-
ఆగని పెట్రో బాదుడు.. మే నుంచి 27వ సారి వడ్డింపు..
పెట్రో బాదుడు కొనసాగుతూనే ఉంది.. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమయంలో.. పెట్రో ధరలకు బ్రేక్ పడింది.. ఇక, ఆ తర్వాత మే 4వ తేదీ నుంచి వరుసగా పెరుగుతూ పోతున్నాయి చమురు ధరలు.. ఇప్పటి వరకు 27 సార్లు వడ్డించాయి చమురు కంపెనీలు.. ఇక, ఇవాళ పెట్రోల్, డీజిల్ ధరలను మరింత పెంచారు.. లీటర్ పెట్రోల్‌పై 27 పైసలు, లీటర్ డీజిల్‌పై 30 పైసల చొప్పున పెంచాయి ఆయిల్ సంస్థలు.. తాజా వడ్డింపుతో కలిపి హైదరాబాద్‌లో […] -
జాబ్ క్యాలెండర్ విడుదల చేయనున్న సీఎం జగన్.. 10,143 ఉద్యోగాల భర్తీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేయనున్నారు.. 2021-22లో వివిధ శాఖల్లో భర్తీ చేయనున్న పోస్టుల వివరాలను వెల్లడించనున్నారు.. ఉద్యోగాల ఖాళీలు ప్రకటించి, వాటిని క్రమంగా భర్తీ చేయనున్నారు. విద్య, వైద్యం, పోలీసు శాఖల్లో పోస్టుల భర్తీకి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది.. అత్యంత పారదర్శకంగా ఉద్యోగ నియామకాలు చేపట్టాలని.. అవినీతి, వివక్షకు తావులేకుండా మెరిట్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీ చేపట్టాలని పలు సందర్భాల్లో సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు.. మొత్తంగా […] -
నేడు శ్రీశైలానికి సీజేఐ ఎన్వీ రమణ..
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు జస్టిస్ ఎన్వీ రమణ.. మొదట తిరుమల వెళ్లి శ్రీవారిని దర్శించుకున్న ఆయన.. ఆ తర్వాత హైదరాబాద్ వచ్చి రాజ్‌భవన్‌లో బస చేస్తున్నారు.. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు ఆయనను కలిసి అభినందనలు తెలియజేశారు. ఇక, యాదాద్రి వెళ్లి శ్రీ లక్ష్మీనర్సింహాస్వామిని దర్శించుకున్న సీజేఐ దంపతులు.. నిర్మాణంలో ఉన్న యాదాద్రి ఆలయాన్ని పరిశీలించారు. ఇక, ఇవాళ శ్రీశైలం వెళ్లనున్నారు చీఫ్ జస్టిస్ దంపతులు.. ఇవాళ […] -
ఇక మాస్క్‌లు అవసరంలేదు.. సర్కార్ నిర్ణయం.. ఎక్కడంటే..?
కరోనా మహమ్మారి చాలా దేశాల కంటిపై కునుకు లేకుండా చేసింది.. ఏ దేశంలో గణాంకాలు పరిశీలించిన.. భారీగా కేసులు, పెద్ద సంఖ్యలో మృతుల సంఖ్య కలవరపెట్టింది.. ఇక, ఫ్రాన్స్‌ను కూడా అతలాకుతలం చేసింది కోవిడ్.. అయితే, ఇప్పుడు క్రమంగా అక్కడ పరిస్థితి అదుపులోకి వచ్చింది.. కేసులు తగ్గిపోయాయి.. మరోవైపు వ్యాక్సినేషన్ కూడా పుంజుకుంది… దీంతో.. కీలక నిర్ణయం తీసుకుంది ఫ్రాన్స్.. ఈ నెల 20వ తేదీ నుంచి రాత్రికర్ఫ్యూను సడలించాలనే నిర్ణయానికి వచ్చింది. అంతేకాదు, ఇకపై బహిరంగ […] -
ప్లాట్‌ఫాం టికెట్‌తోనే రైలులో ప్రయాణం..! క్లారిటీ ఇచ్చిన రైల్వే
సోషల్ మీడియాలో వైరల్ కావడమే కాదు.. మీడియాకు ఎక్కిన ఓ వార్త గురించి క్లారిటీ ఇచ్చింది దక్షిణ మధ్య రైల్వే.. ప్లాట్‌ఫాం టికెట్‌తోనే రైల్లో ప్రయాణించే అవకాశం లేదని స్పష్టం చేసింది.. అసలు ఆ మేరకు ఉత్తర్వులు ఇచ్చినట్టు జరుగుతోన్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని పేర్కొన్నారు.. ప్లాట్‌ఫాం టికెట్ తీసుకున్న ప్రయాణికులు రైల్వో టీటీఈ దగ్గరకు వెళ్లి టికెట్ తీసుకునే అవకాశం లేదని వివరణ ఇచ్చింది దక్షిణ మధ్య రైల్వే.. కాగా, ప్లాట్‌ఫాం టికెట్ తీసుకున్న […] -
కేబుల్ టెలివిజన్ నెట్వర్క్ రూల్స్ సవరణ.. నోటిఫికేషన్ జారీ
టీవీ ఛానెళ్ల ప్రసారాల్లో ఇప్పటికీ ప్రజలు పలు ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నారు.. అయితే, పౌరుల సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం టీవీ ఛానెళ్ల కోసం చట్టపరమైన యంత్రాంగాన్ని రూపొందించింది. కేబుల్ టెలివిజన్ నెట్వర్క్స్ నిబంధనలు, 1994 సవరణకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. టీవీ ఛానల్స్‌లో ప్రసారమయ్యే కార్యక్రమాలపై ప్రేక్షకుల నుంచి వచ్చే ఫిర్యాదులను పరిష్కరించేందుకు కేంద్రం పటిష్ఠమైన వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ తెలిపారు. ఈ మేరకు […] -
టెక్కీలకు ఉద్యోగ గండం..!
ఐటీ కంపెనీల్లో ఉద్యోగం అంటే నేటి యువతకు మక్కువ ఎక్కువ.. వర్క్ టెన్షన్ సంగతి ఎలా ఉన్న.. మంచి వేతలనాలు ఉండడంతో.. క్రమంగా యూత్ అటు మొగ్గు చూపుతుంది.. అయితే, టెక్నాలజీ రంగంలో ఉన్న దేశీయ సాఫ్ట్వేర్ సంస్థలు వేగంగా ఆటోమేషన్‌కు మారుతున్నాయి.. దేశీయ ఐటీ కంపెనీల్లో ఆటోమేషన్ వల్ల ఉద్యోగులపై తీవ్ర ప్రభావం పడుతుందని.. దీంతో.. పెద్ద ఎత్తున సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగాల కోత పడనుంది తన నివేదికలో పేర్కొంది బ్యాంక్ ఆఫ్ అమెరికా.. ప్రస్తుత […] -
బ్రేకింగ్: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో గ్యాస్ లీక్.. ఒకరు మృతి
హైదరాబాద్‌లోని శంషాబాద్ అంతర్జాతీయ విమనాశ్రయంలో గ్యాస్ లీకేజీ ఘటన కలకలం సృష్టించింది.. ఎయిర్‌పోర్ట్‌లో గ్యాస్ లీక్ కావడంతో.. ఊపిరాడక ముగ్గురు వ్యక్తులు స్పృహకోల్పోయారు.. ఆ ముగ్గురు వ్యక్తులను ఎయిర్పోర్ట్ సిబ్బంది వెంటనే ఎయిర్‌పోర్ట్‌లోని ఆస్పత్రికి తరలించారు.. ఆస్పత్రిలో చికిత్సపొందుతూ నర్సింహారెడ్డి అనే వ్యక్తి మృతిచెందినట్టుగా చెబుతున్నారు.. మరో ఇద్దరు వ్యక్తులు జాకీర్, ఇలియాస్ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. గ్యాస్ పైప్ లీక్ కావడంతో ప్రమాదం జరిగినట్టుగా చెబుతున్నారు ఎయిర్పోర్ట్ అధికారులు.. ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం […] -
వాహనదారులకు శుభవార్త.. డీఎల్, ఆర్సీ వ్యాలిడిటీ పొడిగింపు
ఓవైపు కరోనా మహమ్మారి.. మరో వైపు లాక్డౌన్లు, కర్ఫ్యూల నేపథ్యంలో.. వాహనదారులకు గుడ్‌న్యూస్ చెప్పింది కేంద్రం.. డ్రైవింగ్ లైసెన్స్(డీఎల్), రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్(ఆర్సీ) వంటి డాక్యుమెంట్ల వ్యాలిడిటీని పొడిగించింది.. గత ఏడాది ఫిబ్రవరి 1వ తేదీ నాటికి ముగిసిన అన్ని వాహన పత్రాల గడువును గతంలో ఈ నెల 30వ తేదీ వరకు పొడిగించిన కేంద్రం.. ఇవాళ వ్యాలిడిటీని ఈ ఏడాది సెప్టెంబర్ 30వ తేదీ వరకు పొడిగిస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు రోడ్డు మరియు రవాణా, రహదారుల […] -
మరోసారి ఎంసెట్ దరఖాస్తుల గడువు పొడిగింపు
కరోనా మహమ్మారి కారణంగా కొన్ని పరీక్షలు రద్దు కాగా.. మరికొన్ని పోటీ పరీక్షలను వాయిదా వేస్తూ వస్తోంది తెలంగాణ ప్రభుత్వం.. లాక్డౌన్ నేపథ్యంలోనూ మరికొన్ని పరీక్షలు వాయిదా పడుతున్నాయి.. ఇక, జులైలో జరగనున్న ఎంసెట్ పరీక్షలకు దరఖాస్తు గడువును మరోసారి పొడిగించింది ప్రభుత్వం.. ఎంసెట్ ఆన్లైన్ దరఖాస్తులను ఎలాంటి అపరాద రుసుం లేకుండా ఈ నెల 24వ తేదీ వరకు స్వీకరించనున్నట్టు ఎంసెట్ కన్వీనర్ ప్రకటించారు.. లాక్డౌన్ కారణంగా.. విద్యార్థుల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని […]
తాజావార్తలు
-
Story Board : ట్రంప్ తలనొప్పిని రెండున్నరేళ్లు భరించక తప్పదా..?
-
BRICS Trade Unions Summit : హైదరాబాద్‌లో బ్రిక్స్ ట్రేడ్ యూనియన్స్ సమ్మిట్
-
TMC: హెడ్ క్వార్టర్స్ కోల్పోయిన మమతా బెనర్జీ.. తృణమూల్ సంక్షోభం తీవ్రం..
-
Khamenei: ఖమేనీ అంత్యక్రియల్లో హృదయ విదారక దృశ్యం.. 14 నెలల మనవరాలి పార్థివదేహం
-
OTR: తాండూరు కాంగ్రెస్‌లో గ్రూప్ వార్.. ఎమ్మెల్యే vs ఎమ్మెల్సీ పోరు ముదిరిందా?
ట్రెండింగ్
-
Indonesia: దొంగతనానికి వచ్చి ‘మమ్మీ’లుగా మారిపోయారు.. వైరల్ వీడియో
-
Instagram: ఇంస్టాగ్రామ్కు కేంద్రం నోటీసులు.!
-
Smoking While Drinking Tea: ‘టీ’తో పాటు ‘సిగరెట్’ తాగుతున్నారా.? ఆ రోగాలకు రెడ్ కార్పెట్ పరిచినట్లే.!
-
Home Tips : ఇంట్లోకి తేళ్లు రాకుండా ఉండాలా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
14 రోజుల బ్యాటరీ, AMOLED డిస్ప్లేతో HUAWEI Band 11 సిరీస్ భారత్‌లో లాంచ్..!