జీడిమెట్లలో కల్తీ కల్లు కలకలం రేపింది. నిజామాబాద్ జిల్లా, భోపాల్ కు చెందిన భార్యాభర్తలు రామ్ రెడ్డి నగర్ లోని కల్లు దుకాణంలో కల్లు సేవించి అస్వస్థతకు గురయ్యారు. రెండు రోజుల క్రితం గాజుల రామారం లో నివసిస్తున్న తమ కూతురు రేఖ దగ్గరికి వచ్చారు లచ్చిరాం,సాక్రిభాయ్ అనే దంపతులు. ఊర్లో ప్రతిరోజు కల్లు తాగే అలవాటు ఉండటంతో,రామ్ రెడ్డి నగర్ లోని కల్లు దుకాణంలో నిన్న సాయంత్రం కల్లు సేవించారు లచ్చిరాం దంపతులు. కల్లు తాగినప్పటి […]
పబ్లిక్ ప్లేసులను కూడా ప్రైవేట్ ప్లేసులుగా ఫీలవుతున్నారు కొందరు ప్రేమికులు. ఎక్కడ ఉన్నాము? ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాము అన్న సంగతి మరిచి విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా హైదరాబాద్ లో ఓ ప్రేమ జంట వెకిలి చేష్టలకు పాల్పడింది. రిల్స్ కోసం రన్నింగ్ బైక్ పై రొమాన్స్ తో రెచ్చిపోయింది. బైక్ పై అసభ్యకర రీతిలో ప్రయాణిస్తూ వీడియో తీసుకుంది ప్రేమ జంట. ఆరంగర్ ఫ్లైఓవర్ పై ప్రియురాలిని బైక్ పై ముందు కూర్చోబెట్టుకొని వేగంగా దూసుకెళ్లాడు ప్రియుడు. […]
పాకిస్తాన్లోని బలూచిస్తాన్ ప్రావిన్స్లో స్వాతంత్ర్యం కోసం డిమాండ్ పెరుగుతోంది. కొన్ని రోజుల క్రితం, బలూచ్ నేషనల్ మూవ్మెంట్ ‘ఆపరేషన్ బామ్ (ఉదయం)’ ప్రారంభించినట్లు ప్రకటించింది. ఈ ఆపరేషన్ కింద, బలూచ్ జాతీయ ఉద్యమ యోధులు పాకిస్తాన్లోని పంజ్గుర్, సుర్బ్, కెచ్, ఖరాన్లతో సహా అనేక జిల్లాల్లో దాదాపు 17 దాడులు చేశారు. ఇదిలా ఉండగా, బలూచిస్తాన్ “ఎప్పటికీ పాకిస్తాన్లో భాగం కాదు” అని బలూచ్ నేషనల్ మూవ్మెంట్ (BNM) సమాచార కార్యదర్శి ఖాజీ దాద్ మొహమ్మద్ రెహాన్ […]
ప్రపంచ నంబర్ వన్ జానిక్ సిన్నర్ ఆదివారం ఆల్ ఇంగ్లాండ్ క్లబ్లో తొలిసారి వింబుల్డన్ ట్రోఫీని గెలుచుకోవడం ద్వారా చరిత్ర సృష్టించాడు. వరుసగా రెండు సంవత్సరాలు టైటిల్ గెలుచుకున్న స్పెయిన్కు చెందిన కార్లోస్ అల్కరాజ్ను మూడు గంటల పాటు జరిగిన ఫైనల్లో 4-6, 6-4, 6-4, 6-4 తేడాతో ఓడించి సిన్నర్ గ్రాస్ కోర్టులో మూడోసారి టైటిల్ను గెలుచుకున్నాడు. వింబుల్డన్ టైటిల్ గెలిచిన తొలి ఇటాలియన్ ఆటగాడిగా సిన్నర్ నిలిచాడు. దీంతో గత నెలలో జరిగిన ఫ్రెంచ్ […]
స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ సంచలన ప్రకటన చేసింది. ఏడేళ్ల వివాహ బంధానికి గుడ్ బై చెబుతున్నట్లు తెలిపింది. తన దీర్ఘకాల భాగస్వామి పారుపల్లి కశ్యప్ నుంచి విడిపోతున్నట్లు ప్రకటించింది. సైనా తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో ఒక ప్రకటన విడుదల చేసి ఈ విషయాన్ని తెలియజేసింది. సైనా, పారుపల్లి 7 సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నారు. ఇద్దరూ హైదరాబాద్లోని పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో శిక్షణ పొందారు. కలిసి ఈ క్రీడలో పురోగతి సాధించారు. ఇద్దరూ […]
భారత్, ఇంగ్లాండ్ మధ్య అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ 2025లో భాగంగా మూడవ మ్యాచ్ లండన్లోని లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్లో జరుగుతోంది. ఈ మ్యాచ్లో గెలవాలంటే భారత్ 193 పరుగులు చేయాలి. ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ స్కోరు 192 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. వాషింగ్టన్ సుందర్ 4 వికెట్లు పడగొట్టాడు. బుమ్రా, సిరాజ్ చెరో రెండు వికెట్స్ ఖాతాలో వేసుకున్నారు. నితీశ్ రెడ్డి, ఆకాశ్ దీప్ ఒక్కో వికెట్ పడగొట్టారు. Also Read:Jharkhand: రోజూ రైలులో ప్రయాణిస్తున్న కోతి.. […]
వాట్సాప్, ఇన్స్టా, టెలిగ్రామ్, స్నాప్ చాట్ ఇలా రకరకాల సోషల్ మీడియా యాప్స్ అందుబాటులో ఉన్నాయి. వీటి ద్వారా టెక్స్ట్, ఆడియో, వీడియో, ఇమేజెస్ ద్వారా చాట్ చేస్తుంటారు. అయితే ఈ యాప్స్ పనిచేయడానికి ఇంటర్నెట్ తప్పనిసరి. కానీ ఇంటర్నెట్ లేకుండానే చాట్ చేసే వెసులుబాటు ఉన్న యాప్ ఉందనే విషయం తెలుసా? వాట్సాప్ లాంటి యాప్ కానీ, ఇంటర్నెట్ లేకున్నా చాట్ చేయొచ్చు. ట్విట్టర్ సహ వ్యవస్థాపకుడు జాక్ డోర్సే కొత్త మెసేజింగ్ యాప్ను విడుదల […]
వర్షా కాలం కొనసాగుతోంది. ఎడతెరిపి లేని వానల వల్ల పరిసరాలు మొత్తం బురద మయంగా మారుతుంది. చెత్తా చెదారం పేరుకుపోయి దోమల వ్యాప్తికి కారణం అవుతుంది. వర్షాకాలం వ్యాధుల కాలం అన్నట్లు వైరల్ ఫీవర్స్ వెంటాడుతుంటాయి. ఆసుపత్రులకు రోగులు క్యూకడుతుంటారు. దోమలు వచ్చాయి అంటే కచ్చితంగా వాటి వెనుక వ్యాధులు కూడా వస్తాయి. వర్షాకాలంలో ముఖ్యంగా వైరల్ ఫీవర్స్, టైఫాయిడ్, డెంగ్యూ, మలేరియా, జలుబు, దగ్గు వంటి వ్యాధులు సోకుతాయి. ఈ వ్యాధుల భారిన పడ్డప్పుడు సాధారణం […]
లేటెస్ట్ ఫీచర్ల కోసం కొందరు కొత్త స్మార్ట్ ఫోన్లను తీసుకునేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. మరికొందరు తమ ఫోన్ పాతబడిందని, పనితీరు సరిగా లేదని ఫోన్లని మారుస్తుంటారు. ఇలాంటి వారికి గోల్డెన్ ఛాన్స్. మీరు ఈ మధ్యకాలంలో కొత్త మొబైల్ కొనాలనే ప్లాన్ లో ఉన్నట్లైతే మతిపోగొట్టే డిస్కౌంట్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఇటీవల ఫ్లిప్కార్ట్లో GOAT సేల్ ప్రారంభమైంది. ఇది జూలై 17 వరకు కొనసాగనుంది. ఈ సేల్ లో కొన్ని స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్లు […]
దురదృష్టవశాత్తు ప్రమాదాలకు గురైనప్పుడు హెల్మెట్ ధరించి ఉన్నట్లైతే ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చు. టూవీలర్ వాహనదారులు తప్పకుండా హెల్మెట్ వాడాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తూ ఉంటారు. మార్కెట్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెల్మెట్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే కాస్త ధర ఎక్కువగా ఉండడం వల్ల కొనేందుకు వెనకడుగు వేస్తుంటారు. ఇలాంటి వారికి గుడ్ న్యూస్. ప్రముఖ ఈ కామర్స్ సంస్థలు అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లో సేల్ నడుస్తోంది. ఈ సందర్భంగా హెల్మెట్ అండ్ టూల్స్ తయారీ […]