మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. మరోసారి మద్యం ధరలు పెరిగిపోయాయి.. క్వార్టర్ సీసాపై ఏకంగా ఒకేసారి రూ.10 వడ్డించారు.. ఫారిన్ లిక్కర్ పై కూడా వడ్డించింది ప్రభుత్వం.
టీడీపీ అధినేత చంద్రబాబుపై మరోసారి తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఏలూరు జిల్లా నూజివీడులో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు పాలనలో అన్ని వర్గాలను మోసం చేశారని విమర్శించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంతా దోపిడినే జరిగింది.. ప్రజలకు మంచి చేసి చంద్రబాబు ఎప్పుడూ సీఎం కాలేదన్నారు. తొలిసారి వెన్నుపోటుతో, రెండోసారి కార్గిల్ యుద్ధం పుణ్యాన, మూడోసారి రుణమాఫీతో అధికారంలోకి వచ్చారంటూ పేర్కొన్నారు.
మెగా బ్రదర్స్‌పై సంచలన ఆరోపణలు చేశారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్.. విజయవాడలో పర్యటించిన ఆయన.. బందరు రోడ్డులోని వంగవీటి రంగా విగ్రహానికి నివాళులర్పించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వంగవీటి రంగా ఆత్మ క్షోభిస్తుందన్నారు.. వంగవీటి రంగా గురించి ఆలోచించిన కాపులు ఎవరూ తెలుగుదేశం పార్టీలో ఉండకూడదన్నారు. ప్యాకేజీ స్టార్ (పవన్ కల్యాణ్) కు 1000 కోట్ల రూపాయలు ఇచ్చారు.. దీంతో, కాపులను టీడీపీకి అమ్మేశారని పేర్కొన్నారు. 2009లో చిరంజీవి, ఇప్పుడు పవన్ కల్యాణ్.. కాపులను అమ్మేశారు అంటూ సంచలన వ్యాఖ్యలు…