Trinath Bandaru
Author- NTV Telugu-
Explainers: భూమి గుండెల్లో దాగిన నీటి రహస్యం.. ఏకంగా 660 కిలోమీటర్ల లోతులో..
భూమి మీద మనకు కనిపించే సముద్రాలన్నీ కలిపినా… భూమి తనలో దాచుకున్న నీటితో పోలిస్తే అవి ఎంత చిన్నవో మనకు తెలియకపోవచ్చు. ఎందుకంటే మన కళ్లకు కనిపించని వేల కిలోమీటర్ల లోతులో, రాళ్ల మధ్య నీటిని బంధించుకుని ఉన్న ఒక భారీ ప్రపంచం ఉండే అవకాశం ఇప్పుడు కనిపిస్తోంది. ఇన్నాళ్లూ భూమి లోపల నీరు ఎక్కడ దాగి ఉంటుందనే ప్రశ్న శాస్త్రవేత్తలను వెంటాడుతూనే ఉంది. ఇప్పుడు ఆ ప్రశ్నకు సమాధానం దొరికిందేమో అనిపించేలా రెండు కొత్త ఖనిజాలు […] -
America vs Iran: అమెరికా యుద్ధ నేరాలకు సాక్ష్యాలు.. పిల్లలను కూడా వ*దలలేదు..!
ప్రపంచానికి మానవ హక్కుల గురించి బోధించే అమెరికా..ఇప్పుడు యుద్ధ నేరాల ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఇరాన్లో అమెరికా యుద్ధనేరాలకు పాల్పడినట్టు ఐక్యరాజ్యసమితి చెబుతోంది. శాంతి, భద్రత పేరుతో క్షిపణులు ప్రయోగించిన అమెరికా.. ఇరాన్‌లోని స్కూల్ పిల్లల ప్రాణాన్ని కూడా తీసుకుంది. ఐక్యరాజ్యసమితి స్వతంత్ర నిపుణులే అమెరికా దాడులపై తీవ్రమైన అనుమానాలు వ్యక్తం చేయడం సంచలనంగా మారింది. ఇరాన్లో జరిగిన రెండు దాడుల్లో కనీసం 177 మంది పౌరులు చనిపోయారని.. ఆ దాడులు విచక్షణతోనే జరిగాయని చెప్పడానికి ఆధారాలు ఉన్నాయని […] -
Explainer: ముస్లిం దేశాలు రగిలిపోవడానికి కారణమేంటి?
మక్కా వైపు హౌతీల డ్రోన్ దూసుకొచ్చిందన్న వార్తతో ముస్లిం ప్రపంచం ఒక్కసారిగా అగ్నిగోళంలా మారిపోయింది. కాబా ఉన్న పవిత్ర నగరంపైకి యుద్ధం నీడ పడిందన్న వార్త కోట్లాది ముస్లింల గుండెల్లో ఆగ్రహాన్ని రగిలించింది. ఆ డ్రోన్ మక్కా నిషేధిత గగనతలంలోకి చేరకముందే సౌదీ అరేబియా వైమానిక రక్షణ వ్యవస్థ దాన్ని గాల్లోనే కూల్చేసింది. ఒక చిన్న లోహపు యంత్రం ఆకాశంలో ముక్కలైంది. కానీ దాని వెంట లేచిన కోపానికి అంత త్వరగా ముగింపు కనిపించడం లేదు. పాకిస్థాన్ […] -
Layoffs: 45ఏళ్లు దాటితే ఉద్యోగం ఊస్ట్? అంకుల్స్‌ను భయపెడుతున్న లెక్కలు!
కార్పొరేట్ ఉద్యోగం అంటే ఒకప్పుడు మంచి జీతం, అనుభవం పెరిగే కొద్దీ మరింత స్థిరమైన కెరీర్ అని భావించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతోంది. ఉదయం ఆఫీస్‌కు వెళ్లేందుకు సిద్ధమవుతున్న ఉద్యోగికి.. తెల్లవారుజామున వచ్చే ఒకే ఒక్క ఈమెయిల్‌తో ఎన్నో ఏళ్లుగా చేస్తున్న ఉద్యోగానికి ముగింపు పడుతుంది. మేనేజర్ నుంచి ముందస్తు హెచ్చరిక ఉండకపోవచ్చు. సిస్టమ్ యాక్సెస్ ఆగిపోవచ్చు. సెపరేషన్ నోటీసు చేతికి రావచ్చు. సెప్టెంబర్‌లో ఒరాకిల్, అడిడాస్ లాంటి కంపెనీల్లో ఉద్యోగాల కోతలు ఈ భయాన్ని […] -
Explainers: బాబోయ్.. ఇండియన్స్ వద్దు..!
ఆస్ట్రేలియాలో చదువుకోవాలనుకునే భారతీయ విద్యార్థులకు ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ఇప్పటివరకు యూనివర్సిటీలో అడ్మిషన్ రావడం, ఫీజులు కట్టడానికి డబ్బు ఉండటం, అవసరమైన డాక్యుమెంట్లు చూపించడం లాంటివి ఉంటే వీసా వస్తుందని చాలామంది అనుకునేవారు. కానీ ఇప్పుడు ఆస్ట్రేలియా అధికారులు మరో విషయం కూడా చాలా లోతుగా చూస్తున్నారు. మీరు నిజంగానే చదువుకోవడానికి ఆస్ట్రేలియా వెళ్తున్నారా? మీరు ఎంచుకున్న కోర్సు మీ చదువు, మీ అనుభవం, మీ భవిష్యత్తు ప్లాన్‌కు సరిపోతుందా? అనే విషయాలను కూడా చూస్తున్నారు. ఆస్ట్రేలియా […] -
Bats: గబ్బిలాల శరీరంలో దాగిన భయంకర రహస్యం..!
రాత్రి వేళ ఇంటి బయట నుంచి ఒక గబ్బిలం ఎగురుతూ వెళ్లింది. క్షణం పాటు మన కళ్ల ముందు కనిపించిన ఆ నల్లటి నీడ, కొన్ని సెకన్లలోనే చీకటిలో కలిసిపోయింది. కానీ ఆ గబ్బిలం శరీరంలో ఏం జరుగుతుందో మనకు కనిపించదు. మనుషుల్లో తీవ్రమైన వ్యాధులకు కారణమయ్యే సామర్థ్యం ఉన్న వైరస్లు దాని శరీరంలో తిరుగుతూ ఉండొచ్చు. అవి దాని శరీరంలోనే పెరుగుతున్నా, గబ్బిలం మాత్రం ఎలాంటి తీవ్రమైన అనారోగ్య లక్షణాలు లేకుండా తన జీవితాన్ని కొనసాగించగలదు. […] -
Glaciers: వేడెక్కుతున్న భూమితో ఏం జరగబోతోంది?
ఒక రోజు పర్వతం వైపు చూస్తే అక్కడ తెల్లగా మెరిసే మంచు కనిపించకపోవచ్చు. వేల ఏళ్లుగా అక్కడే నిలిచిన ఒక హిమానీనదం, మనం చూస్తుండగానే తన చివరి రోజులను లెక్కపెడుతుండొచ్చు. ఆ మంచు కరిగిపోవడం వెనుక కేవలం నీటి చుక్కలు ఉండవు. ఒక పర్వతం జ్ఞాపకం కరిగిపోతుంది. ఒక లోయ రూపం మారుతుంది. దాని నీటిని నమ్ముకుని బతికే లక్షలాది మంది భవిష్యత్తు కూడా మారుతుంది. ఆ భయం ఇప్పటికే హిమాలయాల్లో కనిపిస్తోంది. ఇంతకీ హిమలయాల్లో ఇప్పుడేం […] -
Explainer: వి*షం తింటున్నాం…! ప్యాకేజ్డ్ ఫుడ్‌పై ప్రభుత్వం ఉక్కుపాదం?
మన ఇంట్లో ఉండే ప్రతి ప్యాకెట్ ఫుడ్‌ను ఒకసారి గమనించండి. పిల్లల బిస్కెట్ల నుంచి మన సాయంత్రం నూడుల్స్ వరకు… ఫ్రిజ్‌లోని కూల్‌డ్రింక్ నుంచి టీవీ చూస్తూ తినే చిప్స్ వరకు… ఇవన్నీ మన జీవితంలో అంత సహజంగా కలిసిపోయాయి, వాటి గురించి ప్రత్యేకంగా ఆలోచించాల్సిన అవసరముందని కూడా మనకు అనిపించదు. కానీ ఆ ప్యాకెట్లో మనకు తెలియని స్థాయిలో చక్కెర, ఉప్పు, సంతృప్త కొవ్వు దాగి ఉంటే? అవి ప్రతిరోజూ కొద్దికొద్దిగా శరీరంలోకి వెళ్లి, సంవత్సరాల […] -
Debt Trap: అప్పు మీద అప్పు! దాచుకునేది తక్కువ..లోన్లు ఎక్కువ…ఇదే భారతీయుల దుస్థితి!
ఇండియాలో చాలామంది కుటుంబాలు ప్రతినెలా జీతం వచ్చిన వెంటనే కొంత డబ్బును పొదుపు చేస్తుంటారు. భవిష్యత్తు అవసరాల కోసం బ్యాంకులో దాచుకుంటారు, మ్యూచువల్ ఫండ్స్‌లో పెడతారు, షేర్లు కొంటారు. కానీ ఇదే సమయంలో మరో విషయం కూడా వేగంగా జరుగుతోంది. మనం దాచుకునే డబ్బు కంటే మనం చేసే అప్పులు మరింత వేగంగా పెరుగుతున్నాయి. రిజర్వ్ బ్యాంక్ తాజా గణాంకాలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. నాలుగేళ్ల క్రితం ఒక కుటుంబం దగ్గర వంద రూపాయల ఆర్థిక […] -
Breakup: బ్రేకప్ తర్వాత కొన్ని రోజులకే ప్రేమ పుడుతుందా?
ఒక కొత్త డేట్‌కి వెళ్లారు. మీ ఎదురుగా ఒక కొత్త వ్యక్తి కూర్చున్నారు. వాళ్లు నవ్వుతున్నారు. మీతో మాట్లాడుతున్నారు. మీ గురించి తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. అంతా కొత్తగానే ఉంది కానీ మీ మనసులో మాత్రం ఇంకా ఇంకొకరు ఉన్నారు. వాళ్లు మాట్లాడే విధానాన్ని పాత వ్యక్తితో పోలుస్తున్నారు. వాళ్లు మెసేజ్‌కి ఆలస్యంగా స్పందిస్తే పాత సంబంధం గుర్తొస్తోంది. వాళ్లు చూపించే ఇంట్రెస్ట్‌ని కూడా గతంలో మీకు దొరికిన ఇంట్రెస్ట్‌తో కొలుస్తున్నారు. ఒక్కసారిగా మీకు ఒక విషయం అర్థమవుతుంది. […]
తాజావార్తలు
-
Manchu Manoj: మంచు మనోజ్ కొత్త సినిమా.. పోతరాజు నేపథ్యంలో భారీ బడ్జెట్‌తో డివైన్ యాక్షన్ థ్రిల్లర్!
-
Mohan Bhagwat: స్మిత్ మచ్చర్ హిందూ విలువలకు నిదర్శనం.. ఆర్ఎస్ఎస్ చీఫ్ ప్రశంసలు..
-
Kim Jong Un Death Rumors: కిమ్ జోంగ్ ఉన్ మృతిపై పుకార్లు.. కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
-
SS Rajamouli-Varanasi: ఆరేడు సినిమాలను కలిపి ఒకే చిత్రంగా.. ‘వారణాసి’పై రాజమౌళి ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
-
Dussehra astrology: దసరా నుంచి ఈ 3 రాశుల వారికి త్రిగ్రాహి, లక్ష్మీనారాయణ, బుధాదిత్య యోగాలు..
ట్రెండింగ్
-
29kmpl మైలేజ్, 160PS పవర్, పనోరమిక్ సన్‌రూఫ్ తో Renault Duster Hybrid E-Tech లాంచ్..
-
Asian Para Games: తొలిరోజే 11 పతకాలు..! ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..
-
India Playing XI: రోహిత్-గిల్ ఓపెనర్స్.. కోహ్లీ మూడో స్థానంలో.! 2027 ప్రపంచ కప్ జట్టును ఎంపిక చేసిన టీమిండియా మాజీ ప్లేయర్.!
-
New Recharge Plans: డేటా అవసరం లేదా? కొత్త రీఛార్జ్ ప్లాన్స్ వచ్చేశాయ్.. రూ.185 నుంచి మొదలు.!
-
WPL 2027 Auction: 27 స్థానాల కోసం 146 మంది ప్లేయర్లు.. WPL వేలం తేదీ, వేదిక ఖరారు..!