Venu Goapl Reddy
Author- NTV Telugu-
Bihar Crime: 14 ఏళ్ల బాలికను గన్‌తో బెదిరించి, కారులో తిప్పుతూ అత్యాచారం..
Bihar Crime: బీహార్‌లో దారుణం జరిగింది. రాజధాని పాట్నాకు 180 కి.మీ దూరంలోని సహర్సాలో 14 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగింది. గన్‌తో బెదిరించి బాలికను కారులోకి ఎక్కించుకుని ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితులను బిట్టు, అంకుష్‌గా గుర్తించారు. శనివారం ఈ ఘటన జరిగింది. బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
Amit Shah: చిన్న పల్లెటూరిలో పుట్టి దేశానికి ప్రధాని అయ్యారు.. మోడీ 100 రోజుల పాలనపై అమిత్ షా వ్యాఖ్యలు..
Amit Shah: చిన్న పల్లెటూరిలో పుట్టి దేశాని ప్రధాని అయి, దేశానికి గర్వకారణగా నిలిచారని ప్రధాని నరేంద్రమోడీపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రశంసలు కురిపించారు. ఈ రోజు మోడీ పుట్టిన రోజు సందర్భంగా దేశంలోని 140 కోట్ల మంది ప్రజలతో పాటు మేము కూడా ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుడి ప్రార్థిస్తున్నామని అన్నారు. -
Hardeep Singh Puri: రాహుల్ గాంధీది “పాకిస్తాన్ జాతిపిత” మనస్తత్వం.. కేంద్రమంత్రి ఫైర్..
Hardeep Singh Puri: అమెరికా పర్యటనలో కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. సిక్కులను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలపై సిక్కు సంఘాలతో పాటు బీజేపీ మండిపడుతోంది. అమెరికాలో ఓ కార్యక్రమంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ..‘‘సిక్కులు తలపాగా ధరించడానికి అనుమతిస్తారా.. లేదా..? అనే దానిపై భారత్‌లో పోరాటం జరుగుతోంది. సిక్కులు కడాను ధరించి, గురుద్వారాలను సందర్శించడానికి అనుమతిస్తారా..? ఇది సిక్కులకు మాత్రమే కాదు. అన్ని మతాలకు సంబంధించింది’’ అని అన్నారు. -
Doctor Rape-Murder Case: సుప్రీంకోర్టులో ఈ రోజు కోల్‌కతా వైద్యురాలి కేసు విచారణ.. తప్పిపోయిన పత్రమే కీలకం..
Doctor Rape-Murder Case: కోల్‌కతా వైద్యురాలి అత్యాచారం, హత్య ఘటనకు సంబంధించిన కేసుని ఈ రోజు సుప్రీంకోర్టు విచారించనుంది. భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ రోజ ఉదయం 10.30 గంటలకు ఈ కేసుని విచారిస్తుంది. చివరిసారిగా సెప్టెంబర్ 09న సుప్రీంకోర్టు ఈ కేసుని విచారించింది. -
PM Modi: నేడు ప్రధాని మోడీ 74వ పుట్టిన రోజు.. ‘‘సేవా పర్వ్’’గా నిర్వహిస్తున్న బీజేపీ..
PM Modi: ప్రధాని నరేంద్రమోడీ 74వ పుట్టిన రోజు సందర్భంగా దేశ, విదేశీ నేతలు శుభాకాంక్షలు చెబుతున్నారు. పుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా మంగళవారం 74వ పుట్టినరోజు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీకి శుభాకాంక్షలు తెలిపారు. విజన్ ఉన్న నాయకుడు, భారతదేశ ముద్దుబిడ్డ అంటూ విషెస్ చెప్పారు. -
Bangladesh: హిందువులపై దాడుల దర్యాప్తు కోసం ఢాకాకు యూఎన్ బృందం..
ఇదిలా ఉంటే, మైనారిటీలపై హింసను దర్యాప్తు చేయడానికి ఐక్యరాజ్యసమితి మానవహక్కుల పర్యవేక్షణ బృంధం బంగ్లాదేశ్ రాజధాని ఢాకాకి చేరుకుంది. నోబెల్ శాంతి గ్రహీత మహ్మద్ యూనస్ బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేతగా బాధ్యతలు తీసుకున్న తర్వాత కూడా అక్కడ మైనారిటీలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. -
Drug-Resistant Superbugs: ముంచుకొస్తున్న సూపర్‌బగ్ ముప్పు.. 2050 నాటికి 40 మిలియన్ల మంది మృతి..!
Drug-Resistant Superbugs: 2050 నాటికి ప్రపంచవ్యాప్తంగా 4 కోట్ల మంది డ్రగ్ రెసిస్టెంట్ సూపర్‌బగ్స్ ఇన్ఫెక్షన్ల కారణంగా మరణిస్తారని అంచానా వేయబడింది. సూపర్‌బగ్‌లు -- యాంటీబయాటిక్స్‌కు నిరోధకంగా మారిన బ్యాక్టీరియా లేదా వ్యాధికారక జాతులు, వాటికి చికిత్స చేయడం చాలా కష్టతరం చేస్తాయి. -
Viral Video: ఫ్లూయెంట్ ఇంగ్లీష్‌తో అదరగొట్టిన మహిళా సర్పంచ్.. షాక్‌తో చూస్తుండిపోయిన ఐఏఎస్ టీనా దాబీ..
Viral Video: సాంప్రదాయ రాజస్థానీ వేషధారణలో ఉన్న ఓ మహిళా సర్పంచ్ అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడుతుండటం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రాజస్థాన్ బార్మర్ జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో గౌరవ అతిథిగా వచ్చిన ఐఏఎస్ అధికారిణి టీనా దాబీ ముందు సర్పంచ్ ఫ్లూయెంట్‌గా ఇంగ్లీష్ మాట్లాడారు. -
Odisha: మిలాద్-ఉన్-నబీ ఉరేగింపులో పాలస్తీనా జెండా..
Odisha: ఒడిశాలోని కటల్‌లో జరిగిన మిలాద్-ఉన్-నబీ వేడుకలు వివాదాస్పదంగా మారాయి. ఊరేగింపు సందర్భంగా ఓ వ్యక్తి పాలస్తీనా జెండాను ప్రదర్శించడం ఉద్రిక్తతలను పెంచింది. సోమవారం నగరంలో ఊరేగింపు సందర్భంగా ఈ ఘటన జరిగింది. పాలస్తీనా జెండా ఊపుతూ ఓ వ్యక్తి కనిపించడంతో కొద్దిసేపు ఊరేగింపుని పోలీసులు నిలిపేశారు. ఈ ఘటన నగరంలోని దర్గా బజార్లో జరిగినట్లు వారు తెలిపారు. -
Zimbabwe: జింబాబ్వేలో తీవ్ర ఆహార సంక్షోభం.. 200 ఏనుగుల్ని చంపేందుకు అనుమతి..
Zimbabwe: ఆఫ్రికా దేశాలు తీవ్ర కరువుతో అల్లాడుతున్నాయి. కరువు పరిస్థితులతో ఆయా దేశాలు ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో నమీబియా బాటలోనే జింబాబ్వే నడుస్తోంది. అధికంగా ఉన్న ఏనుగుల జనాభాని నియంత్రించే ప్రయత్నాల్లో భాగంగా 200 ఏనుగులను చంపనున్నట్లు ప్రకటించింది. ఏనుగులను చంపాలని జింబాబ్వే పార్క్స్ అండ్ వైల్డ్ లైఫ్ అథారిటీ (జిమ్‌పార్క్స్)ని ప్రభుత్వం ఆదేశించింది.
తాజావార్తలు
-
CM Revanth Reddy : యువతే గేమ్‌చేంజర్.. మోడీపై రేవంత్ విమర్శలు
-
Sikandar Raza: ‘త్వరలోనే కొన్ని పరుగులు కొనుక్కుంటా’.. ఓటమిపై సికందర్ రజా ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Adilabad Airfield : ఆదిలాబాద్‌కు ఎయిర్పోర్ట్ బూస్ట్.. ₹2,278 కోట్ల మెగా ప్రాజెక్ట్
-
Shreyas Iyer: ‘నా ఫస్ట్ విన్ క్రెడిట్ అతనికే’.. అయ్యర్ నోటి నుంచి ఊహించని మాట..
-
Abhijeet Dipke: టైమ్ కావాలి, పంజాబ్ పేపర్ లీక్‌పై స్పందిస్తాము..
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో చర్మ దురదకు చెక్.. త్రిఫలతో సహజ చిట్కాలు!
-
CSK-Hardik Pandya: ఇద్దరు టాప్ స్టార్ ప్లేయర్స్, రూ.10 కోట్లు.. హార్దిక్ పాండ్య కోసం సీఎస్కే భారీ ఆఫర్!
-
Ishan Kishan: వైభవ్ సూర్యవంశీకి అన్ని తెలుసు.. ఆ ఒక్క విషయంలో మాత్రం జాగ్రత్త అని హెచ్చరించాం!
-
IND vs ZIM 3rd T20: మరో ఇద్దరు అరంగేట్రం.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. పిచ్, వెదర్, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Parents Alert: రోజూ ఫ్రూట్ జ్యూస్ ఇస్తున్నారా? పిల్లల్లో ఈ ప్రమాదం 52% పెరుగుతుందట.!