-
Drought Hit Mandals: కరువు మండలాలను ప్రకటించిన ఏపీ ప్రభుత్వం..
కరువు ప్రభావిత మండలాలను ప్రకటించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. రాష్ట్ర వ్యాప్తంగా 6 జిల్లాల పరిధిలో 51 కరువు ప్రభావిత మండలాలు గుర్తించామని రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా ఉత్తర్వులు జారీచేశారు. ఇటీవల రాష్ట్ర విపత్తుల నిర్వహణ కార్యాలయంలో నిర్వహించిన కరువు ప్రభావ కమిటీ సమావేశంలో జిల్లాల కలెక్టర్లు, సంబంధిత శాఖలు సమర్పించిన నివేదికలను కమిటీ నిశితంగా పరిశీలించింది. -
Kakani Govardhan Reddy: నెల్లూరు, హైదరాబాద్‌లో లేని కాకాణి.. పోలీసుల గాలింపు..!
మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి విచారణ రేపటికి వాయిదా పడింది.. నేడు నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయానికి విచారణకు రావాల్సిందిగా నిన్న నోటీసులు జారీ చేశారు పోలీసులు.. ఆ నోటీసుల ప్రకారం.. ఇవాళ విచారణకు హాజరు కావాల్సి ఉండగా.. కాకాణి మాత్రం హాజరుకాలేదు.. ఆదివారం రోజు నెల్లూరులోని కాకాణి ఇంటికి నోటీసులు అంటించిన పోలీసులు.. ఈ రోజు హైదరాబాద్‌లోని కాకాణి నివాసానికి వెళ్లారు.. అక్కడ కూడా కాకాణి అందుబాటులో లేకపోవడంతో కుటుంబ సభ్యులకు నోటీసులు అందజేశారు.. రేపు ఉదయం 11 గంటలకు విచారణకు… -
Minister Nadendla Manohar: యువత కోసం పవన్ కల్యాణ్ తపన.. ఉత్తరాంధ్రకు భారీ పెట్టుబడులు వస్తాయి..!
యువత కోసం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తపన పడుతున్నారు.. ఉత్తరాంధ్రకు భారీ పెట్టుబడులు వస్తాయని తెలిపారు మంత్రి నాదెండ్ల మనోహర్.. విశాఖపట్నంలో ఆయన మాట్లాడుతూ.. ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు ఉత్తరాంద్ర యువతకు ఉపాధి కల్పించాలని తపన పడుతున్నతారు.. ఉత్తరాంద్రకు భారీ స్థాయిలో పెట్టుబడులు వస్తాయనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.. -
Minister Nara Lokesh: విశాఖను ఒక బ్రాండ్‌గా మారుస్తాం.. 2029లోపు 5 లక్షల ఐటీ ఉద్యోగాలు..
విశాఖను ఆంధప్రదేశ్ ఐకానిక్ క్యాపిటల్ గా మార్చుతాం.. విశాఖ రీజియన్ పెట్టుబడులకు కేంద్రంగా మారుతోందన్నారు మంత్రి నారా లోకేష్.. ఆర్థిక వృద్ధిలో విశాఖను దేశంలోనే ఐదవ స్థానంలో నిలపాలనేది లక్ష్యంగా పెట్టుకున్నామన్న ఆయన.. విశాఖను ఒక బ్రాండ్ గా మార్చుతాం.. విశాఖలో 2029లోపు 5 లక్షల ఐటీ ఉద్యోగాలను కల్పిస్తామని స్పష్టం చేశారు.. -
Kethireddy Venkatarami Reddy: పైలట్ అవతారం ఎత్తిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి..
ఇప్పుడు పైలట్ అవతారం ఎత్తారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి.. ఛాపర్ నడిపి ఔరా..! అనిపించి మరోసారి వార్తల్లో నిలిచారు.. ఛాపర్ లో హైదరాబాద్ పరిసరాల్లో చక్కర్లు కొట్టారు.. సోషల్ మీడియాలో కేతిరెడ్డి షేర్ చేసిన వీడియోలు.. హైటెక్ సిటీ పరిసర ప్రాంతాలను కూడా గమనించవచ్చు.. -
Yarlagadda Venkata Ramana: బీజేపీలో చేరిన తానా ఫౌండేషన్ ఛైర్మన్ యార్లగడ్డ
భారతీయ జనతా పార్టీలో చేరారు ఎన్నారై, ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) ఫౌండేషన్ ఛైర్మన్ యార్లగడ్డ వెంకటరమణ.. బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి సమక్షంలో బీజేపీ గూటికి చేరారు.. యార్లగడ్డకు పార్టీ కండువా కప్పి బీజేపీలోకి ఆహ్వానించారు పురంధేశ్వరి.. -
Kakani Govardhan Reddy: మాజీ మంత్రి కోసం హైదరాబాద్‌కు నెల్లూరు పోలీసులు..
ఈ రోజు మాజీ మంత్రి కాకాణి గోవర్దన్‌రెడ్డికి నోటీసులు జారీ చేసేందుకు హైదరాబాద్‌కు వెళ్లారు నెల్లూరు పోలీసులు.. నిన్న సాయంత్రం నెల్లూరులోని ఇంట్లో కాకాణి లేకపోవడంతో గేట్‌కు నోటీసులు అంటించారు పోలీసులు.. ఇక, హైదరాబాద్‌లోని ఇంట్లో కుటుంబ సభ్యులతో ఉగాది జరుపుకుంటున్నట్లు సామాజిక మాధ్యమాల్లో ఫొటోలు పెట్టారు కాకాణి గోవర్ధన్‌రెడ్డి.. దీంతో, కాకాణి.. హైదరాబాద్ లో ఉన్నారనే సమాచారంతో అక్కడికే బయల్దేరి వెళ్లారు.. -
Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి చుక్కెదురు..
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్‌కు కోర్టులో చుక్కెదురైంది.. సత్య వర్ధన్ కిడ్నాప్ కేసులో వల్లభనేని వంశీకి ఎదురు దెబ్బ తగిలింది.. వంశీ బెయిల్ పిటిషన్‌ను డిస్మిస్ చేసింది విజయవాడలోని ఎస్సీ, ఎస్టీ కేసుల ప్రత్యేక న్యాయస్థానం.. -
YSRCP VS BJP: వైసీపీ వర్సెస్ బీజేపీ.. యువ నేతల మాటల యుద్ధం..
వైసీపీ, బీజేపీ యువ నేతల మాటల యుద్ధం నడుస్తోంది.. టీటీడీ పాలకమండలి సమావేశంలో తిరుపతి స్పోర్ట్స్ కాంప్లెస్ కు కోటి రూపాయల విడుదల చేయడంపై వివాదం మొదలైంది.. తిరుపతి పారిశుధ్య పనులకు టీటీడీ నిధులు కేటాయించినప్పుడు అడ్డుకున్న భానుప్రకాష్ రెడ్డి.. శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ కు నిధులు కేటాయింపుపై ఏ సమాధానం చెప్తారంటూ భూమన అభినయ్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు.. -
AP Crime: మెడికల్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం.. వెలుగులోకి సంచలన అంశాలు..!
రాజమండ్రి కిమ్స్ హాస్పిటల్ లో విధి నిర్వహణలో ఉండగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వైద్య విద్యార్థిని అంజలి ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తుంది. రాజమండ్రి కిమ్స్ హాస్పిటల్ సూపర్వైజర్ దీపక్ లైంగిక వేధింపులు కారణంగా మనస్థాపనతో అంజలి.. పాయిజన్ తీసుకోవడం వలన మజిల్స్ దెబ్బతిని వెంటిలేటర్ మీద ఉంది.. బ్లీడింగ్ ఆగిపోవడం వలన బ్రెయిన్ కి డ్యామేజ్ అవ్వడంతో వెంటిలేటర్ సపోర్ట్ తో డైలీ మానిటరింగ్ చేస్తున్నారు..
తాజావార్తలు
-
Keerthy Suresh : వరుస ఫ్లాప్స్ నుంచి బయటపడేనా?.. కీర్తి సురేష్ ఆశలన్నీ ఆ సినిమాలపైనే!
-
Jailer 2 కలెక్షన్ల సునామీ.. తొలిరోజే రూ.125 కోట్లు.. అయినా ఆ రెండు సినిమాల రికార్డులు సేఫ్..!
-
Supreme Court: సీజేపీకి సుప్రీంకోర్టులో ఊరట.. తిరంగా మార్చ్‌పై తక్షణ ఆదేశాలకు నిరాకరణ!
-
TDP vs YCP: పుంగనూరులో ఉద్రిక్తత.. వైసీపీ శ్రేణులపై టీడీపీ కార్యకర్తల రాళ్ల దాడి!
-
Punam Raut Retires: “చాలా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నా”.. రిటైర్మెంట్ ప్రకటనపై పూనమ్ భావోద్వేగం..
ట్రెండింగ్
-
Pappu Chakodilu: స్వీట్ షాప్ స్టైల్ క్రిస్పీ ‘పప్పు చకోడీలు’.. ఇంట్లోనే పర్ఫెక్ట్గా సులువుగా ఇలా తయారు చేసుకోండి.!
-
కారుతో రోడ్డుపైనే కాదు, గాల్లోనూ ప్రయాణం.! Elon Musk సంచలన డెమో.. గాల్లోకి దూసుకెళ్లిన Tesla Roadster..
-
డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, పెర్ఫార్మన్స్.. ఐఫోన్ నుంచి గెలాక్సీ వరకు.. బెస్ట్ Foldable Phones ఇవే..!
-
కేవలం 25 కార్లే.. వచ్చీ రాగానే సేల్ అవుట్.! Jeep Wrangler Whitecap Mojito లాంచ్..
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!