Trinath Bandaru
Author- NTV Telugu-
‘ఈ శరీరం నాదే కానీ ఇందులో నేను లేను..’ ఇండియాలో ట్రాన్స్జెండర్ల సర్జరీల వెనుక నమ్మలేని నిజాలు
Gender-affirming surgeries:వారిపై జోకులు పేలుస్తారు. సినిమాల్లో, కామెడీ షోల్లో వారిని అవమానించడమే పెద్ద జోకు! ఎవర్ని అయినా తిట్టాలంటే వారినే వాడుకుంటారు. ఇంకెవర్ని అయినా చిన్నచూపు చూడాలంటే వాళ్లని ఉదాహరణగా చూపించే అలవాటు ఈ సమాజానికి కొత్తమీ కాదు. ఒక మనిషిని అవమానించడానికి ట్రాన్స్జెండర్లనే ఆయుధంగా మార్చేసే సమాజం.. ఈ ప్రపంచంలో కేవలం రెండే లింగాలు ఉన్నాయనే అజ్ఞానంలో బతుకుతుంటుంది. ఇదే బయాలజీ అని భ్రమపడుతుంటుంది. కానీ రియాల్టీ వేరు. మనిషి శరీరం ఒకటైతే..మనసు మరో కథ […] -
Indian Education System: ఇండియా ఇలా.. చైనా అలా..! తప్పు విద్యార్థులది కాదు..!
ఎన్ని మార్కులొచ్చాయ్? ర్యాంక్ ఎంత? ఆ వన్ మార్క్ ఎందుకు తగ్గింది? తరుచుగా ఇండియాలో తల్లిదండ్రులు, టీచర్ల నుంచి విద్యార్థులకు ఎదురయ్యే ప్రశ్నలివి. ఈ ఏఐ కాలంలోనూ ప్రతిభను కొలవడానికి మార్కులే ప్రామాణికం కావడం బాధాకరమే.. ఎందుకంటే ఇతర దేశాలు తమ విద్యావ్యవస్థలను మార్చుకొని అభివృద్ధిలో దూసుకెళ్తున్నాయి. ఉదాహరణకు మన పక్కనే ఉండే చైనా ఎడ్యూకేషన్ సిస్టమ్‌ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూపోతోంది. ఇలా ఒకే వయసు.. ఒకే తరగతి కానీ… రెండు దేశాల్లో రెండు వేర్వేరు భవిష్యత్తులు […] -
Iran Religious Dictatorship: మానవత్వం ఎక్కడో చచ్చిపోయింది.. మేధావులకు రాజకీయాలే ఎక్కువయ్యాయా?
ఎక్కడ పుడితేనేం మనిషి తీసుకునే శ్వాస ఒకటే కదా.. ఒకరి గుండె పగిలితే ఆ చీలిక మనలోనూ వినిపించాలి కదా! ఎన్నో శతాబ్దాల క్రితం పెర్షియన్ కవి సాది షిరాజీ చెప్పినట్టు మనుషులంతా ఒకే శరీరానికి భాగాలు.. ఒకరి నొప్పి ఇంకొకరిని తాకాలి.! మరి ఈరోజు అలాంటి భావన ప్రజల్లో కనిపిస్తుందా? ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంలో ప్రపంచమంతా మానవత్వం గురించి కాకుండా రాజకీయాలే గురించే ఎక్కువగా ఎందుకు మాట్లాడుతోంది? ఇరాన్లో ఓ చిన్నారి నవ్వు మధ్యలోనే ఆగిపోతుంటే మనుషులకు […] -
Saudi Arabia-Iran-Mecca: రక్తం పారింది… ఇస్లాం పవిత్ర నగరం కోసం ఇరాన్-సౌదీ యుద్ధం..!
జూలై 31, 1987..! ఇస్లాం పవిత్ర నగరం మక్కా..! ప్రార్థనలు వినిపించాల్సిన ప్రదేశంలో హాహాకారాలు వినిపించాయి. హజ్ యాత్రలో పాల్గొన్న వేలాది భక్తుల మధ్య ఉద్రిక్తత చెలరేగింది. ఒక నిరసన.. క్షణాల్లో హింసగా మారింది..! రక్తం నేలపై పారింది.. వందల మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పవిత్రతకు ప్రతీకగా భావించే ఆ ప్రదేశం.. ఒక్కరోజులోనే రాజకీయాలు, మతం, శక్తి పోరాటాల రంగస్థలంగా మారింది. ఆ ఘటన తర్వాత ప్రపంచమంతా ఒకే విషయంపై భారీ ఎత్తున చర్చ జరిగింది. […] -
Ganga-Jamuni-Tehzeeb: భిన్నత్వంలో ఏకత్వం..హిందూ-ముస్లింల శతాబ్దాల బంధానికి ఈ సంస్కృతి ప్రతీరూపం
Ramadan 2026: సాయంత్రం ఆకాశం మెల్లగా చీకటిలో కలిసిపోతుంది. చంద్రుని కోసం ఎదురు చూస్తున్న ఆ క్షణం గాలిలో ఒక పవిత్రమైన ప్రశాంతత కలుగుతుంది. ఒక చిన్న వీధిలో వెలుగులు మెరుస్తున్నాయి. ఇంటి ముందు దీపాలు వెలిగిస్తున్న చేతులే కొద్దిసేపటికి ఇఫ్తార్ కోసం ఖర్జూరాలు పంచుతున్నాయి. ఒక వైపు ఆలయం గంట మోగుతుంది. ఇంకో వైపు మసీదు అజాన్ వినిపిస్తుంది. ఆ శబ్దాలు వేరైనా ఆ అనుభూతి మాత్రం ఒక్కటే..! శతాబ్దాల క్రితం నుంచే ఈ భరత […] -
Iran Vs Israel War: ఒకే యుద్ధం.. మూడు కథలు.. మూడు నిజాలు..! ఇరాన్ గెలవబోతుందా?
అమెరికా-ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధానికి ముగింపు ఎక్కడుందో ఎవరికీ తెలియదు..అయితే గెలుపును మాత్రం ఎవరికి వారు ఓన్ చేసుకుంటున్నారు. అమెరికా తన విజయాన్ని ప్రకటించుకుంటోంది. ఇజ్రాయెల్ తమ దాడులు ఫలించాయని చెబుతోంది.. ఇరాన్ మాత్రం ఇంకా నిలబడే ఉన్నామని గర్వంగా చెబుతోంది..! ఒకే యుద్ధం.. మూడు కథలు.. మూడు నిజాలు.. ఇంతకి అసలు నిజం ఏంటి? ఇప్పుడీ యుద్ధంలో నిజంగా ఎవరు ముందంజలో ఉన్నారు? ఫిబ్రవరి 28న ప్రారంభమైన ఈ యుద్ధం ఇప్పుడు మూడో వారంలోకి వెళ్లింది. మొదటి దశలో […] -
Internet: యుద్ధం ఎఫెక్ట్.. ఇండియాకు ఇంటర్నెట్ కట్..!? తెరపైకి కొత్త భయాలు!
ఎక్కడో జరుగుతున్న ఒక యుద్ధం.. మన మొబైల్ ఫోన్లలో నెట్ ఆగిపోవడానికి కారణమవుతుందా? హార్ముజ్ జలసంధిని మూసేస్తే ప్రపంచానికి చమురు ఆగిపోతుందని తెలుసు.. కానీ అదే మార్గం బ్లాక్ అవ్వడం కారణంగా ఇంటర్నెట్ లైన్లు కూడా కట్ అవుతాయా? వీడియో కాల్స్, బ్యాంకింగ్, స్టాక్ మార్కెట్లు.. ఇలా మన రోజువారీ జీవితం మొత్తం ఒక్కసారిగా నెమ్మదిస్తే? మధ్యప్రాచ్య యుద్ధం ఇప్పుడు ఒక కొత్త భయాన్ని తెరపైకి తీసుకొచ్చింది. ఇది కేవలం చమురు యుద్ధం మాత్రమే కాదని.. ప్రపంచాన్ని […] -
Couvade syndrome: మగాళ్లకు కూడా గర్భం.. సైంటిస్టులు తేల్చిన సంచలన నిజం!
ఒక ఇంట్లో భార్య గర్భవతి అయితే అదే సమయంలో భర్తకు కూడా వాంతులు, అలసట, బరువు పెరగడం లాంటి లక్షణాలను మీరు ఎప్పుడైనా గమనించారా? ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి ఘటనలు రికార్డవుతున్నాయంటే నమ్మగలరా? శాస్త్రవేత్తలు కూడా దీనిపై సీరియస్‌గా అధ్యయనం చేస్తున్నారు. ఇంతకీ శరీరంలో మార్పులు లేకుండా ఈ తరహా లక్షణాలు ఎలా వస్తాయి? మనసు శరీరాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? ఇంతకీ పురుషులకు ఎదురయ్యే ఈ ‘కౌవేడ్ సిండ్రోమ్’ వెనుక అసలు రహస్యం ఏంటి? కౌవేడ్ సిండ్రోమ్ […] -
The myth of Baba Vanga: అంతా ట్రాష్.. ఆపండి మీ అబద్ధాలు.. బాబా వంగా పేరుతో ఫేక్ న్యూస్!
ఏదైనా ఊహించని ఇన్సిడెంట్ జరిగితే చాలు.. మీడియాలో, సోషల్‌మీడియాలో బాబా వంగా పేరు తెగ వినిపిస్తుంటుంది. ఆవిడ ఈ ఘటన గురించి ముందే చెప్పారంటూ వార్తలు వైరల్ అవుతుంటాయి. ప్రపంచ యుద్ధం వస్తుందని ఆమె ముందే చెప్పిందట, కరోనా మహమ్మారి గురించి కూడా ఆమె ముందే హెచ్చరించిందట, ఇప్పుడు మధ్యప్రాచ్యంలో జరుగుతున్న యుద్ధాలనూ ఆమె సంవత్సరాల క్రితమే చూసిందట. యూట్యూబ్ వీడియోలు, ఫేస్బుక్ పోస్టులు, కొన్ని మీడియా కథనాలు కూడా ఇలాంటి వాటిని పెద్ద ఎత్తున ప్రచారం […] -
India-Iran History: ఒకే దేవతలను పూజించిన విశ్వాసాలు..4000ఏళ్ల ఇండియా-ఇరాన్ చరిత్ర..!
చరిత్రలో కొన్ని బంధాలు రక్తంతో కాకుండా సంస్కృతితో ఏర్పడతాయి. వేల ఏళ్ల క్రితం ఒకే అగ్ని ముందు నిలబడి ప్రార్థనలు చేసిన రెండు నాగరికతలు ఉన్నాయి. ఒకే భాషకు దగ్గరగా ఉన్న మాటలు, ఒకే దేవతలను పూజించిన విశ్వాసాలు, ఒకే సంప్రదాయాలను పంచుకున్న సంస్కృతులున్నాయి. కాలం వాటిని వేర్వేరు దారుల్లో నడిపించినా ఆ మూల బంధం మాత్రం ఇంకా చరిత్రలో కనిపిస్తూనే ఉంది. ఆ రెండు నాగరికతలు భారత్, ఇరాన్. ఒకప్పుడు ఆర్యుల భూములుగా గుర్తింపు పొందిన […]
తాజావార్తలు
-
Abbas: 12 ఏళ్ల తర్వాత టాలీవుడ్లోకి అబ్బాస్ రీఎంట్రీ..?
-
Nero Teaser Controversy: ప్రమోషన్ల కోసమా.. జనాల అటెన్షన్ కోసమా.. ఆ హీరో చేసింది కరెక్టేనా?
-
Vrushakarma టైటిల్‌కు అసలు అర్థం చెప్పిన డైరెక్టర్.. సినిమాలో చైతూ పాత్ర ఇదేనట!
-
Eyeglass Lens Scratches : కళ్లద్దాలను చొక్కాతో తుడుస్తున్నారా?.. ఈ తప్పు అస్సలు చేయొద్దు.!
-
Satvika Veeravalli vs Afiya Syed: ‘కల్పన’ క్రేజ్‌కు ‘రుక్మిణి’ చెక్ పెడుతుందా?
ట్రెండింగ్
-
BSNL బంపర్ ఆఫర్..! ఆ రీఛార్జ్‌తో రూ. లక్ష బీమా ఫ్రీ..! రూ. 10 వేల సైబర్ బీమా కూడానూ..
-
MS Dhoni: ‘7’ నంబర్‌పై ధోనీ షాకింగ్ కామెంట్స్.. దాని వెనుక లాజిక్ ఇదే అంటూ..!
-
IND vs NZ: ముగిసిన మూడో రోజు ఆట.. భారీ ఆధిక్యం దిశగా న్యూజిలాండ్..!
-
11,000mAh బ్యాటరీ, 7 అంగుళాల భారీ డిస్ప్లేతో రానున్న Redmi Turbo 6 Max..!
-
Jasprit Bumrah Unwanted Record: 292 బంతుల తర్వాత.. జస్ప్రీత్ బుమ్రా కెరీర్లోనే చెత్త రికార్డు!