి కార్లు ఉన్నప్పటికీ, సబ్-4 మీటర్ ఎస్‌యూవీ లేకపోవడంతో, ఈ స్థానాన్ని భర్తీ చేసేందుకు కైలాక్‌ని తీసుకువచ్చింది.
Skoda Kylaq: స్కోడా ఇండియా ప్రతిష్టాత్మకంగా ‘‘కైలాక్’’ని భారతీయ మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. సబ్-4 మీటర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ కార్ సెగ్మెంట్‌లో స్కోడా కైలాక్ రాకతో మరింత పోటీ పెరుగనుంది. ఇప్పటికే ఈ సెగ్మెంట్‌లో మారుతి సుజుకి బ్రెజ్జా, టాటా నెక్సాన్, హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్ వంటివి ఉన్నాయి. ఇప్పుడు కైలాక్ ఎంట్రీ ఇవ్వబోతోంది.
Skoda Kylaq: స్కోడా ఆటో ఇండియా తొలిసారిగా తన సబ్-4 మీటర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ‘‘కైలాక్’’ని నవంబర్ 5న విడుదల చేసింది. MQB-A0-IN ప్లాట్‌ఫారమ్ ఆధారంగా ఈ కైలాక్ కార్ నిర్మించబడింది. ఇదే ప్లాట్‌ఫారమ్‌పై కుషాక్, స్లావియా రూపుదిద్దుకుంది. సేఫ్టీ ఫీచర్ల పరంగా టాప్‌లో ఉన్న స్కోడా, ఇదే ఫీచర్లను కైలాక్‌లో కూడా అందించబోతోంది.