Trinath Bandaru
Author- NTV Telugu-
Union Budget 2026: మిడిల్ క్లాస్ ఏం కోరుకుంటోంది? ఆ సమస్యలకు ఫుల్స్టాప్ పడినట్టేనా?
ప్రతి బడ్జెట్ ముందు ఇండియన్ మిడిల్ క్లాస్ వర్గంలో ఒకే రకమైన ఆలోచనా విధానం కనిపిస్తుంది. ఈసారి అయినా ట్యాక్స్ ఫైలింగ్ సులభం అవుతుందా? డాక్యుమెంట్ల పని, నోటీసులు, గందరగోళం తక్కువవుతాయా? నిజానికి ప్రభుత్వానికి ట్యాక్స్ చెల్లించే బాధ్యతను ఎవరూ తప్పించుకోవాలని అనుకోవడం లేదు. కానీ ఆ బాధ్యత అర్థం కాని డాక్యుమెంట్లు, మారుతున్న నిబంధనల మధ్య భయంగా మారకూడదన్నదే ఉద్యోగులు, మధ్యతరగతి కోరుకుంటోంది. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌కు ముందు ఈ ఆశలు మరింత గట్టిగా […] -
Mental Health: పిల్లలకు భరించలేని హింస.. పేరెంట్స్, టీచర్ల దెబ్బకు టీనేజ్లోనే మెంటల్ టార్చర్!
ఇప్పుడు పిల్లల జీవితంలో గడియారం ముల్లు చాలా వేగంగా తిరుగుతోంది. 16ఏళ్ల వయసులో ఒక నిర్ణయం తీసుకుని 30 ఏళ్ల వరకు దానితోనే జీవించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంకా స్కూల్ చదువు పూర్తి కాకముందే భవిష్యత్తు డెడ్లైన్లు మొదలవుతున్నాయి. ఏ స్ట్రీమ్ తీసుకోవాలి, ఏ కోర్సు ఎంచుకోవాలి, ఏ జాబ్ మార్కెట్లో నిలబడాలన్న ప్రశ్నలు టీనేజ్ వయసులోనే భుజాల మీద పడుతున్నాయి. బయట నుంచి చూస్తే ఇదంతా అవకాశాల ప్రపంచంలా కనిపిస్తుంది. ఏఐ ఉంది, టెక్నాలజీ ఉంది, […] -
Union Budget 2026: భార్యాభర్తలకు నిర్మలమ్మ గుడ్‌న్యూస్.. డబ్బును ఆదా చేసుకునే ఛాన్స్?
పెళ్లి.. అంటే రెండు జీవితాలు కలిసి నడవడం. కానీ పన్ను చెల్లించే విషయంలో మాత్రం ఇప్పటికీ ప్రతి ఒక్కరు ఒంటరిగానే నిలబడాల్సిన పరిస్థితి. ఆదాయంపై ట్యాక్స్‌ను వ్యక్తిగతంగా లెక్కించే సిస్టమ్ మనది. దీనికారణంగా మధ్యతరగతి కుటుంబాలపై పన్ను భారం పెరుగుతోంది. అయితే ఈ పరిస్థితి మారే అవకాశం ఇప్పుడు కనిపిస్తోంది. ఫిబ్రవరి 1 బడ్జెట్(Union Budget 2026)కి ముందు ప్రభుత్వం ఒక కొత్త విధానంపై చర్చిస్తోంది. భార్యాభర్తలు కలిసి ఒకే ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసేలా జాయింట్ […] -
Employee Rights: జీతం ఆపేస్తే కంపెనీకి శిక్ష.. ఉద్యోగుల శాలరీని ఆలస్యం చేస్తున్న సంస్థలకు వార్నింగ్!
నెల చివర జీతం పడుతుందా లేదా అనే ఒక్క ప్రశ్న మీద కోట్ల మంది కుటుంబాల జీవితం నడుస్తోంది. జీతం ఆలస్యమైతే ఆ ప్రభావం ఆఫీస్ వరకే ఆగదు. ఇంటి ఖర్చులు గందరగోళంగా మారతాయి. అప్పులు పెరుగుతాయి. ఒత్తిడి మొదలవుతుంది. అయినా చాలా కంపెనీలు జీతం ఆలస్యం చేయడాన్ని సాధారణ విషయంలా తీసుకుంటున్నాయి. కొన్నిచోట్ల సగం జీతమే ఇస్తారు. కొన్నిచోట్ల రిజైన్ చేసిన తర్వాత నెలల తరబడి ఫుల్ అండ్ ఫైనల్ పేరుతో డబ్బు ఆపేస్తారు. కానీ […] -
Pandemic: మరో మహమ్మారికి ముహూర్తం ఫిక్స్.. బాం*బు పేల్చిన టాప్ సైంటిస్ట్!
ఈ భూమి మళ్లీ ఒక మహమ్మారి కోసం సిద్ధమవుతోంది. ఇది వార్త కాదు.. ఇది ఊహ అంతకన్నా కాదు. ఇది ఒక శాస్త్రవేత్త చేసిన హెచ్చరిక. ప్రపంచ ఆరోగ్య సంస్థ మాజీ చీఫ్, సైంటిస్ట్ డాక్టర్ సౌమ్యా స్వామినాథన్ చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. కోవిడ్ ఎలా పుట్టిందో ఇప్పటికీ ఎవరికీ తెలియదు.. ఇది ల్యాబ్‌లో పుట్టిందా.. అడవిలో మొదలైందా.. లేదా మన అజ్ఞానమే దానికి జన్మనిచ్చిందా అన్నది ఇప్పటికీ మిస్టరీనే. కానీ ఒక విషయం మాత్రం […] -
Compound Crimes: చీకటి గుహల్లో నేర సామ్రాజ్యం.. భారతీయులే టార్గెట్!
మన ఫోన్లోకి వచ్చే ఒక మెసేజ్.. ఒక జాబ్ ఆఫర్.. ఒక ఫ్రెండ్ రిక్వెస్ట్… ఇవి చాలా చిన్న విషయాల్లా కనిపిస్తాయి. కానీ ఆ ఒక్క క్లిక్ వెనుక ఒక చీకటి ప్రపంచం పనిచేస్తోంది. ఇది కేవలం ఆన్లైన్ మోసం కాదు. ఇది గోడలతో, గార్డులతో, ఆయుధాలతో నడిచే ఒక భూగర్భ సామ్రాజ్యం. సౌత్ఈస్ట్ ఆసియాలో అడవులు, బోర్డర్ ప్రాంతాలు, ఓల్డ్ క్యాసినోల మధ్య పుట్టిన స్కామ్.. ఇప్పుడు ప్రపంచానికే ముప్పుగా మారాయి. వేల మందిని బంధీలుగా […] -
Yuvraj Mehta: ‘నాన్నా.. నన్ను కాపాడు…’ ఇది వ్యవస్థ చేసిన హ*త్య..? సంచలనం రేపుతోన్న యువరాజ్ డెత్ ఎపిసోడ్!
ఆ రాత్రి వర్షం మాత్రమే కాదు.. నిర్లక్ష్యం కూడా కురిసింది..! ఇది యాక్సిడెంట్ కాదు.. ఒక వ్యవస్థ చేసిన దారుణ హత్య! ఇంటికి కేవలం కిలోమీటర్ దూరంలో ఒక యువకుడు తన ప్రాణాల కోసం పోరాడాడు. నీటితో నిండిన చీకటి గుంతలో చిక్కుకుని 90 నిమిషాల పాటు సహాయం కోసం కేకలు వేశాడు. ఫోన్ టార్చ్ వెలిగించి బయట తిరుగుతున్న వాళ్లకి కనిపించేందుకు ప్రయత్నించాడు. తండ్రికి కాల్ చేసి తనని రక్షించాలని వేడుకున్నాడు. కానీ ఆ చీకటిలో […] -
Fidel Castro: 634సార్లు ప్రయత్నించి చంపలేకపోయారు.. అమెరికాను వణికించిన విప్లవ వీరుడు!
అతని సంకల్పం అణుబాంబుల కంటే బలమైనది.. అతని తిరుగుబాటు తత్వం గాలికన్నా వేగంగా ఖండాలు దాటేది. అతని ఆలోచనలు మిస్సైళ్ల కంటే వేగంగా ప్రయాణించేవి..అతని పేరు వినగానే వైట్ హౌస్ గోడల్లో వణుకు మొదలయ్యేది. ఒక చిన్న ద్వీప దేశం.. ఆ చిన్నదేశంలో ఓ నాయకుడు అమెరికా సామ్రాజ్యానికి నిద్రలేని రాత్రులను మిగిల్చాడు. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మడురోను పట్టుకుని ఎత్తుకెళ్లామని అమెరికా ఈ రోజు గర్వంగా ప్రకటించుకుంటోంది కానీ.. ఇదే అమెరికా.. ఇదే సీఐఏ.. అదే […] -
GROK: గీత దాటిన గ్రోక్.. ఇది స్వేచ్ఛ కాదు.. విచ్చలవిడితనం..! చిన్నపిల్లల దుస్తులను తీసేసి..
శరీరంపై ధరించి ఉన్న చిన్నపిల్లల దుస్తులు మాయమయ్యాయి. గౌరవం చెరిగిపోయింది. చివరికి పిల్లల భద్రతే పగిలిపోయింది. ఇది స్వేచ్ఛ కాదు.. గ్రోక్ విచ్చలవిడితనానికి పరాకాష్ట! ఇది టెక్నాలజీ చాటున నైతికతపై జరిగిన అనైతిక దాడి. మనిషి గీసిన గీతను యంత్రం దాటిన ఆ క్షణం సభ్యసమాజాన్ని తలదించుకునేలా చేసింది. చిన్నపిల్లల ఫొటోలను, మహిళల ఫొటోలను అన్‌డ్రెస్ చేయాలని కామిస్టులు అడిగిన ప్రాంప్ట్‌ని గ్రోక్ తిరస్కరించలేదు. వారికి ఏం కావాలో అది క్రియేట్ చేసి చూపించింది. నిజానికి మీరు […] -
New Year 2026: యుద్ధాలు.. వాతావరణ విపత్తులు.. రోగాలు.. రెసెషన్..! 2026లో ఎలా ముందుకెళ్లాలి?
2025 మన సత్తాను ప్రశ్నించింది.. నీకు ఎంత వరకు నిలబడగలిగే శక్తి ఉందో పరీక్షించింది. ఉద్యోగాలు ఇచ్చినట్టు నటించి తీసుకుపోయింది. భద్రత చాటున భయాన్ని మిగిల్చింది. టెక్నాలజీతో ఏం సమస్య ఉండదని నమ్మించి మనిషి మెదడునే సందేహంలోకి నెట్టింది. ప్రపంచం అంతా ఒకేలా అనిపించింది. ఎక్కడ చూసినా ఒకే వార్తలు. యుద్ధాలు.. వాతావరణ విపత్తులు.. రోగాలు.. రెసెషన్.. మొత్తంగా భవిష్యత్తు మీద అనిశ్చితి. మరి ఈ ఏడాదిని చూసిన తర్వాత ఒక ప్రశ్న సహజంగా వస్తుంది. ఇక […]
తాజావార్తలు
-
Manchu Manoj: మంచు మనోజ్ కొత్త సినిమా.. పోతరాజు నేపథ్యంలో భారీ బడ్జెట్‌తో డివైన్ యాక్షన్ థ్రిల్లర్!
-
Mohan Bhagwat: స్మిత్ మచ్చర్ హిందూ విలువలకు నిదర్శనం.. ఆర్ఎస్ఎస్ చీఫ్ ప్రశంసలు..
-
Kim Jong Un Death Rumors: కిమ్ జోంగ్ ఉన్ మృతిపై పుకార్లు.. కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
-
SS Rajamouli-Varanasi: ఆరేడు సినిమాలను కలిపి ఒకే చిత్రంగా.. ‘వారణాసి’పై రాజమౌళి ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
-
Dussehra astrology: దసరా నుంచి ఈ 3 రాశుల వారికి త్రిగ్రాహి, లక్ష్మీనారాయణ, బుధాదిత్య యోగాలు..
ట్రెండింగ్
-
29kmpl మైలేజ్, 160PS పవర్, పనోరమిక్ సన్‌రూఫ్ తో Renault Duster Hybrid E-Tech లాంచ్..
-
Asian Para Games: తొలిరోజే 11 పతకాలు..! ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..
-
India Playing XI: రోహిత్-గిల్ ఓపెనర్స్.. కోహ్లీ మూడో స్థానంలో.! 2027 ప్రపంచ కప్ జట్టును ఎంపిక చేసిన టీమిండియా మాజీ ప్లేయర్.!
-
New Recharge Plans: డేటా అవసరం లేదా? కొత్త రీఛార్జ్ ప్లాన్స్ వచ్చేశాయ్.. రూ.185 నుంచి మొదలు.!
-
WPL 2027 Auction: 27 స్థానాల కోసం 146 మంది ప్లేయర్లు.. WPL వేలం తేదీ, వేదిక ఖరారు..!