-
Top Headlines @ 5 PM: టాప్ న్యూస్
Top Headlines, Andhra Pradesh, cinema, international, national, sports news, Telangana, India, Top Headlines @ 5 PM -
Posani Krishna Murali: పోసానిపై మరో ఫిర్యాదు.. ఉద్యోగం పేరుతో లక్షలు తీసుకొని మోసం..!
పోసానిపై మరో ఫిర్యాదు అందింది.. తనకు ఉద్యోగం ఇప్పిస్తా అని 9 లక్షల రూపాయలు తీసుకుని మోసం చేశారని టీడీపీ కేంద్ర కార్యాలయంలో కర్నూలు జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు.. కర్నూలు జిల్లాకు చెందిన సత్యనారాయణ అనే వ్యక్తి టీడీపీ గ్రీవెన్స్ లో పోసాని కృష్ణ మురళిపై ఫిర్యాదు చేశారు.. -
TTD: తెలంగాణ ప్రజాప్రతినిధులకు శుభవార్త.. సిఫార్సు లేఖలపై టీటీడీ కీలక నిర్ణయం
తెలంగాణ ప్రజాప్రతినిధులకు శుభవార్త చెప్పింది టీటీడీ.. మార్చి 24వ తేదీ నుంచి తెలంగాణ ప్రజా ప్రతినిధులు సిఫార్సు లేఖలు స్వీకరించబోతోంది టీటీడీ.. అయితే, తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలపై సోమవారం, మంగళవారాల్లో బ్రేక్ దర్శనాలు కల్పించనున్నారు టీటీడీ అధికారులు.. ఇక, బుధవారం ,గురువారం రోజుల్లో తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలపై 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను జారీ చేయనున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం స్పష్టం చేసింది. -
AP Cabinet Meeting: కాసేపట్లో ఏపీ కేబినెట్.. అజెండా ఇదే..
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మరి కాసేపట్లో సచివాలయంలో ఏపీ కేబినెట్ సమావేశం కానుంది.. ఈ సారి కూడా కేబినెట్ ముందు కీలక అంజెండా ఉంది.. సీఆర్డీఏ ఆథారిటీలో అమోదించిన 37,702 కోట్ల టెండర్ల గాను పనులు చేపట్టేందుకు అమోదం తెలపనుంది కేబినెట్.. ఇక, కేబినెట్ ఆమోదంతో టెండర్లు దక్కించుకున్న సంస్థలకు లెటర్ ఆఫ్ అగ్రిమెంట్లు జారీ చేయనుంది సీఆర్డీఏ.. ప్రస్తుతం సీఆర్డీఏ చేపట్టనున్న రూ.22,607 కోట్ల విలువైన 22 పనులకు కేబినెట్ ఆమోదముద్ర వేయనుంది.. అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ చేపట్టిన రూ.15,081… -
Byreddy Siddharth Reddy vs Byreddy Shabari: బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు.. బైరెడ్డి శబరి కౌంటర్ ఎటాక్..
ఉమ్మడి కర్నూలు జిల్లా పాలిటిక్స్ ఇప్పుడు బైరెడ్డి వర్సెస్ బైరెడ్డిగా మారుతున్నాయా అంటే.. అవును అనే విధంగానే ఆరోపణలు, విమర్శలు.. కౌంటర్లు, కౌంటర్ ఎటాక్‌లు నడుస్తున్నాయి.. కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేత బైరెడ్డి సిధార్థ రెడ్డి విరుచుకుపడ్డారు. ఆడదాం ఆంధ్ర పై విచారణకు అదేశించడంపై వ్యంగాస్త్రాలు సంధించారు. అయితే, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కూటమి ప్రభుత్వంపై చేసిన విమర్శలకు ఘాటుగా స్పందించారు నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి. -
BV Raghavulu: స్టీల్ ప్లాంట్‌కు కేంద్రం ప్యాకేజీ మోసపూరితం.. పవన్ ప్రసంగం విచిత్రంగా ఉంది..!
ఓ వైపు విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యవహారం.. మరోవైపు.. జనసేన అవిర్భావ సభలో పవన్ కల్యాణ్ ప్రసంగంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు.. విశాఖలోని కుర్మన్నపాలెం దీక్ష శిబిరాన్ని సందర్శించిన ఆయన.. స్టీల్ ప్లాంట్ కార్మికులకు అన్యాయం చేశారని విమర్శించారు.. వీఆర్ఎస్ పేరుతో కార్మికులను బయటకు పంపుతున్నారు.. కాంట్రాక్టు కార్మికులను తీసేస్తున్నారు.. పోరాటాలతో సాధించుకున్న స్టీల్ ప్లాంట్‌ను అమ్మేసి, ప్రైవేట్ స్టీల్ ప్లాంట్‌కు అనుమతిస్తున్నారని మండిపడ్డారు.. -
Tirupati Stampede: తిరుపతి తొక్కిసలాట ఘటన.. తిరుమలలో విచారణ కమిటీ ఆరా..
రుమలలో ఉన్న వ్యవస్థను స్వయంగా పరిశీలన జరిపారు. శ్రీవారి దర్శనార్థం విచ్చేసే భక్తులను క్యూలైన్లలో దర్శనానికి అనుమతించే విధానాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు.. ముందుగా నారాయణగిరి ఉద్యానవనంలో ఏర్పాటు చేసిన షెడ్ల వద్దకు చేరుకున్న ఆయన.. అటు తర్వాత వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్మెంట్లను పరిశీలన జరిపారు. -
CM Chandrababu: ఏ ఊరికి వస్తానో చెప్పను.. క్లీన్‌గా లేకపోతే అంతే..! సీఎం స్వీట్ వార్నింగ్..
అక్టోబర్ 2వ తేదీ తర్వాత ఏ ఊరికి వస్తానో చెప్పను.. పరిసరాలు శుభ్రంగా లేకపోతే మాత్రం సంబధిత అధికారులపై చర్యలు తప్పవంటూ వార్నింగ్ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. స్వర్ణ ఆంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర నా లక్ష్యం.. అక్టోబర్ 2 తేదీ నాటికి ఎక్కడ చెత్త లేకుండా చేయాలనే లక్ష్యంతో పనిచేయాలన్నారు.. -
AP Best Legislator Award: ఇక, ఏపీలో ఉత్తమ లేజిస్లేటర్ అవార్డు..!
పార్లమెంట్లో ఎంపీలకు ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు ఇచ్చినట్టుగానే.. ఆంధ్రప్రదేశ్‌లో ప్రతీ ఏడాది ఉత్తమ లెజిస్లేటర్ అవార్డు కూడా ఇచ్చేందుకు సిద్ధం అవుతోంది రాష్ట్ర ప్రభుత్వం.. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ 2025-26 సమావేశాల నుంచి వచ్చే ఏడాది బడ్జెట్ సమావేశాల వరకు సభలో సభ్యుల పనితీరును పరిగణనలోకి తీసుకుని.. ఉత్తమ లెజిస్లేటర్ అవార్డుకు ఎంపిక చేయబోతున్నారు.. -
YS Sunitha Reddy: వివేకా హత్య కేసుపై వైఎస్ సునీత సంచలన వ్యాఖ్యలు..
వైఎస్ వివేకా కేసులో ఇన్వెస్టిగేషన్ ఆగిపోయిందన్నారు వైఎస్ సునీత.. ఈ దారుణమైన హత్య గురించి పోరాడుతూనే ఉన్నా.. ఇంత అన్యాయం జరిగినా.. నాకు న్యాయం జరగలేదన్నారు.. అయినా, న్యాయపోరాటం ఆగేది లేదని స్పష్టం చేశారు. ఎంతవరకైనా పోరాటం చేస్తానన్న సునీత.. నిందితుల కంటే మాకు, మా కుటుంబానికి ఎక్కువ శిక్ష పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు..
తాజావార్తలు
-
Pakistan: అప్పులు చేసే పాకిస్తాన్, అప్పులిచ్చే IMFలో కీలక బాధ్యతలు..
-
AP Government: భవన నిర్మాణదారులకు గుడ్‌న్యూస్.. మున్సిపల్ సేవల్లో కీలక మార్పులు..
-
Nagarjuna: ‘పాన్ ఇండియాతో తలనొప్పి.. నా టార్గెట్ తెలుగే.. నన్ను నిలబెట్టింది ఇక్కడి ప్రేక్షకులే’
-
AP High Court: పుంగనూరు, రాయచోటి ఘటనలపై హైకోర్టులో విచారణ.. తీర్పు రిజర్వ్
-
IND W vs ZIM W: స్మృతి మంధాన కెప్టెన్సీలో కొత్త శకం.. జింబాబ్వేపై టాస్ గెలిచిన భారత్..
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!