Akhilesh Yadav: ‘‘10 సెకన్ల రీల్ చాలు.. మీ ఇమేజ్ మారిపోతుంది’’.. పార్టీ నేతలకు అఖిలేష్ వార్నింగ్
- 10 సెకన్ల రీల్ మీ ప్రతిష్టకు, పతనానికి దారి తీయవచ్చు..
- ఏదీ తెలియకుండా మాట్లాడొద్దు..
- పార్టీ నేతలకు అఖిలేష్ యాదవ్ సూచన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Akhilesh Yadav: ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) చీఫ్ అఖిలేష్ యాదవ్ తన పార్టీ నేతలకు కీలక సూచన చేశారు. శనివారం అఖిలేష్‌తో పాటు పార్టీ జాతీయ ప్రతినిధులు రాజీవ్ రాయ్, రాజ్ కుమార్ భాటీ పార్టీ నేతల సమావేశానికి హాజరయ్యారు. ముందస్తు సన్నాహాలు లేకుండా ఎలాంటి చర్చల్లోకి వెళ్లొద్దని పార్టీ నేతలకు అఖిలేష్ సూచించారు. అవగాహాన లేకుండా మాట్లాడటం మంచిది కాదని అన్నారు.అన్ని విషయాల్లో మాట్లాడటం కన్నా మౌనంగా ఉండటమే ముఖ్యమని, ఎందుకంటే కొన్నిసార్లు మౌనంగా ఉండటం ద్వారా గొప్ప సందేశాన్ని ఇవ్వొచ్చని అన్నారు.
ప్రస్తుతం సోషల్ మీడియా యుగం నడుస్తోందని అఖిలేష్ అన్నారు. మీరు చెప్పే ఏ విషయమైనా క్షణాల్లో వైరల్ అవుతుందని, 10 సెకన్ల రీల్ పార్టీ ప్రతిష్టను నిలబెట్టగలదు, దెబ్బతీయగలదు అని చెప్పారు. ప్రతీ అంశంపై పూర్తి సమాచారం తెలిసిన తర్వాతే ప్రకటనలు చేయాలని, చర్చల్లో పాల్గొనాలని అన్నారు. తమ పార్టీ పీడీఏ గాలి రాష్ట్రమంతా వీస్తోందని, ఈ ఎన్నికలు బీజేపీ వర్సెస్ పీడీఏ(వెనకబడిన, దళిత, అల్ప సంఖ్యాక వర్గాలను సూచిస్తుంది)గా ఉందని అన్నారు. ఈసారి ‘‘ఓట్ బుల్డోజర్’’ను ఉపయోగించి బీజేపీ ప్రభుత్వాన్ని కూలుస్తామని అన్నారు.
Also Read
- Maharashtra: మహారాష్ట్రలో కరవు ఛాయలు.. 265 తాలూకాలు ప్రభావిత ప్రాంతాలుగా ప్రకటన
- UP Elections: యూపీలో మళ్లీ బీజేపీదే అధికారం.. లేటెస్ట్ సర్వేలో వెల్లడి..
- CJP: భారత్ మరో బంగ్లాదేశ్ కావాలనుకుంటున్నారా.? సీజేపీ అభిజిత్ దీప్కే డిమాండ్ ఏంటి..
- INDIA Bloc: 30న ఇండియా కూటమి కీలక భేటీ.. ‘సర్’పై భవిష్యత్ కార్యాచరణపై చర్చ
తాజావార్తలు
-
Akhilesh Yadav: ‘‘10 సెకన్ల రీల్ చాలు.. మీ ఇమేజ్ మారిపోతుంది’’.. పార్టీ నేతలకు అఖిలేష్ వార్నింగ్
-
Putin: ఐరోపాతో ఘర్షణ కోరడం లేదు.. ఉక్రెయిన్‌తో చర్చలకు సిద్ధమేనన్న పుతిన్
-
Maharashtra: మహారాష్ట్రలో కరవు ఛాయలు.. 265 తాలూకాలు ప్రభావిత ప్రాంతాలుగా ప్రకటన
-
Jr NTR: ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. గాయం తర్వాత ఫస్ట్ టైం రాజమౌళి కొడుకు కోసం పబ్లిక్‌లోకి ఎన్టీఆర్!
-
Virat Kohli: సంచలన ప్రకటన చేసిన కింగ్ కోహ్లీ.. ఇక, ఇదే లాస్ట్..!
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?